E-Paper
Advertisement

రీల్స్ చూస్తూ నిద్ర రావడం లేదా? జీవితంలో ప్రశాంతత కోసం డిజిటల్ డిటాక్స్ ఇలా చేయండి

రీల్స్ చూస్తూ నిద్ర రావడం లేదా? జీవితంలో ప్రశాంతత కోసం డిజిటల్ డిటాక్స్ ఇలా చేయండి
Advertisement

స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగమైపోయాయి. పని, వినోదం, షాపింగ్, కమ్యూనికేషన్ అన్నీ ఫోన్ ద్వారా జరుగుతున్నాయి. కానీ అధిక స్క్రీన్ టైమ్ ఒత్తిడి, మానసిక అలసటను పెంచుతుంది. డిజిటల్ డీటాక్స్ అలవాట్లు ఫోకస్ మెరుగుపరచి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

డిజిటల్ డీటాక్స్ అంటే ఏమిటి?

డిజిటల్ డీటాక్స్ అంటే మొబైల్, ల్యాప్‌టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం కొంత సమయం వరకు తగ్గించుకోవడం. సోషల్ మీడియా, నోటిఫికేషన్లు, అనవసర ఫోన్ వినియోగం తగ్గించాలి. ఇది మనసును రిలాక్స్ చేసి ప్రశాంతతనిస్తుంది. పూర్తిగా ఫోన్ వినయోగం మానేయాల్సిన అవసరం లేదు. సరైన పరిమితులు మాత్రమే పాటించాలి.

అధిక ఫోన్ వాడకం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది

Advertisement

నిరంతరం నోటిఫికేషన్లు, స్క్రోలింగ్ మనసుకు ఒత్తిడి ఇస్తాయి. ఇది నిద్ర, ఏకాగ్రత, మానసిక సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఆందోళన, స్ట్రెస్ కూడా పెరుగుతాయి.

స్క్రీన్ టైమ్ ట్రాక్ చేయడం ద్వారా ప్రారంభించండి

ఫోన్‌లో ఉన్న స్క్రీన్ టైమ్ ఫీచర్‌ను చూడండి. ఏ యాప్స్ ఎక్కువ సమయం తీసుకుంటున్నాయో తెలుసుకోండి. ఇది మంచి అలవాట్లను ప్రోత్సహిస్తుంది.

అనవసర నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి

Advertisement

అనవసర నోటిఫికేషన్లు మానసికంగా ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తాయి. సోషల్ మీడియా నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ముఖ్యమైన కాల్స్ మాత్రమే అనుమతించండి. ఇలా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది.

ఇంట్లో ఫోన్ ఉపయోగించని ఫ్రీ జోన్లు సృష్టించండి

డైనింగ్ టేబుల్, బెడ్‌రూమ్‌లో ఫోన్ ఉంచకండి. దీని వల్ల కుటుంబ సభ్యులతో బాగా మాట్లాడేందుకు సమయం లభిస్తుంది. నిద్రపోయే ముందు ఫోన్ వాడకండి.

స్క్రోలింగ్‌ బదులు ఆఫ్‌లైన్ యాక్టివిటీస్ చేయండి

ఖాళీ సమయంలో ఫోన్ చేతికి రాకుండా పుస్తకాలు చదవండి, వాకింగ్ చేయండి, పెయింటింగ్ లేదా గార్డెనింగ్ చేయండి. ఇవి మీలో క్రియేటివిటీని పెంచడంతో పాటు మన:శాంతినిస్తాయి.

ఉదయం లేవగానే, నిద్రపోయే ముందు ఫోన్ మానండి

ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడకండి. రాత్రి నిద్రపోయే ముందు కూడా ఫోన్ దూరంగా ఉంచండి. ఇలా చేస్తే నిద్ర త్వరగా వస్తుంది.

అనవసర యాప్స్ తొలగించండి

ఎక్కువగా ఉపయోగించని యాప్స్ డిలీట్ చేయండి. గ్రే స్కేల్ మోడ్ ఆన్ చేస్తే ఫోన్‌ పట్ల ఆకర్షణ తగ్గుతుంది.

Also Read: సమాజంలో అందరూ మిమ్మల్ని అవమానిస్తున్నారా? చాణక్య నీతిలో దీనికి కారణాలు ఇవే

ఎక్కువ సమయం బయట గడపండి

బయట వాకింగ్, వ్యాయామం చేస్తూ స్నేహితులతో సమయం గడపడం వల్ల మానసిక అలసట తగ్గుతుంది.

రోజువారీ స్క్రీన్ టైమ్ పరిమితి పెట్టండి

యాప్ టైమర్లు ఉపయోగించి సమయం నియంత్రించండి. చిన్న చిన్న స్వయం టార్గెట్స్ సెట్ చేస్తూ ప్రారంభించండి.

డిజిటల్ డీటాక్స్ సంబంధాలను మెరుగుపరుస్తుంది

ఫోన్ లేకుండా కుటుంబం, స్నేహితులతో మాట్లాడటం వల్ల బంధాలు బలపడతాయి. చిన్న చిన్న మార్పులు ద్వారా డిజిటల్ డీటాక్స్ చేయవచ్చు. ఇది స్ట్రెస్ తగ్గించి, నిద్ర మెరుగుపరచి, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తుంది.

Related News

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

తెల్లని బట్లలు పాతబడి పసుపుపచ్చగా మారుతున్నాయా? మళ్లీ మెరిసిపోయే తెల్లదనం కోసం టిప్స్

ఫైనాన్షియల్ మాస్టర్స్.. ఈ 3 తేదీల్లో పుట్టినవారు ఏ బిజినెస్ చేసినా సూపర్‌హిట్

కడుపు బరువుగా అనిపిస్తుందా? భోజనం తర్వాత పైనాపిల్ తింటే చాలా ప్రయోజనాలు

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? రోజూ ఈ వ్యాయామం చేస్తే మంచి గాఢనిద్ర మీ సొంతం

Zomatoలో ఈ టేస్టీ ఫుడ్స్ ఇక దొరకవ్..ఎందుకంటే ?

Big Stories

Advertisement
×