E-Paper
Advertisement

Air Fryer and Microwave: ఎయిర్ ఫ్రయర్, మైక్రోవేవ్ వాడితే క్యాన్సర్ వస్తుందా? అసలు నిజం ఏమిటి?

Air Fryer and Microwave:  ఎయిర్ ఫ్రయర్, మైక్రోవేవ్ వాడితే క్యాన్సర్ వస్తుందా? అసలు నిజం ఏమిటి?
Advertisement

ఇప్పుడు అందరి ఇళ్లలో ఎయిర్ ఫ్రయర్, మైక్రోవేవ్ ఉంటోంది. వేగంగా వంట చేయడం, తక్కువ నూనెతో ఆహారం తయారు చేయడం వంటి కారణాలతో వీటిని వాడే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే వీటిని ఎక్కువగా వాడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.

మైక్రోవేవ్ వాడితే
మైక్రోవేవ్ క్యాన్సర్‌కు కారణమవుతుందనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ శాస్త్రవేత్తల ప్రకారం, మైక్రోవేవ్ ఓవెన్లు నాన్-అయోనైజింగ్ రేడియేషన్ తో పనిచేస్తాయి. అంటే ఇవి మన శరీరంలోని కణాలను, ముఖ్యంగా DNAను నేరుగా దెబ్బతీయవు. DNAకు నష్టం కలిగితేనే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మైక్రోవేవ్ నుంచి వచ్చే తరంగాలు ఆ స్థాయిలో ప్రభావం చూపవు. అందువల్ల సరిగ్గా వాడితే మైక్రోవేవ్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

ఎయిర్ ఫ్రైయర్ వాడితే
ఇక ఎయిర్ ఫ్రయర్ విషయానికి వస్తే ఇది కూడా నేరుగా క్యాన్సర్‌కు కారణం కాదు. ఎయిర్ ఫ్రయర్‌లో తక్కువ నూనెతో, వేడి గాలితో ఆహారం వండుతారు. దీని వల్ల సాధారణంగా నూనెలో వేయించిన ఆహారంతో పోలిస్తే ఇది కొంత ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా బరువు తగ్గాలని భావించే వారు, గుండె ఆరోగ్యం గురించి ఆలోచించే వారు ఎయిర్ ఫ్రయర్‌ను ఎక్కువగా వాడుతున్నారు.

Also read: Papaya: ఖాళీ పొట్టతో నెలరోజులు బొప్పాయి తింటే… శరీరంలో జరిగే మార్పులు ఇవే

Advertisement

ఎయిర్ ఫ్రయర్‌లోనే కాదు ఏ పద్ధతిలో అయినా అధిక ఉష్ణోగ్రత వద్ద ఆహారం వండితే అక్రిలమైడ్ అనే రసాయనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా బంగాళాదుంపలు వంటి కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్న ఆహారాల్లో కనిపిస్తుంది. ప్రయోగశాలలో జంతువులపై చేసిన పరీక్షల్లో ఈ పదార్థం క్యాన్సర్‌కు కారణమవుతుందని గుర్తించారు. కానీ మనుషుల్లో ఇది నేరుగా క్యాన్సర్‌కు కారణమవుతుందనే స్పష్టమైన ఆధారాలు ఇంకా లేవు.

సమస్య ఎయిర్ ఫ్రయర్ లేదా మైక్రోవేవ్‌లో కాదు, మన వంట విధానంలో ఉందని అర్థమవుతుంది. ఆహారాన్ని చాలా ఎక్కువ వేడి వద్ద కాల్చడం, బాగా గోధుమరంగు వచ్చే వరకు వేయించడం వంటి అలవాట్లు ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు. ఇదే సమస్య డీప్ ఫ్రై, గ్రిల్, బేకింగ్ వంటి ఇతర వంట విధానాల్లో కూడా ఉంటుంది. ఎయిర్ ఫ్రయర్ వాడటం వల్ల నూనె వినియోగం తగ్గుతుంది. దీని వల్ల ఒబేసిటీ, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంది. అందువల్ల సరైన విధంగా వాడితే ఇది ఆరోగ్యానికి ఉపయోగపడే పరికరంగా మారుతుంది.

Also read: Kerala Fish Curry: కేరళ స్టైల్లో చేపల ఇగురు వండారంటే ఎవరికైనా నచ్చాల్సిందే, రెసిపీ ఇదిగో

కొన్ని జాగ్రత్తలు
ఆహారాన్ని ఎక్కువగా కాల్చకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వండాలి. పాత నూనెను మళ్లీ మళ్లీ వాడకూడదు. మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ పాత్రలు వాడేటప్పుడు అవి మైక్రోవేవ్ సేఫ్ అని ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే పరికరాలను సరిగ్గా నిర్వహించడం కూడా అవసరం. ఎయిర్ ఫ్రయర్, మైక్రోవేవ్ వాడటం వల్ల నేరుగా క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ ఆహారం ఎలా వండుతున్నాం, ఎంత జాగ్రత్తగా వాడుతున్నామన్నదే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

Related News

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

Big Stories

Advertisement
×