E-Paper
Advertisement

KTR: అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలా.. కేటీఆర్ ఫైర్..!

KTR: అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలా.. కేటీఆర్ ఫైర్..!
Advertisement

KTR: అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పై మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ రాజకీయ నాటకాల కోసం ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ను వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరం అన్నారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడం వల్ల, ప్రపంచ దేశాల ముందు మన దేశం ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే, కానీ ఎక్కడ.. ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయన్నారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వంటి అంతర్జాతీయ సదస్సు ఖచ్చితంగా దానికి వేదిక కాదు అని హితవు పలికారు. సీఎంరేవంత్ రెడ్డి అదే ఏఐ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రం అని దుయ్యబట్టారు.

Also Read: Ram Pothineni : రూటు మార్చిన రామ్.. క్రేజీ డైరెక్టర్ తో మూవీ..?

కాంగ్రెస్ పాలనకు పరాకాష్ట

Advertisement

కాంగ్రెస్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన అని కేటీఆర్ మండిపడ్డారు. ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అయినవారిని కనీసం చివరిచూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలకు మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. సంవత్సరం గడుస్తున్న మృతదేహాల వెలికితీతలో కానీ సొరంగం పనుల్లో కానీ ఎటువంటి పురోగతి లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై పెట్టే శ్రద్ధ, ఇకనైనా కార్మిక సంక్షేమం మీద, ప్రజా శ్రేయస్సు మీద పెడితే ఇటువంటి విషాదాలు పునరావృతం కావు అని అన్నారు.

Also Read: Bhadradi: భద్రాద్రి రాములోరి తలంబ్రాలు మీ ఇంటికే డోర్ డెలివరీ – అందుకోసం ఎం చేయాలో తెలుసా..?

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×