E-Paper
Advertisement

Dreams: తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా?.. ఈ విషయంలో సైన్స్ ఏం చెబుతోందంటే!

Dreams: తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా?.. ఈ విషయంలో సైన్స్ ఏం చెబుతోందంటే!
Advertisement

Dreams: మనిషి గాఢనిద్రలో ఉన్నప్పుడు కలల రావడం అనేది సర్వ సాధారణం. ఈ డ్రీమ్స్.. మనిషి యొక్క ఆలోచనలు, భయాలు, కోరికలు, గతంలో జరిగిన సంఘటనల ప్రతిబింబాలే. అయితే, కలలు ఎక్కువగా తెల్లవారుజామునే వస్తుంటాయి. నిద్రావస్థ చరమదశ తెల్లవారుజాము కాబట్టి.. ఆ సమయంలో వచ్చే కలలు కొందరికి బాగా గుర్తుంటాయి. దీంతో చాలామంది తెల్లవారి వచ్చే డ్రీమ్స్ నిజం అవుతాయని నమ్ముతుంటారు. మరి తెల్లవారుజామున వచ్చే కలలు నిజంగానే నిజామావుతాయా? దీని గురించి సైన్స్ ఏం చెబుతోంది.. వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా.

ఆందోళన అక్కర్లేదు: 

తెల్లవారుజామున మెలకువ ఉన్నప్పటికీ కళ్లు మూసుకొని పడుకుంటే.. మెదడు చేతనావస్థలో ఉన్నాకూడా మనకు మంచి నిద్ర లభిస్తుంది. దీంతో నిద్రపట్టలేదు, మెలకువగానే ఉన్నామని అనుకున్నప్పటికీ, ఆ సమయంలో కూడా వచ్చిన కలలను గమనించే వీలు కలుగుతుంది.

Advertisement

Read Also: స్కిన్నీ జీన్స్ సిండ్రోమ్.. ఆరోగ్యానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్న ఫ్యాషన్ ట్రెండ్!

మనిషి డీప్ స్లీప్‌లోకి చేరుకున్నప్పుడు కలలు రావడం సాధారణమైన విషయం. దీంతో కలలు రావడం వలనే నిద్ర సరిగ్గా పట్టడం లేదని ఆందోళన చెందనవసరం లేదు. సృజనాత్మకత ఎక్కువగా ఉన్నవారికి సహజంగా కలలు ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతుంటారు. కొన్నిసార్లు భయం పుట్టించే కలలు వచ్చినప్పుడు మాత్రం.. గుండె కొట్టుకునే వేగం, ఊపిరి పీల్చే వేగంలో మార్పులు కనిపిస్తాయి. ఇలా జరిగినప్పుడు చాలామందికి మెలుకువ వచ్చేస్తుంటుంది.

కేవలం అపోహ మాత్రమే:

Advertisement

తెల్లవారుజామున ముందు రోజు చేసిన పనుల తాలూకు ఆలోచనలకు సంబంధించిన కలలే ఎక్కువగా వస్తుంటాయి. డ్రీమ్స్.. ఎప్పుడో ఒకసారి యాదృచ్ఛికంగా నిజం కావొచ్చు తప్ప, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయనేది కేవలం అపోహ మాత్రమే అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మానసిక నిపుణులు ఏం చెబుతున్నారంటే.. నిద్రకు భంగం కలిగించేలా.. కలలు ఎక్కువగా వస్తున్నప్పుడు  పగటిపూట సంతోషకరమైన అంశాలపై దృష్టి పెట్టాలని. మీకొచ్చే కలలకు అంత ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర విషయాలపై మనసును మళ్లించాలని సూచిస్తున్నారు. మనిషి గాఢనిద్రలో ఉన్నప్పుడు కొన్ని దశల్లో భాగంగా మనస్సులో అసంకల్పితంగా సంభవించే ఆలోచనలు, భావోద్వేగాల అనుభూతులే కలలు. అంతేగానీ.. అలాంటి వాటిని ఆధారంగా చేసుకొని ఇలా అయితే మంచి జరుగుతుందని, అలా అయితే చెడు జరుగుతుందని నిర్ధారించలేమని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read Also: స్త్రీలు అలంకరణ కోసమే గాజులు ధరిస్తారా?.. దీని వెనుకున్న అసలు రహస్యం ఇదే!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×