BigTV English

Rashmika Poster Released from Pushpa 2: శ్రీవల్లి కొత్త పోస్టర్ విడుదల.. అపుడు చాలా పూర్.. ఇప్పుడు.. చానా రిచ్ అయిపోయింది బాబోయ్..!

Rashmika Poster Released from Pushpa 2: శ్రీవల్లి కొత్త పోస్టర్ విడుదల.. అపుడు చాలా పూర్.. ఇప్పుడు.. చానా రిచ్ అయిపోయింది బాబోయ్..!
Rashmika Mandanna Pushpa 2 look
Rashmika Mandanna Pushpa 2 look

Rashmika Mandanna’s New Poster Released from Pushpa 2 Movie: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పుష్ప 2 మూవీ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అల్లు అర్జున్ పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఇక నేడు రష్మిక మందన్న బర్త్ డే కావడంతో ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్‌ను మేకర్స్ అందించారు.


ఈ మేరకు ఈ మూవీలో శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అందులో రష్మిక పట్టుచీరలో.. ఒంటినిండా బంగారం ధరించి ధగధగా మెరిసిపోతుంది. చేతికి గాజులు.. మెడలో హారాలు, నడుముకి వడ్డానంతో చానా రిచ్‌గా మారిపోయింది. ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన మేకర్స్ హ్యాపీ బర్త్ డే రష్మిక అంటూ విషెస్ చెప్పారు.

ఇప్పుడు ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప నుంచి కూడా అప్పట్లో వదిలిన రష్మిక లుక్ ఇలాగే వైరల్ అయింది. అందులో రష్మిక హాట్ లుక్‌లో చెవులుకు దుద్దులు పెట్టుకున్నట్లు కనిపించింది. దీంతో అప్పట్లో ఆ పోస్టర్ వైరల్ అయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ నుంచి పోస్టర్ రిలీజ్ చేయగా ఇది కూడా చక్కర్లు కొడుతుంది.


Also Read:  పుష్ప 2 మ్యూజిక్ సెషన్స్.. ఈ సారి పుష్పకి మించి కొట్టాలి డీఎస్పీ!

ఈ పోస్టర్‌పై ప్రేక్షకాభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. శ్రీవల్లి చానా రిచ్ అయిపోయిందంటూ సోషల్ మీడియా ద్వారా ట్వీట్లు చేస్తున్నారు. ఇక ఇదే పోస్టర్‌తో మూవీ యూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మరో సారి కన్ఫర్మ్ చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 15న రిలీజ్ కానున్నట్లు పోస్టర్‌లో రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీ టీజర్‌ను మరో మూడు రోజుల్లో అంటే ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.

ఈ టీజర్ కోసం పుష్ప ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ పాన్‌ ఇండియా రేంజ్‌లో ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కుతోంది. ఫహాద్ పాజిల్, సునీల్, అనసూయ‌తో పాటు ఇంకొంతమంది కొత్త నటీ నటులు ఇందులో భాగం కాబోతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×