BigTV English
Advertisement

Saree Causes Cancer in Women: మహిళలు కట్టుకునే చీరలతో కూడా క్యాన్సర్ భారిన పడతారని మీకు తెలుసా..?

Saree Causes Cancer in Women: మహిళలు కట్టుకునే చీరలతో కూడా క్యాన్సర్ భారిన పడతారని మీకు తెలుసా..?
Saree Causes Cancer
Saree Causes Cancer

Saree Causes the Cancer in Women: మహిళలు పెళ్లి తర్వాత తరచూ ధరించే సంప్రదాయ దుస్తులైన చీరలతోను వారికి ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చీరకట్టుతోను క్యాన్సర్ బారిన పడతారని ఆరోగ్య నిపుణులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. తాజాగా చీర కట్టు క్యాన్సర్ బారిన పడిన ఓ ఘటన కూడా వెలుగుచూసింది. ముంబైలోని ఆర్ఎస్ కూపర్ హాస్పిటల్ లో 68ఏళ్ల మహిళ ఈ క్యాన్సర్ బారిన పడినట్లు నిర్థారించారు. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఇది ఆందోళన రేకెత్తించింది. అసలు చీరతో కూడా క్యాన్సర్ వస్తుందా అని ఇప్పటికీ చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు. అసలు చీర క్యాన్సర్ ఎలా వస్తుంది. ఎందుకు వస్తుంది.. అనే ప్రశ్నలు వారి మైండ్లో ఉంటాయి. మరి చీర క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకుందాం.


చీర క్యాన్సర్ అనేది చాలా అరుదైన స్కిన్ క్యాన్సర్ అని వైద్య నిపుణులు అంటున్నారు. చీరను తరచూ ధరించే స్త్రీలలో నడుము పొడవునా ఈ క్యాన్సర్ వస్తుందట. కేవలం చీర కట్టుకునే వారికి మాత్రమే కాకుండా.. నడుము వద్ద బిగుతైన దుస్తులు ధరించే ప్రతీ ఒక్కరు ఈ క్యాన్సర్ బారిన పడే ఛాన్స్ ఉందట. సాధారణంగా మహిళలు చీర కట్టుకునే ముందు లోపల లంగాను ధరిస్తారు. అయితే ఎక్కువ సేపు లంగాను గట్టిగా కట్టుకుని ఉండడం వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీ పీఎస్ఆర్ఐ హాస్పిటల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ వివేక్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో సంవత్సరాలుగా చీరలు ధరించే మహిళలకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. లంగాను బిగుతుగా కట్టుకోవడం వల్ల నడుము వద్ద దురద మొదలై.. చర్మం ఊడిపోతుంది. ఇలాంటి లక్షణాలు ఫస్ట్ స్టేజ్ లో ఉంటాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తేనే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి’ అని అన్నారు.

Also Read: మలం నుంచి రక్తం పడుతుందా.. మీరు క్యాన్సర్ బారిన పడినట్లే


పురుషుల్లోను..

పురుషుల్లోను క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయట. వారు ధరించే జీన్స్ లో టైట్ ఫిట్ జీన్స్ వల్లే క్యాన్సర్ రావచ్చని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి శరీరానికి బిగుతుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల ఈ క్యాన్సర్ వస్తుందని అంటున్నారు. అంతేకాదు ఇలా టైట్ జీన్స్ వల్ల పురుషుల పొత్తి కడుపు భాగంలో ఉష్ణోగ్రత పెరిగి.. స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తుంది. అయితే దుస్తులను ధరించే సమయంలో బిగుతుగా ఉండకుండా సౌకర్యంగా ఉండే విధంగా చూసుకుంటే ఎటువంటి సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు.

Related News

 Ajwain Seed Water: వాము నీరు తాగితే.. నమ్మలేనన్ని లాభాలు !

Cracked Heels: మడమల పగుళ్లకు అసలు కారణాలు తెలిస్తే.. షాక్ అవుతారు

Rainbow Puri: రెయిన్‌బో పూరీ..ఇలా తయారు చేసుకుని తింటే అదిరిపోయే టేస్ట్

Kothmira Pachadi: నోరూరించే కొత్తిమీర పచ్చడి.. సింపుల్‌గా ఇలా తయారు చేయండి !

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Big Stories

×