E-Paper
Advertisement

Dry Skin in Winter: చలికాలంలో డ్రై స్కిన్ సమస్యకు.. వీటితో చెక్ !

Dry Skin in Winter: చలికాలంలో డ్రై స్కిన్ సమస్యకు.. వీటితో చెక్ !
Advertisement

Dry Skin in Winter: చలికాలం రాగానే చర్మం పొడి బారిపోవడం, పగుళ్లు రావడం, దురద పెట్టడం వంటి సమస్యలు సర్వ సాధారణం. ఈ సమయంలో వాతావరణంలో తేమ తగ్గడం వల్ల చర్మం తన సహజ సిద్ధమైన నూనెలను కోల్పోతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే చర్మం నిస్తేజంగా మారి, గరుకుగా తయారవుతుంది. చలికాలంలో చర్మం పొడి బారడానికి కారణాలు, దీనిని నివారించడానికి ఎలాంటి హోం రెమెడీస్ వాడాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మం పొడిబారడానికి ప్రధాన కారణాలు:
తేమ లేకపోవడం: చలికాలంలో గాలిలో తేమ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై ఉన్న తేమను లాగేస్తుంది.

Advertisement

వేడి నీటి స్నానం: చలికాలంలో వేడివేడి నీటితో స్నానం చేయడం హాయిగా అనిపించినా.. అది చర్మంలోని సహజ నూనెలను తొలగించి చర్మాన్ని మరింత పొడిగా మారుస్తుంది.

హీటర్ల వాడకం: గదిని వెచ్చగా ఉంచే హీటర్లు గాలిలోని తేమను తగ్గించి చర్మాన్ని పొడిబారుస్తాయి.

Advertisement

తక్కువ నీరు తాగడం: చలి వల్ల దాహం తక్కువగా వేస్తుంది. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై చర్మంపై ప్రభావం చూపుతుంది.

హోం రెమెడీస్:
1. కొబ్బరి నూనె: కొబ్బరి నూనె సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మంలోకి చొచ్చుకుపోయి తేమను అందిస్తాయి. రాత్రి పడుకునే ముందు ముఖానికి, చేతులకు కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.

2.మీగడ, పసుపు: పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్ర పరుస్తుంది. మీగడ చర్మానికి తేమను ఇస్తుంది. కొంచెం మీగడలో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసి, 15 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. ఇది చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది.

3. కలబంద జెల్ : పొడి చర్మానికి దివ్యౌషధం అలోవెరా జెల్. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా.. చలికాలంలో వచ్చే దురద, దద్దుర్లను తగ్గిస్తుంది. తాజా కలబంద జెల్‌ను నేరుగా చర్మానికి అప్లై చేసుకోవచ్చు.

4. తేనె: తేనె చర్మానికి సహజమైన హ్యూమెక్టెంట్‌గా పనిచేస్తుంది. అంటే ఇది గాలిలోని తేమను గ్రహించి చర్మానికి అందిస్తుంది. స్నానానికి ముందు తేనెను చర్మానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగితే చర్మం కాంతివంతంగా ఉంటుంది.

5. ఆలివ్ ఆయిల్ , చక్కెర చర్మంపై పేరుకు పోయిన మృత కణాలను తొలగించడానికి ఆలివ్ ఆయిల్, చక్కెర కలిపి స్క్రబ్ లా వాడవచ్చు.ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

Also Read: మీలో ఈ లక్షణాలున్నాయా ? థైరాయిడ్ కావొచ్చు !

కొన్ని జాగ్రత్తలు:
నీరు ఎక్కువగా తాగాలి: చర్మం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి.

మాయిశ్చరైజర్ వాడకం: స్నానం చేసిన వెంటనే చర్మంపై తేమ ఉన్నప్పుడే.. మంచి మాయిశ్చరైజర్ లేదా లోషన్ అప్లై చేసుకోవాలి.

గోరు వెచ్చని నీరు: స్నానానికి మరీ వేడి నీటిని కాకుండా గోరు వెచ్చని నీటిని మాత్రమే వాడాలి.

సబ్బుల ఎంపిక: గాఢత తక్కువగా ఉన్న సబ్బులు లేదా బాడీ వాష్‌లను ఎంచుకోవాలి.

కొన్ని రకాల కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి. అంతే కాకుండా వీటిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×