E-Paper
Advertisement

Sleep with Lights on: రాత్రిపూట లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? మీకెంత డ్యామెజ్ అవుతుందో తెలుసా?

Sleep with Lights on: రాత్రిపూట లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? మీకెంత డ్యామెజ్ అవుతుందో తెలుసా?
Advertisement

ఇప్పటి జీవనశైలిలో చాలా మందికి ఒక అలవాటు ఉంది.. అది గదిలో లైట్ ఆన్‌లో ఉంచుకుని లేదా టీవీ చూస్తూ నిద్రపోవడం. కొందరికి ఇది పూర్తి అలవాటుగా మారుతుంది. కానీ డాక్టర్లు మాత్రం ఈ అలవాటు ఆరోగ్యానికి మేలు చేయదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇది మన శరీరంలోని హార్మోన్లు, నిద్ర నాణ్యత, మెటబాలిజం మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. మన శరీరంలో సహజంగా పనిచేసే ప్రక్రియ సిర్కాడియన్ రిథమ్ . ఇది వెలుతురు, చీకటి ఆధారంగా పనిచేస్తుంది. రాత్రి చీకటి పడినప్పుడు మన శరీరం మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ మనకు నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. కానీ గదిలో లైట్లు లేదా టీవీ వెలుతురు ఉంటే, శరీరం ఇంకా పగలు ఉన్నట్టుగా భావిస్తుంది. దీంతో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా నిద్ర సరిగా పడదు. బయటకు చూస్తే మనం నిద్రపోయినట్టే కనిపించినా, లోపల శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోదు.

టీవీ ఆన్ చేసి నిద్రపోతే
టీవీ ఆన్‌ చేసి నిద్రపోవడం ఇంకా ఎక్కువగా హానికరం. ఎందుకంటే టీవీ కేవలం కాంతి మాత్రమే కాదు, శబ్దం కూడా ఇస్తుంది. ఆ శబ్దం, మారుతూ ఉండే వెలుతురు మెదడును పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వవు. మెదడు ఎప్పుడూ అర్ధ నిద్రలోనే ఉంటుంది. దీని వల్ల డీప్ స్లీప్ దశ తగ్గిపోతుంది. ఉదయం లేచినప్పుడు అలసటగా, మత్తుగా అనిపిస్తుంది. రోజంతా పని మీద ఫోకస్ తగ్గిపోతుంది. ఈ అలవాటు మన హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. రాత్రి సమయంలో శరీరం హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. కానీ లైట్ ఉన్నప్పుడు ఈ ప్రక్రియలో అంతరాయం కలుగుతుంది. మెలటోనిన్ తగ్గిపోవడంతో పాటు స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి. దీని ప్రభావం మెటబాలిజంపై పడుతుంది. అంటే మన శరీరం శక్తిని ఉపయోగించే విధానం గందరగోళం అవుతుంది. దీర్ఘకాలంలో ఇది బరువు పెరగడం, షుగర్ లెవల్స్ పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది.

Advertisement

Also read: Goddess Lakshmi: మహిళలు చేసే ఈ తప్పులు.. ఇంట్లో డబ్బుల కష్టాలు తెచ్చిపెడతాయి

బరువు పెరిగిపోతారు
కొన్ని అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రాత్రిళ్లు లైట్లు ఆన్‌లో ఉంచుకుని నిద్రపోయే వాళ్లలో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని. కొన్ని సంవత్సరాల్లో గణనీయమైన బరువు పెరుగుదల కూడా కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం మెటబాలిజం లో మార్పులు, హార్మోన్ల అసమతుల్యత. లైట్లు ఉన్న వాతావరణంలో నిద్రపోవడం మెదడు ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోకపోవడంతో జ్ఞాపకశక్తి తగ్గిపోవచ్చు. స్ట్రెస్, ఆందోళన పెరిగే అవకాశముంది. గుండె ఆరోగ్యంపైనా దీని ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also read: Excessive cold: వేసవిలో కూడా చలి వేస్తుందా? అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్టే

ఇలా చేయండి
నిద్రపోయే ముందు గదిలోని లైట్లు తగ్గించడం లేదా పూర్తిగా ఆఫ్ చేయడం మంచిది. టీవీ, మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను నిద్రకు కనీసం అరగంట ముందే ఆఫ్ చేయాలి. గది పూర్తిగా చీకటి ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకునే అలవాటు పెంచుకోవాలి. ఇవి పాటిస్తే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. లైట్లు ఆన్‌లో లేదా టీవీతో నిద్రపోవడం చిన్న అలవాటు అనిపించినా, దీని ప్రభావం పెద్దదే. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ అలవాట్లను మార్చుకోవడం చాలా అవసరం.

Related News

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

Big Stories

Advertisement
×