E-Paper
Advertisement

అబ్బాయిలు ఈ కలర్ కాంబినేషన్స్ ధరిస్తే లుక్ అదిరిపోద్ది.. అమ్మాయిలు కళ్లు ఆర్పకుండా చూస్తారు

అబ్బాయిలు ఈ కలర్ కాంబినేషన్స్ ధరిస్తే లుక్ అదిరిపోద్ది.. అమ్మాయిలు కళ్లు ఆర్పకుండా చూస్తారు
Advertisement

అందంగా కనిపించాలంటే ఖరీదైన దుస్తులు ధరించాల్సిన అవసరం ఉండదు. సరైన కలర్ కాంబినేషన్ కూడా మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చగలదు. మంచి కలర్ కాంబినేషన్ మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే మీరు మరింత స్టైలిష్‌గా కనిపించేందుకు సహాయపడుతుంది. కొన్ని కలర్ కాంబినేషన్స్ ఎప్పటికీ ఫ్యాషన్‌లో ఉంటాయి. అలాంటి అయిదు అద్భుతమైన కలర్ కాంబినేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నలుపు, తెలుపు రంగుల కలయిక ఎప్పటికీ క్లాసిక్‌గా ఉంటుంది

నలుపు, తెలుపు రంగుల కలయిక ఎప్పటికీ ఓల్డ్ ఫ్యాషన్‌ అనిపించుకోదు. తెలుపు రంగు షర్ట్‌తో నలుపు రంగు జీన్స్ ధరించవచ్చు. అలాగే నలుపు రంగు ప్యాంట్‌తో కూడా ఈ కాంబినేషన్ అద్భుతంగా కనిపిస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ మీకు క్లాసీ, క్లీన్ లుక్‌ ఇస్తుంది. ఆఫీస్ మీటింగ్స్ లేదా డేట్‌లకు ఈ కాంబినేషన్ మంచి ఆప్షన్.

నేవీ బ్లూ, గ్రే కలర్ జెంటిల్‌మ్యాన్ లుక్‌ ఇస్తాయి

Advertisement

నేవీ బ్లూ, గ్రే కలర్స్ కాంబినేషన్ చాలా హుందాగా కనిపిస్తుంది. నేవీ బ్లూ షర్ట్‌తో గ్రే ట్రౌజర్ ధరించవచ్చు. అదనంగా గ్రే బ్లేజర్ వేసుకుంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఈ కాంబినేషన్ మీకు పరిపక్వత, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఆఫీస్ మీటింగ్‌లలో ఇది ప్రత్యేక గుర్తింపు తీసుకురాగలదు.

ఆలివ్ గ్రీన్, బెయిజ్ కలర్స్ ట్రెండీ లుక్‌ అందిస్తాయి

కొత్త తరహా ఫ్యాషన్‌ ఇష్టపడేవారికి ఈ కాంబినేషన్ బాగా సరిపోతుంది. ఆలివ్ గ్రీన్ టీ షర్ట్‌తో పాటు బెయిర్ కలర్ ప్యాంట్ ధరించవచ్చు. ఈ కలయిక మీ లుక్‌ను ఫ్రెష్‌గా, ప్రత్యేకంగా చూపిస్తుంది. ప్రయాణాలు లేదా స్నేహితులతో బయటకు వెళ్లే సందర్భాల్లో ఇది మంచి ఎంపిక.

మెరూన్, నలుపు రంగులు స్టైలిష్ లుక్‌ క్రియేట్ చేస్తాయి

Advertisement

పార్టీలకు లేదా సాయంత్రం జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు మెరూన్, బ్లాక్.. కలర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. మెరూన్ షర్ట్‌తో నలుపు జీన్స్ ధరించడం ద్వారా ఆకర్షణీయమైన లుక్ పొందవచ్చు. ఈ బోల్డ్ కాంబినేషన్ మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తుంది. జనాల్లో మీరు ప్రత్యేకంగా కనిపించేందుకు ఇది సహాయపడుతుంది.

Also Read: మీరు దూరమైన తరువాతే ఇతరులకు మీ విలువ తెలుస్తుంది.. ఈ చేదు నిజం వెనుక కారణం ఇదే

లైట్ బ్లూ, వైట్ కలర్స్ ఫ్రెష్ లుక్‌ ఇస్తాయి

వేసవి కాలంలో లైట్ బ్లూ, వైట్ కలర్స్ కంబైన్ చాలా అందంగా కనిపిస్తుంది. లైట్ బ్లూ షర్ట్‌తో తెలుపు రంగు ప్యాంట్ ధరించవచ్చు. తెలుపు రంగు షూస్ జత చేస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. కాలేజ్‌కు వెళ్లేటప్పుడు లేదా సాధారణ సమావేశాల్లో ఈ కాంబినేషన్ చక్కగా సరిపోతుంది.

సరైన కలర్ కాంబినేషన్స్ ఎందుకు ముఖ్యం

అందమైన దుస్తులు ధరించినా కలర్స్ ఆప్షన్స్ సరైనది కాకపోతే లుక్ పూర్తిగా ప్రభావితం అవుతుంది. అదే సాధారణ దుస్తులు కూడా సరైన కలర్ కాంబినేషన్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఈ అయిదు రంగుల కలయికలు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి. మీ స్టైల్‌కు కొత్త అందాన్ని తీసుకువస్తాయి. కాబట్టి ఇకపై దుస్తులు ఎంచుకునేటప్పుడు కలర్ కాంబినేషన్స్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×