E-Paper
Advertisement

Vitamins For Skin: చర్మం కాంతి కోల్పోయిందా ? ఈ 5 విటమిన్లు మీలో తక్కువ ఉండొచ్చు!

Vitamins For Skin: చర్మం కాంతి కోల్పోయిందా ? ఈ 5 విటమిన్లు మీలో తక్కువ ఉండొచ్చు!
Advertisement

Vitamins For Skin: అందమైన, ఆరోగ్యకరమైన చర్మం ఎవరికైనా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అయితే.. ఆధునిక కాలంలో కాలుష్యం, పని ఒత్తిడి, సరిగ్గా లేని ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది చర్మం చిన్న వయసులోనే ముడతలు పడటం లేదా కాంతి కోల్పోవడం జరుగుతుంది. చర్మం పాలిపోయినట్లు లేదా నిర్జీవంగా కనిపిస్తోందంటే.. అది కేవలం అలసట మాత్రమే కాదు.. మీ శరీరంలో పోషకాల లోపానికి సంకేతం కావచ్చు. ముఖ్యంగా ఐదు రకాల విటమిన్లు మన చర్మం యొక్క రంగును, మెరుపును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విటమిన్లు ఏంటి ? అవి ఎలా పనిచేస్తాయి ? ఏ ఆహారాల్లో లభిస్తాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మ కాంతికి అవసరమైన 5 ముఖ్యమైన విటమిన్లు:

Advertisement

1. విటమిన్ సి:
విటమిన్ సి చర్మానికి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల చర్మం బిగుతుగా, యవ్వనంగా కనిపిస్తుంది. ఇది సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా నల్లని మచ్చలను మాయం చేస్తుంది.

లభించే పదార్థాలు: నిమ్మ, నారింజ, ఉసిరి, జామ, స్ట్రాబెర్రీలు.

Advertisement

2. విటమిన్ ఇ:
విటమిన్ ఇ చర్మానికి సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది చర్మంలో తేమను నిలిపి ఉంచి, పొడి బారకుండా కాపాడుతుంది. కణాల పునరుద్ధరణకు ఇది ఎంతో అవసరం. చర్మం మృదువుగా..మృదువుగా ఉండాలంటే విటమిన్ ఇ తగినంత ఉండాలి.

లభించే పదార్థాలు: బాదం, పొద్దుతిరుగుడు గింజలు, పాలకూర, అవకాడో.

3. విటమిన్ ఎ:
చర్మంపై పగుళ్లు, ముడతలు తగ్గించడానికి విటమిన్ ఎ చాలా ముఖ్యం. ఇది పాత కణాలను తొలగించి కొత్త కణాలు పుట్టేలా చేస్తుంది. దీన్నే చర్మ సంరక్షణ భాషలో ‘రెటినోల్’ అని కూడా పిలుస్తారు. మొటిమలు తగ్గడానికి, చర్మం సమానమైన రంగులో ఉండటానికి ఇది సహాయ పడుతుంది.

లభించే పదార్థాలు: క్యారెట్లు, చిలగడదుంపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు.

4. విటమిన్ బి3:
దీనిని నియాసినామైడ్ అని కూడా అంటారు. ఇది చర్మంపై ఎరుపును తగ్గించి, చర్మ రంగును మెరుగు పరుస్తుంది. చర్మం లోపల సెరామైడ్లను పెంచి తేమను కాపాడుతుంది. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది చర్మంపై ఉండే రంధ్రాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

లభించే పదార్థాలు: వేరుశనగలు, పప్పు ధాన్యాలు, చికెన్, పుట్టగొడుగులు.

Also Read: చల్లని చేతులు, పాదాలు.. ఇది రక్త ప్రసరణ సమస్యకు సంకేతమా ?

5. విటమిన్ డి:
సూర్యరశ్మి ద్వారా లభించే ఈ విటమిన్ చర్మ వ్యాధులను నివారించడంలో, కొత్త చర్మ కణాల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపిస్తే చర్మం పాలిపోయినట్లు, నీరసంగా కనిపిస్తుంది. ఇది చర్మం యొక్క రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

లభించే మార్గాలు: ఉదయం ఎండలో నిలబడటం, చేపలు, పాలు, ఫోర్టిఫైడ్ ఆహారాలు.

మీ చర్మం మెరవాలంటే కేవలం ఖరీదైన కాస్మెటిక్స్ మీద ఆధారపడకుండా.. పైన చెప్పిన విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోండి. ఆహారంతో పాటు రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం, సరైన నిద్ర పోవడం వల్ల చర్మం సహజంగానే కాంతివంతంగా మారుతుంది.

Related News

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

Big Stories

Advertisement
×