E-Paper
Advertisement

మట్టి లేకుండా ఇంట్లో పెంచే మొక్కలు.. తాజా గాలితో పాటు ఇంటికి అందం కూడా

మట్టి లేకుండా ఇంట్లో పెంచే మొక్కలు.. తాజా గాలితో పాటు ఇంటికి అందం కూడా
Advertisement

ఇంటి లోపల మొక్కలు పెంచడం చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇంట్లో మొక్కలకు అవసరమైన మట్టి లేకపోవడం లేదా స్థలం లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. కానీ విచిత్రమేమిటంటే కొన్ని మొక్కలు మట్టి అవసరం లేకుండానే నీళ్లలో లేదా ఇతర విధానాల్లో సులభంగా పెరుగుతాయి. ఈ మొక్కలు ఇంటిని అందంగా అలంకరిచడంతో పాటు గాలిని శుభ్రంగా ఉంచుతాయి.

మట్టి అవసరం లేని మొక్కలు పెరుగుతున్న డిమాండ్

చాలా మంది ఇళ్లు చిన్నవిగా ఉంటాయి. మట్టి లేని మొక్కలకు పెంచడం చాలా ఈజీ. ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు, ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది. వీటి వల్ల ఇల్లు కూడా అందంగా ఉంటుంది. ఇంట్లో ఆక్సిజన్‌ కూడా పెరుగుతుంది.

మట్టి లేని గార్డెనింగ్ ఎలా చేయాలి?

Advertisement

మట్టి లేని గార్డెనింగ్‌ అంటే మొక్కలను నీళ్లలో, గులకరాళ్లు లేదా పోషక ద్రావణాల్లో పెంచుతారు. దీన్ని హైడ్రోపోనిక్స్ అని కూడా అంటారు. ఈ ప్రక్రియ చాలా సౌకర్యవంతం, శుభ్రంగా ఉంటుంది.

మనీ ప్లాంట్ నీటిలో సులభంగా పెరుగుతుంది

మనీ ప్లాంట్ ఇంటి లోపల నీళ్లలో పెంచడానికి అతి సులభమైన మొక్క. ఒక మొక్క కట్టింగ్‌.. గ్లాసు బాటిల్‌లో పెట్టితే కొద్ది రోజుల్లోనే వేర్లు వస్తాయి. సూర్యకాంతి తక్కువగా ఉండేలా చూస్తూ.. శుభ్రమైన నీరు కూడా పెట్టాలి.

Advertisement

Also Read: డిప్రెషన్, మానసిక సమస్యలకు శరీరంలో ఈ విటమిన్ లోపం కూడా కావొచ్చు..

లక్కీ బ్యాంబూ.. తక్కువ సంరక్షణతో పెరుగుతుంది

లక్కీ బ్యాంబూ మొక్క నీటిలో అందంగా పెరుగుతుంది. డెకరేటివ్ రాళ్లతో గ్లాసు పాత్రలో ఉంచవచ్చు. వాస్తు ప్రకారం.. ఇది సానుకూల శక్తిని తెస్తుందని చాలా మంది నమ్ముతారు. నీటిని క్రమం తప్పకుండా మార్చాలి.

స్పైడర్ ప్లాంట్ కూడా నీటిలో పెరుగుతుంది

స్పైడర్ ప్లాంట్ ఆకులు పొడువుగా ఉండి ఇంటిని అందంగా చేస్తాయి. ఈ ఆకులు గాలిని శుద్ధి చేస్తాయి. మొక్క కట్టింగ్స్ నీటిలో త్వరగా రూట్స్ వస్తాయి.

ఫిలోడెండ్రాన్, పోతోస్ మొక్కలు

ఫిలోడెండ్రాన్ హార్ట్ ఆకారపు ఆకులతో అందంగా ఉంటుంది. పోతోస్ తీగలు లాగా పెరిగి ఇంటిని అందంగా అలంకరిస్తాయి. రెండూ నీటిలో తక్కువ శ్రద్ధతో పెరుగుతాయి.

చైనీస్ ఎవర్‌గ్రీన్, హెర్బ్స్

చైనీస్ ఎవర్‌గ్రీన్ మొక్క రంగురంగుల ఆకులతో అందంగా ఉంటుంది. మింట్, బాసిల్, కొత్తిమీర వంటి మూలిక మొక్కలను కూడా నీళ్లలో పెంచవచ్చు. వంట చేయడానికి ఈ తాజా మొక్కల ఆకలు అందుబాటులో ఉంటాయి.

పీస్ లిల్లీ కూడా నీటిలో పెరుగుతుంది

పీస్ లిల్లీ తెల్లటి పూలతో అందంగా ఉంటుంది. ఇది గాలిని శుద్ధి చేస్తుంది.

మట్టి అవసరం లేని మొక్కల ప్రయోజనాలు

ఇవి ఇంట్లో మురికి, కీటకాలు తగ్గిస్తాయి. వీటి రూట్స్ గ్లాసులో కనిపించడం అందంగా ఉంటుంది. స్ట్రెస్ తగ్గి మనసు ప్రశాంతంగా అవుతుంది.

నీటి మొక్కల సంరక్షణ చిట్కాలు

ఈ మొక్కల నీటిని 2 లేదా 3 రోజులకొకసారి మార్చాలి. సూర్యకాంతి పరోక్షంగా ఉండేలా చూడాలి. గ్లాసు పాత్రలు ఉపయోగించి రూట్స్ కనిపించేలా చూడాలి. రూట్స్‌కు తగినంత స్థలం ఇవ్వాలి.

ఈ మొక్కలు తక్కువ ఖర్చుతో, సులభంగా పెంచేందుకు వీలుగా ఉంటుంది. ఇల్లు ఆకుపచ్చగా అందంగా ఉంటుంది.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×