E-Paper
Advertisement

Black Garlic: నల్ల వెల్లుల్లి ఎలా తయారుచేస్తారు? దీన్ని తినడం వల్ల లాభాలేంటి?

Black Garlic: నల్ల వెల్లుల్లి ఎలా తయారుచేస్తారు? దీన్ని తినడం వల్ల లాభాలేంటి?
Advertisement

వెల్లుల్లి మన వంటింట్లో సాధారణంగా ఉపయోగించే పదార్థం. అయితే ఇటీవలి కాలంలో నల్ల వెల్లుల్లి (Black Garlic) అనే కొత్త ఆహారం గురించి వినిపిస్తోంది. ఇది సాధారణ వెల్లుల్లి కాదు. ప్రత్యేక పద్ధతిలో తయారైనది. ఇది ఆరోగ్యానికి చాలా లాభాలు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ‘సూపర్ ఫుడ్’ గా కూడా గుర్తింపు పొందింది.

నల్ల వెల్లుల్లి తయారీ
నల్ల వెల్లుల్లి తయారీకి సాధారణ తెల్ల వెల్లుల్లినే తీసుకుంటారు. అయితే ఈ వెల్లుల్లిని 30 నుండి 40 రోజుల పాటు ఉష్ణోగ్రత (60–80°C) తేమ ఉండే ఒక ప్రత్యేక పెట్టెలో ఉంచుతారు. ఈ సమయంలో వెల్లుల్లిలో సహజంగా ఉండే రసాయనాలు మారతాయి. దీంతో వెల్లుల్లి రంగు నల్లగా మారుతుంది. ఈ ప్రక్రియను ఫెర్మెంటేషన్ అంటారు. ఈ ఫెర్మెంటేషన్ కారణంగా వెల్లుల్లి రుచి మారుతుంది. ఇది తీపి, పులుపు కలిసినట్లు ఉంటుంది. సాధారణ వెల్లుల్లిలా కారం లేదా దుర్వాసన రాదు.

Advertisement

నల్ల వెల్లుల్లిలో ఏముంటుంది?
నల్ల వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణ వెల్లుల్లితో పోలిస్తే ఇందులో ఆరోగ్యకరమైన రసాయనాలు రెండింతలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా అలిసిన్, ఫ్లేవనాయిడ్స్, అమైనో ఆమ్లాలు వంటి పదార్థాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఈ పదార్థాలు మన శరీరంలోని కణాలను రక్షించడంలో సహాయపడతాయి. అలాగే ఇమ్యునిటీ పెంచడంలో కూడా ఉపయోగపడతాయి.

నల్ల వెల్లులితో ఎన్నో లాభాలు
నల్ల వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి. దీంతో హార్ట్ అటాక్ ప్రమాదం తగ్గుతుంది. నల్ల వెల్లుల్లిని ప్రతిరోజూ తింటే శరీర ప్రతిరక్షణ శక్తి పెరుగుతుంది. దుమ్ము, కాలుష్యం, ఇన్‌ఫెక్షన్లు వల్ల వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. హై బీపీ ఉన్నవారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. నల్ల వెల్లుల్లి రక్తనాళాలను సడలించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

Advertisement

మధుమేహం ఉన్న వారికి
నల్ల వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు దీనిని మోతాదు తెలిసి తింటే ప్రయోజనం ఉంటుంది. ఇది శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుంది. ఈ కారణంగా కణాలు నష్టం పొందకుండా రక్షిస్తుంది. చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం నల్ల వెల్లుల్లిలో క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగింప చేసే లక్షణాలు కనిపించినట్టు చెబుతున్నారు. అయితే దీన్ని పూర్తిగా వైద్య చికిత్సలా భావించకూడదు. ఇది సహాయక ఆహారంగా ఉపయోగకరం.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×