E-Paper
Advertisement

Ranga Reddy Crime: తెలంగాణలో ఘోరం.. భార్య, కొడుకుని.. దారుణంగా చంపిన కిరాతకుడు!

Ranga Reddy Crime: తెలంగాణలో ఘోరం.. భార్య, కొడుకుని.. దారుణంగా చంపిన కిరాతకుడు!
Advertisement

Ranga Reddy Crime: రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో మృగంగా మారిన ఓ వ్యక్తి.. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన కొడుకును దారుణంగా హత్య చేశాడు. కూతురిపై కూడా దాడికి తెగబడగా.. ప్రస్తుతం ఆ బాలిక ఆస్పత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..

పులిగోనిపల్లి తాండాకు చెందిన కవిత (28), బానవత్​ రాందాస్ (32) భార్యాభర్తలు. వీరికి ప్రణీత (10), హర్ష (7) అనే కూతురు, కొడుకు ఉన్నారు. అయితే మద్యానికి బానిసగా మారిన రాందాస్​ ప్రతీరోజూ తాగి వచ్చి భార్యతో గొడవలు పడేవాడు. గొడవను ఆపటానికి వచ్చిన పిల్లలను చితకబాదేవాడు.

కత్తితో రెచ్చిపోయి..

Advertisement

సోమవారం రాత్రి కూడా ఇలాగే పీకల దాకా మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాందాస్ భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగిపోవంతో రెచ్చిపోయి కత్తితో కవిత, ప్రణీత, హర్షలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ కవిత, హర్ష అక్కడికక్కడే చనిపోయారు.

Also Read: Airtel Plan: ఐపీఎల్ ప్రియులకు.. ఎయిర్‌టెల్ గుడ్ న్యూస్.. రూ.48కే హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్!

రంగంలోకి పోలీసులు..

Advertisement

ఇంటి నుంచి కేకలు రావడంతో స్థానికులు అప్రమత్తమై పరిగెత్తుకు వచ్చారు. దీంతో రాందాస్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు తీవ్రంగా గాయపడ్డ కూతురు.. ప్రణీతను హూటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానికుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Also Read: Jio Offer: జియో బంపరాఫర్.. ఈ రీఛార్జ్ ప్లాన్స్‌తో.. రూ.35,100 సేవలు, 2TB స్టోరేజ్ ఫ్రీ..!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×