E-Paper
Advertisement

Kerala Fish Curry: కేరళ స్టైల్లో చేపల ఇగురు వండారంటే ఎవరికైనా నచ్చాల్సిందే, రెసిపీ ఇదిగో

Kerala Fish Curry: కేరళ స్టైల్లో చేపల ఇగురు వండారంటే ఎవరికైనా నచ్చాల్సిందే, రెసిపీ ఇదిగో
Advertisement

చేపలు కూర, పులుసు, వేపుడు పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఎప్పుడూ ఒకే స్టైల్ లో కాకుండా కేరళ పద్ధతిలో వండి అదిరిపోయే రుచి వస్తుంది. కొబ్బరి పాలు, చింతపండు, మసాలాల కలయికతో ఈ కర్రీకి ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో పూర్తి రెసిపీ తెలుసుకోండి.

కేరళ స్టైల్లో చేపల ఇగురు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చేప ముక్కలు – 6 నుంచి 8
చింతపండు – అర కప్పు (నీటిలో నానబెట్టినది)
కొబ్బరి పాలు – 1½ కప్పు
ఉల్లిపాయలు – రెండు
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి – 5 రెబ్బలు
పచ్చిమిర్చి – 2 నుంచి 3
కరివేపాకు – కొద్దిగా
కారం – 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
పసుపు – అర టీస్పూన్
ఉప్పు – తగినంత
నూనె – రెడు టేబుల్ స్పూన్లు
ఆవాలు – అర టీస్పూన్
మెంతులు – అర టీస్పూన్

Advertisement

Also read: Sleep with Lights on: రాత్రిపూట లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? మీకెంత డ్యామెజ్ అవుతుందో తెలుసా?

కేరళ స్టైల్లో చేపల ఇగురు రెసిపీ
1. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా వంపేయాలి.
2. చింతపండును నీటిలో నానబెట్టి రసం తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
3. ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
5. వెంటనే మెంతులు వేసి తక్కువగా వేయించాలి. తరువాత కరివేపాకు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి.
6. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి వేసి స్వల్పంగా వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
7. కారం, ధనియాల పొడి, పసుపు కొద్దిగా నీటితో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి.
8. ఈ మసాలా పేస్ట్‌ను పాన్‌లో వేసి నెమ్మదిగా కలుపుతూ వేయించాలి.
9. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నీరు పోసి మరిగించాలి. తరువాత చింతపండు రసం వేసి కలపాలి.
10. ఈ మిశ్రమం మరిగిన తర్వాత కొబ్బరి పాలు వేసి మంటను తక్కువగా ఉంచాలి.
11. ఇప్పుడు ఈ మిశ్రమంలో చేప ముక్కలను జాగ్రత్తగా వేసుకోవాలి. స్పూన్‌తో ఎక్కువగా కలపకూడదు.
12. 20 నిమిషాల పాటూ కూరను మగ్గించాలి. కూర దగ్గరగా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేయాలి.
13. చివరగా కరివేపాకు వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. ఇలా ఉంచితే కర్రీకి మంచి సువాసన వస్తుంది.

Advertisement

Also read: Excessive cold: వేసవిలో కూడా చలి వేస్తుందా? అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్టే

ఈ కూరను వేడి అన్నంతో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. దోసె, చపాతీతో కూడా తినొచ్చు. కర్రీ వండాక రెండు మూడు గంటలు వదిలేసి ఆ తరువాత తింటే రుచి మరింత పెరుగుతుంది.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×