E-Paper
Advertisement

Facepacks: చర్మాన్ని సులువుగా ఇలా అలోవెరా జెల్‌తో మెరిపించేయండి

Facepacks: చర్మాన్ని సులువుగా ఇలా అలోవెరా జెల్‌తో మెరిపించేయండి
Advertisement

సోషల్ మీడియాలో ఇప్పుడు “కొరియన్ గ్లాస్ స్కిన్” అనే ట్రెండ్ చాలా వైరల్ అవుతోంది. చర్మం గాజులా మెరిసేలా కనిపిస్తే దానిని గ్లాస్ స్కిన్ అంటారు. దీనిని పొందడానికి ఖరీదైన క్రీములు అవసరమని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఇంట్లో ఉన్న సులభమైన పదార్థాలతోనే ఈ లుక్‌ను ప్రయత్నించవచ్చు.

ఈ ఫేస్ మాస్క్ చేయడానికి కావాల్సినవి మూడు మాత్రమే.ఆలోవెరా జెల్, బియ్యం నీరు, తేనె. ఇవన్నీ చర్మానికి సహజంగా మంచివి. రైస్ వాటర్ తయారు చేయడానికి బియ్యాన్ని కొంతసేపు నీటిలో నానబెట్టి, ఆ నీటిని వడకట్టాలి. ఈ నీరు చర్మాన్ని మెత్తగా చేసి బ్రైట్‌గా కనిపించడంలో సహాయపడుతుంది.

Advertisement

ఫేస్ మాస్క్ తయారీ
ఫేస్ మాస్క్ తయారు చేయడం చాలా సులభం. ఒక స్పూన్ ఆలోవెరా జెల్, ఒక స్పూన్ రైస్ వాటర్, ఒక టీ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. పలుచగా ఉన్న ఈ పేస్ట్‌ను ముందుగా శుభ్రం చేసిన ముఖానికి రాయాలి. 15 నుంచి 20 నిమిషాలు వదిలి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండు మూడు సార్లు చేస్తే ఫలితం మెరుగ్గా కనిపిస్తుంది.

ఈ మూడు పదార్థాలు కలిసి చర్మానికి మంచి తేమ ఇస్తాయి. ఆలోవెరా చర్మాన్ని చల్లగా ఉంచుతుంది. రైస్ వాటర్ చర్మం మీద ఉన్న మసక తగ్గించి ఫ్రెష్ లుక్ ఇస్తుంది. తేనె చర్మాన్ని మృదువుగా ఉంచి ఎండిపోకుండా కాపాడుతుంది. అందుకే ఈ మాస్క్ వాడితే చర్మం మెరిసేలా అనిపిస్తుంది.

Advertisement

ప్యాచ్ టెస్ట్ తప్పదు
అయితే, ఈ మాస్క్ అందరికీ ఒకేలా పనిచేయకపోవచ్చు. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఆలోవెరా లేదా తేనెకు అలెర్జీ ఉంటే వాడకూడదు. అలాగే ఇది వెంటనే ఫలితం ఇచ్చే మాంత్రిక మాస్క్ కాదు. కొద్ది రోజులు, కొద్దికాలం పాటు వాడితేనే మార్పు కనిపిస్తుంది.

ఈ ఫేస్ మాస్క్‌తో పాటు రోజువారీ మంచి అలవాట్లు కూడా ముఖ్యం. ఎక్కువ నీరు తాగడం, సన్‌స్క్రీన్ వాడడం, సరైన నిద్ర తీసుకోవడం, తక్కువ మేకప్ వాడడం … ఇవన్నీ కలిసి గ్లాస్ స్కిన్ లుక్ వచ్చేలా సహాయపడతాయి. అందుకే ఈ సింపుల్ హోమ్ రెమీడీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×