E-Paper
Advertisement

Excessive cold: వేసవిలో కూడా చలి వేస్తుందా? అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్టే

Excessive cold: వేసవిలో కూడా చలి వేస్తుందా? అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్టే
Advertisement

వాతావరణం పెద్దగా చల్లగా లేకపోయినా మీకు ఎప్పుడూ చల్లగా అనిపిస్తుందా? ఎక్కువగా దుప్పటి కప్పుకోవడానికే ఇష్టపడుతున్నారా? దాన్ని చిన్న విషయంగా తీసుకోకూడదని చెబుతున్నారు వైద్య నిపుణులు. చాలా మంది ఇది సహజం అనుకుని పట్టించుకోరు. కానీ తరచూ ఇలా చల్లగా అనిపించడం శరీరంలో దాగి ఉన్న అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. సాధారణంగా చలి అనిపించడం వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడూ చల్లగా అనిపిస్తే అది శరీరం అనారోగ్యానికి సంకేతంగా చూడాలి. ముఖ్యంగా మన శరీరంలోని హార్మోన్లు, రక్తప్రసరణ, మెటబాలిజం వంటి వ్యవస్థలు సరిగా పనిచేయకపోతే ఈ సమస్య కనిపిస్తుంది.

రక్తహీనత
డాక్టర్లు చెబుతున్న ముఖ్య కారణాల్లో అనీమియా (రక్తహీనత) ఒకటి. అంటే శరీరంలో ఐరన్ తక్కువగా ఉండటం. ఐరన్ తగ్గితే రక్తం సరైన విధంగా ఆక్సిజన్‌ను తీసుకెళ్లలేకపోతుంది. దీంతో శరీరం తగినంత వేడి ఉత్పత్తి చేయలేకపోతుంది. అలాంటి పరిస్థితిలో చేతులు, కాళ్లు ఎప్పుడూ చల్లగా ఉండటం, అలసట ఎక్కువగా ఉండటం, ముఖం పసుపు రంగులో కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Also read: Plants without Soil: మట్టి అవసరం లేకుండా నీటిలోనే ఈ మొక్కలను సులువుగా పెంచేయండి

థైరాయిడ్
ఇక థైరాయిడ్ సమస్యలు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. మన మెడలో ఉండే థైరాయిడ్ గ్రంథి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇది సరిగా పని చేయకపోతే, ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు, శరీరం తక్కువ వేడి ఉత్పత్తి చేస్తుంది. దీంతో చిన్న చలికే ఎక్కువగా చల్లగా అనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారిలో బరువు పెరగడం, అలసట, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

Advertisement

రక్తప్రసరణ తగ్గినా…
రక్తప్రసరణ సరిగా లేకపోవడం కూడా మరో కారణం. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరిగ్గా చేరకపోతే, వేడి కూడా సరిగా చేరదు. ముఖ్యంగా చేతులు, కాళ్లు ఎప్పుడూ చల్లగా ఉండటం దీనికి సంకేతం. డయాబెటిస్, బీపీ వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించవచ్చు. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే మరింత సమస్యలు రావచ్చు.

Also read: Low BP: మీ బీపీ పడిపోతే వెంటనే కనిపించే లక్షణాలు ఇవే, వెంటనే ఏం చేయాలంటే?

అలాగే బరువు చాలా తక్కువగా ఉండేవారికి కూడా ఈ సమస్య కనిపిస్తుంది. మన శరీరంలో కొంత కొవ్వు ఉండటం సహజం. అది శరీరాన్ని చలికి రక్షిస్తుంది. కానీ చాలా సన్నగా ఉన్నవారిలో ఈ రక్షణ ఉండదు. దీంతో చిన్న చలికే కూడా ఎక్కువగా చల్లగా అనిపిస్తుంది. మసిల్స్ తక్కువగా ఉన్నా కూడా శరీరం వేడి తక్కువగా ఉత్పత్తి చేస్తుంది.

విటమిన్ లోపాలు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. ముఖ్యంగా విటమిన్ B12, ఐరన్, జింక్ వంటి పోషకాలు తక్కువగా ఉంటే శరీరం సరిగా పని చేయదు. ఇవి రక్తకణాల ఉత్పత్తికి అవసరం. ఇవి తగ్గితే శరీరానికి సరిపడా వేడి ఉత్పత్తి కాదు. అందుకే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

ఈ సమస్య మహిళలు, వృద్ధులు, తక్కువ బరువు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరిలో హార్మోన్ల మార్పులు, మసిల్ మాస్ తక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ఎవరైనా ఎదుర్కొనే సమస్య కావచ్చు. ఎప్పుడూ చల్లగా అనిపించడం, చేతులు కాళ్లు చల్లగా ఉండటం, అలసట, బరువు మార్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అవసరమైన పరీక్షలు చేయించుకుని అసలు కారణాన్ని తెలుసుకోవాలి. ముందుగానే గుర్తిస్తే ఈ సమస్యను సులభంగా నియంత్రించవచ్చు.

Related News

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

Big Stories

Advertisement
×