E-Paper
Advertisement

Smriti Mandhana Marriage: స్మృతి మందాన ఇంట పెళ్లి సంద‌డి..హ‌ల్దీ ఫోటోలు వైర‌ల్ !

Smriti Mandhana Marriage: స్మృతి మందాన ఇంట పెళ్లి సంద‌డి..హ‌ల్దీ ఫోటోలు వైర‌ల్ !
Advertisement

Smriti Mandhana Marriage:  టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మందాన ( Smriti Mandhana ) మరికొన్ని గంటల్లోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. దాదాపు 6 సంవత్సరాలుగా తాను ప్రేమిస్తున్న పలాష్ ముచ్చల్ ను ( Palash Muchhal) ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నారు స్మృతి మందాన. ఈ తరుణంలో స్మృతి మందాన ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇందులో భాగంగానే స్మృతి మందాన, ఆమె ప్రియుడు పలాష్ ముచ్చల్ ఇద్దరు హల్దీ ఫంక్షన్ లో పాల్గొన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.  అంతేకాదు పలాష్ ముచ్చల్ పెళ్లి డ్రెస్ లో మెరిశారు. బ్యాండ్ మేలం మ‌ధ్య‌లో పలాష్ ముచ్చల్ పూల దండ‌ల‌తో క‌నిపించారు. ఇటు టీమ్ ఇండియా మ‌హిళా ప్లేయర్లు అందరూ స్మృతి మందార ఇంట పెళ్లి రీల్స్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు. వాళ్ల స్మృతి మందాన కూడా స్టెప్పులు వేసింది. వీటికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు బయటకు వస్తున్నాయి.

Also Read: Shai Hope Record: స‌చిన్, కోహ్లీ వ‌ల్లే కాలేదు, సెంచ‌రీల‌లో షాయ్ హోప్ కొత్త రికార్డ్‌.. నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

స్మృతి మందాన ఇంట పెళ్లి సంద‌డి

Advertisement

టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ ( Palash Muchhal) ఇద్దరూ ఇవాళ ఏడడుగులు వేయబోతున్నారు. ఇవాళ రాత్రి 9 గంటల సమయంలో స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వెడ్డింగ్ జరగనున్నట్లు సమాచారం అందుతుంది. స్మృతి మందాన సొంత ఊరు సంగ్లిలో ఈ వివాహ వేడుక జరగనుంది. మహారాష్ట్ర లోని సంగ్లి ముంబై నుంచి 390 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అటు బెంగళూరు నుంచి 700 కిలోమీటర్ల దూరం, పూణే నుంచి 240 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సంగ్లి పట్టణాన్ని పసుపు నగరంగా కూడా పిలుస్తారు. ఇక్కడే స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వివాహం జరుగుతోంది. ఇక ఈ వివాహ వేడుకకు టీమిండియా మహిళా క్రికెటర్లు, భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు, టీమిండియా మెన్స్ క్రికెటర్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోనే మృతి మందాన వివాహం జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ కూడా ఈ పెళ్లికి హాజరవుతాడని సమాచారం.

2019 నుంచి పలాష్ ముచ్చల్, స్మృతి మందాన‌ డేటింగ్

టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందాన అలాగే పలాష్ ముచ్చల్ ఇద్దరు 2019 నుంచి డేటింగ్ లో ఉన్నారు. అయితే స్మృతి మందాన‌కు మొదట ప్రపోజ్ చేసింది పలాష్ ముచ్చల్. ఇక పలాస్ ముచ్చల్ మంచి మ్యూజికల్ కంపోజర్. అలాగే ఫిలిం మేకర్ కూడా. చాలా సినిమాలకు, పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అయితే తన పాటతోనే స్మృతి మందానకు ప్రపోజ్ కూడా చేశాడట. ఇక మొన్న నవంబర్ ప్రారంభంలోనే వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇవాళ వివాహం జరుగుతోంది. దీంతో టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మందాన పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

Advertisement

Also Read: IND VS SA 2nd Test: టీమిండియా జెర్సీపై ట్రోలింగ్..న‌ర్స్ పాప‌ల్లాగే ఉన్నారురా..మెడ‌ప‌ట్టితో గిల్ ద‌ర్శ‌నం

 

 

 

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×