E-Paper
Advertisement

Tea and Coffee: ఉదయం తాగే కాఫీ లేదా టీ మీ చర్మాన్ని ముసలిగా మార్చేస్తుందా?

Tea and Coffee: ఉదయం తాగే కాఫీ లేదా టీ మీ చర్మాన్ని ముసలిగా మార్చేస్తుందా?
Advertisement

ఉదయం లేవగానే చాలామంది చేసే మొదటి పని ఒక కప్పు కాఫీ లేదా టీ తాగడం. ఇది మనకు వెంటనే శక్తి ఇస్తుందన్న భావన ఉంది. ఆఫీస్ పనులు, ఇంటి బాధ్యతలు, డెడ్‌లైన్లు అన్నీ ఎదుర్కోవడానికి ఈ ఉదయపు టీ లేదా కాఫీపైనే ఆధారపడతారు. కానీ తాజా అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఈ అలవాటు మన చర్మం శరీరంపై అనుకోని ప్రభావాలు చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఖాళీ పొట్టతో ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల చర్మం త్వరగా ముసలితనం లక్షణాలు త్వరగా చూపించే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

కెఫీన్ వల్లే కష్టాలు
నిపుణులు చెబుతున్న ప్రకారం ఉదయం తొందరగా తాగే కాఫీలో ఉన్న అధిక కెఫిన్ శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని పెంచుతుంది. కార్టిసోల్ పెరిగితే మనకు తాత్కాలికంగా చురుకుదనం వస్తుంది. కానీ దీర్ఘకాలంలో ఇది శరీరానికి, ముఖ్యంగా చర్మానికి హాని చేస్తుందని చెబుతున్నారు. చర్మం ఎక్కువ నూనె ఉత్పత్తి చేయడం, రంధ్రాలు మూసుకుపోవడం, పింపుల్స్ రావడం వంటి సమస్యలు మొదలవుతాయి. అంతేకాదు, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం నీటిని కోల్పోతుంది. దీని కారణంగా చర్మం పొడిబారిపోయి, ముడతలు త్వరగా కనిపించడం మొదలవుతుందని చర్మ నిపుణులు అంటున్నారు. రోజూ ఇదే అలవాటు కొనసాగితే చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపించే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also read: Coriander Pongali: కొత్తిమీర పొంగలి ఎప్పుడైనా తిన్నారా? రుచి అదిరిపోద్ది.. ఇదిగో రెసిపీ

కొల్లాజెన్ దెబ్బతింటుంది
కాఫీ మాత్రమే కాదు చాలామంది ఉదయం తాగే మసాలా చాయ్ లేదా బ్లాక్ టీ కూడా కొన్ని సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాయ్‌లో ఎక్కువగా చక్కెర వేసుకుని తాగే అలవాటు ఉన్నవారికి ప్రమాదం ఎక్కువ. అధిక చక్కెర వల్ల చర్మంలో ఉన్న కొల్లాజెన్ అనే ముఖ్యమైన ప్రోటీన్ దెబ్బతింటుంది. కొల్లాజెన్ చర్మాన్ని గట్టిగా, మృదువుగా ఉంచే పనిని చేస్తుంది. చక్కెర ఎక్కువగా తీసుకుంటే ఈ కొల్లాజెన్ బలం తగ్గి చర్మం వాలిపోయినట్టు కనిపిస్తుంది. దీనినే నిపుణులు షుగర్ ఏజింగ్ అని పిలుస్తున్నారు. అందువల్ల ఉదయం తాగే చాయ్‌లో చక్కెర తగ్గించుకోవడం లేదా పూర్తిగా మానేయడం మంచిదని సూచిస్తున్నారు.

Advertisement

అయితే అన్ని ఉదయపు పానీయాలు చెడ్డవని కాదు. గ్రీన్ టీ మాత్రం కాస్త భిన్నమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కెఫిన్ తక్కువగా ఉండటంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి, చర్మాన్ని లోపల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. గ్రీన్ టీని ఖాళీ కడుపుతో కాకుండా తేలికపాటి అల్పాహారం తర్వాత తాగితే ఇంకా మంచిదని సూచిస్తున్నారు. మొత్తానికి ఉదయం తాగే ఒక్క కప్పే మీ వృద్ధాప్యానికి కారణం కాదు. కానీ ఆహారం, నీటి తీసుకోవడం, నిద్ర, జీవనశైలి అన్నీ సమతుల్యంలో లేకపోతే ఆ ఉదయపు కప్పు సమస్యలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే అలవాట్లను మార్చుకుని, శరీరానికి ఏది మేలో ఆలోచించుకుంటే చర్మం ఆరోగ్యంగా, యువకంగా ఉండే అవకాశం ఉంటుందని వారు సూచిస్తున్నారు.

Related News

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×