E-Paper
Advertisement

U19 Asia Cup 2025: వైభవ్ ను ర్యాగింగ్ చేసిన పాక్ ఫ్యాన్స్.. షాకింగ్ వీడియో వైరల్

U19 Asia Cup 2025: వైభవ్ ను ర్యాగింగ్ చేసిన పాక్ ఫ్యాన్స్.. షాకింగ్ వీడియో వైరల్
Advertisement

U19 Asia Cup 2025: అండర్ 19 ఆసియా కప్ 2026 లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా బోల్తా పడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలన్న టీమిండియా నిర్ణయం బెడిసికొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. ఇక 348 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. దీంతో 191 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్ ఆసియా కప్ ని సొంతం చేసుకుంది.

Also Read: Shahid Afridi: ఇండియాను నిద్ర‌లేకుండా చేసారు.. మీరు రియ‌ల్ హీరోలు రా !

Advertisement

 

వైభవ్ సూర్యవంశీ ని గెలికిన అలీ రాజా:

ఈ మ్యాచ్ లో 348 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదిస్తున్న క్రమంలో భారత బాటర్లను పాకిస్తాన్ బౌలర్ అలీ రాజా రెచ్చగొట్టాడు. మొదట భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే ని టార్గెట్ చేసిన అలీ రజా.. ఆ తరువాత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని గెలికాడు. దీంతో వైభవ్ సూర్య వంశీ.. అలీ రజాకి తగిన రీతిలో సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఈ గొడవకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ క్రీజ్ లోకి వచ్చినప్పటి నుండే పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇతడు ఎదుర్కొన్న మొదటి తొమ్మిది బంతుల్లోనే 24 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపించాడు.

Advertisement

అయితే టీమిండియా స్కోర్ 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు వైభవ్ సూర్యవంశీ.. అలీ రజా వేసిన షార్ట్ పిచ్ బంతిని పంచ్ చేయబోయి వికెట్ కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే వైభవ్ అవుట్ కాగానే అలీ రాజా అతడికి చాలా కోపంగా సెండ్ ఆఫ్ ఇచ్చాడు. వైభవ్ ని ఉద్దేశించి.. అతడి వైపు కోపంగా చూస్తూ ఏదో వ్యాఖ్యలు చేశాడు. అయితే ఎప్పుడూ సాధారణంగా సైలెంట్ గా ఉండే వైభవ్.. ఈసారి మాత్రం వెనక్కి తగ్గలేదు. పాకిస్తాన్ ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. తన షూవైపు వేలు చూపిస్తూ.. { మీరు నా షూ కింద ఉంటారు} అన్నట్లుగా చేయగలు చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. నీ స్థాయి నా కాళ్ళ కింద అన్నట్లు వైభవ్ సైగలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

వైభవ్ ని ర్యాగింగ్ చేసిన పాకిస్తాన్ ఫ్యాన్స్:

వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన వెంటనే.. వైభవ్ – అలీ రాజా మధ్య వివాదం చెలరేగడంతో అంపైర్లు జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దుమణిగించారు. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ అత్యుత్సాహం ప్రదర్శించిన కారణంగానే ఇతర బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి లోనై.. వరుసగా వికెట్లు కోల్పోయారని కొంతమంది నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Cameron Green – IPL 2026: గ్రీన్ కు బిగ్ షాక్‌..వ‌చ్చేది రూ.25.20 కోట్లు కాదు, రూ.9.74 కోట్లే..మొత్తం నాకేశారుగా !

ఇక ఈ మ్యాచ్ లో ఓడిన అనంతరం.. టీమిండియా ఆటగాళ్లు దుబాయ్ లోని వారి హోటల్ కి వెళ్తున్న సమయంలో పాకిస్తాన్ అభిమానులు వైభవ్ సూర్యవంశీని ర్యాగింగ్ చేశారు. వైభవ్ తన లగేజ్ తో వెళుతున్న సమయంలో గట్టిగా అరుస్తూ ర్యాగింగ్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తంగా మైదానంలో స్లెడ్జింగ్ కి దిగిన ప్రత్యర్థి ఆటగాళ్లకు వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన సమాధానం పై భారత అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Mr. Cricket UAE (@mrcricketuae)

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×