E-Paper
Advertisement

Feb 2026 Movies Re-release: ఫిబ్రవరిలో విడుదలయ్యే రీ రిలీజ్ సినిమాలు..మీ ఫేవరేట్ ఏదో చూసేయండి..

Feb 2026 Movies Re-release: ఫిబ్రవరిలో విడుదలయ్యే రీ రిలీజ్ సినిమాలు..మీ ఫేవరేట్ ఏదో చూసేయండి..
Advertisement

Feb 2026 Movies Re-release: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సినిమాలు తిరిగి 4k వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఇక ఫిబ్రవరి నెలలో కూడా భారీగా సినిమాలు రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. మరి ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూపర్ హిట్ సినిమాలు ఏవి? ఎప్పుడు ఏ సినిమాలు విడుదల కాబోతున్నాయి అనే విషయానికి వస్తే…

ఫిబ్రవరిలో రీ రిలీజ్ సినిమాలు…

త్రీ మూవీ:
ధనుష్ శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘త్రీ ‘ సినిమా ఫిబ్రవరి ఆరవ తేదీ తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Advertisement

ఆరెంజ్:
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 4k వర్షన్ లో ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుది. ఇక ఈ సినిమా ఇదివరకే రీ రిలీజ్ అవ్వగా మరోసారి రీ రిలీజ్ కాబోతోంది.

కాంచన:

Advertisement

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హర్రర్ సినిమా 2011 సంవత్సరంలో విడుదలై ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేసింది. అయితే ఈ సినిమా మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమవుతుందని చెప్పాలి. ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

వాలెంటైన్స్ డే స్పెషల్..

లవ్ స్టోరీ:
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన కల్ట్ క్లాసికల్ మూవీ లవ్ స్టోరీ. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా తిరిగి ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

మనసంతా నువ్వే:

వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్, రీమాసేన్ ప్రధాన పాత్రలలో నటించిన ప్రేమ కథ చిత్రం మనసంతా నువ్వే. ఈ సినిమా ఇప్పటికీ ఎవర్గ్రీన్ సినిమా అనే చెప్పాలి. 2001లో విడుదలైన ఈ సినిమాని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ మరోసారి థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

ఏం మాయ చేసావే:

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య సమంత నటించిన సూపర్ హిట్ చిత్రం ఏం మాయ చేసావే. సమంత హీరోయిన్ గా పరిచయమవుతు నటించిన ఈ సినిమా 2010 వ సంవత్సరంలో విడుదలై ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా మరోసారి విడుదల కాబోతోంది. ఇలా ఫిబ్రవరి నెలలో ఏకంగా ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఇక వాలెంటెన్స్ డే సందర్భంగా ఒకేరోజు మూడు సినిమాలు రీ రిలీజ్ అవుతుండటం విశేషం.

Also Read: Sarvam Maya Review: మలయాళ డబ్బింగ్ చిత్రం ‘ సర్వం మాయ’ రివ్యూ అండ్ రేటింగ్

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×