E-Paper
Advertisement

Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ తాగితే చర్మం మెరిసిపోవడం ఖాయం, ఎలా తాగాలంటే

Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ తాగితే చర్మం మెరిసిపోవడం ఖాయం, ఎలా తాగాలంటే
Advertisement

శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ అందానికి కూడా బీట్‌రూట్ జ్యూస్ ఎంత ఉపయోగపడుతుంది. తాజాగా న్యూట్రీషన్ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చర్మానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. చర్మం కాంతివంతంగా ఉండేలా చేయడం నుండి మొటిమలు తగ్గించడం వరకు బీట్ రూట్ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.బీట్‌రూట్‌లో ఉండే సహజ పోషకాలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఇచ్చి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

చర్మానికి సహజ మెరుపు
బీట్‌రూట్‌లో విటమిన్ C, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తం శుభ్రంగా ఉంటే చర్మంసహజంగా మెరిసిపోతుంది. రక్తప్రసరణ సరిగా జరిగితే ముఖానికి అందమైన గులాబీ రంగు కనిపిస్తుంది. నేచురల్ గ్లో కోసం కొంతమంది ఖరీదైన బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతారు. కానీ బీట్‌రూట్ జ్యూస్ తాగడం ద్వారా సహజంగా ఆ మెరుపు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

మొటిమలు తగ్గించడంలో
చర్మంపై మొటిమలు రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రక్తంలోని మలినాలు. బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. ఈ ప్రక్రియ వల్ల టాక్సిన్లు తగ్గి మొటిమలు సహజంగా తగ్గుతాయి. కొంతమందికి బీట్‌రూట్ జ్యూస్ తాగాక మొటిమలు తగ్గాయని కూడా తేలింది. అంతేకాకుండా ముఖంపై ఏర్పడే చిన్న చిన్న ఇన్ఫ్లమేషన్స్ కూడా తగ్గడానికి ఈ జ్యూస్ సహాయపడుతుంది.

చర్మాన్ని శుభ్రపరుస్తుంది
రోజువారీ కాలుష్యం, పొడి గాలి, శరీరంలో ఏర్పడే టాక్సిన్లు చర్మాన్ని డల్‌గా మార్చేస్తాయి. బీట్‌రూట్ జ్యూస్‌ను డిటాక్స్ డ్రింక్‌గా పరిగణిస్తారు. ఇది లివర్ పనితీరును మెరుగుపరిచి శరీరంలోని అవాంఛిత రసాయనాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. శరీరం శుభ్రంగా ఉందంటే చర్మం కూడా సాఫ్ట్‌గా, క్లీన్‌గా కనిపించడం సహజమే. బీట్‌రూట్‌లోని విటమిన్ C మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్ C ఉన్న ఆహారాలను రోజువారీ తీసుకుంటే మెలనిన్ ఉత్పత్తి తగ్గి స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. ఎక్కువసేపు సూర్యరశ్మిలో ఉండే వాళ్లకు ఈ జ్యూస్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని వైద్యులు అంటున్నారు.

Advertisement

చర్మాన్ని మృదువుగా మార్చే గుణం
బీట్‌రూట్‌లో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా కాపాడుతుంది. శరీరం లోపల నుండి హైడ్రేట్ అయితే చర్మం పొడిబారే అవకాశం తగ్గి సహజంగా మృదువుగా మారుతుంది. పొడి చర్మం సమస్య ఉన్నవారు బీట్‌రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే మంచి ఫలితం పొందవచ్చు. ముడతలు, ఫైన్ లైన్స్ వంటి సమస్యలు వయస్సుతో పాటు వేగంగా పెరుగుతున్నాయి. కానీ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాలు ఎక్కువ తీసుకుంటే ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. బీట్‌రూట్‌లో ఉండే బీటా కరోటిన్, పాలీఫినాల్స్ వంటి పదార్థాలు చర్మాన్ని వృద్ధాప్య లక్షణాల నుండి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడే గుణం బీట్‌రూట్‌కు ఉంది. రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్లే కళ్ల కింద నలుపు ఎక్కువగా కనిపిస్తుంది. రోజూ బీట్‌రూట్ జ్యూస్ తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడి ఈ సమస్య కొంతవరకు తగ్గుతుంది.

ఎలా తాగాలి?
నిపుణులు చెబుతున్న ప్రకారం రోజుకు అర గ్లాస్ నుంచి ఒక గ్లాస్ వరకు బీట్‌రూట్ జ్యూస్ సరిపోతుంది. ఖాళీ కడుపుతో తాగితే డిటాక్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బీట్‌రూట్‌ను జ్యూస్‌గా తాగలేనివారు కేరట్, ఆపిల్‌తో కలిపి తాగినా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అయితే లో బీపీ ఉన్నవారు ఎక్కువ మోతాదులో తాగకూడదని వైద్యులు సూచిస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×