E-Paper
Advertisement

కాకరకాయ పరోటా.. చేదు లేకుండా సూపర్ టేస్ట్.. ఈజీగా ఇలా చేయండి

కాకరకాయ పరోటా.. చేదు లేకుండా సూపర్ టేస్ట్.. ఈజీగా ఇలా చేయండి
Advertisement

కూరగాయల్లో అన్నింటి కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉండేది కాకరకాయ. అయినప్పటికీ దాని చేదు రుచి వల్ల చాలా మంది దీన్ని తినడానికి ఇష్టపడరు.

ప్రముఖ షెఫ్ రన్వీర్ బ్రార్ ఇటీవల కాకరకాయ పరోటా ఈజీ రెసిపీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ రెసిపీలో పోషకాలు, రుచి, సులభమైన టిప్స్ ఉన్నాయి. ఈ కొత్త పరోటా చాలా ఆరోగ్యకరమైన ఆహారం.

కాకరకాయ ఆరోగ్యానికి ఎందుకు మంచిది?

Advertisement

కాకరకాయలో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. కాకరకాయ తినడం జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి సహాయపడుతుంది. జీవక్రియ మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయినా దీని చేదు రుచి కారణంగా చాలా మంది దీన్ని తినేందుకు ఇష్టపడరు.

కాకరకాయ చేదు తగ్గించడానికి సులభమైన ట్రిక్

షెఫ్ రన్వీర్ బ్రార్ ప్రకారం.. కాకరకాయ పరోటా సులభంగా తయారు చేయడనాకి ముందుగా.. కాకరకాయను కడిగి పొట్టు తీసి సన్నగా ముక్కలు చేయండి. ముక్కలపై సరిపడా ఉప్పు వేసి 20 నిమిషాలు పక్కన పెట్టండి. ఉప్పు కాకరకాయలోని అదనపు నీరు, చేదును బయటకు తీస్తుంది. తర్వాత శుభ్రమైన చేతులతో ముక్కలను గట్టిగా పిండి నీరు తొలగించండి. ఈ ప్రక్రియ వల్ల చేదు రుచి చాలా తగ్గుతుంది.

కాకరకాయ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు

  • కాకరకాయ
  • గోధుమ పిండి
  • ఉల్లిపాయలు
  • పచ్చి మిర్చి
  • కొత్తిమీర
  • పసుపు
  • కారం పొడి
  • జీలకర్ర
  • ఉప్పు
  • నూనె లేదా నెయ్యి
Advertisement

అన్ని తాజా పదార్థాలు వేస్తే పరోటా రుచికరంగా ఉంటుంది.

కాకరకాయ పరోటా ఎలా తయారు చేయాలి?

ముందుగా పరోటా పిండిలో వేయడానికి కరేలా ఫిల్లింగ్ రెడీ చేసుకోండి. ఆ తరువాత పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్‌లో వచ్చిన తర్వాత కాకరకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా వేయించండి. చివర్లో కొత్తిమీర వేసి దించండి.

గోధుమ పిండితో మెత్తగా పరోటా కోసం పిండి తయారు చేసి చిన్న ఉండలు చేయండి. పిండి ఉండలో కాకరకాయ మసాలా నింపి.. ఉండలు  మూసి వేయండి. సన్నగా చపాతీలా వేయండి. హాట్ తవాలో నూనె లేదా నెయ్యి వేసి రెండు వైపులా బాగా వేయండి.

కాకరకాయ పరోటా ఉదయం టిఫిన్ కోసం బెస్ట్

ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజంతా ఎనర్జీని అందిస్తుంది. ఇంట్లో తయారు చేసుకుంటే ప్రాసెస్డ్ ఫుడ్‌ల కంటే చాలా ఆరోగ్యకరం.

Also Read: తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయకూడదు.. పిల్లలు మనసులో ద్వేష భావన కలుగుతుంది

రుచి మరింత పెంచడానికి టిప్స్

కాకరకాయ చేదు ఇంకా తగ్గాలంటే గ్రేటెడ్ పన్నీర్ లేదా బంగాళదుంపలు కలపవచ్చు. పెరుగు లేదా అచార్‌తో పాటు తినడం రుచిని మరింత పెంచుతుంది. మీడియం ఫ్లేమ్‌పై వేయించడం వల్ల పరోటాలు మెత్తగా వస్తాయి.

కాకరకాయ పరోటా ఆరోగ్యకరమైన, రుచికరమైన ఉదయం భోజనం. సరైన పద్ధతిలో చేస్తే చేదు తగ్గి అందరూ ఆనందంగా తినవచ్చు. ఇలాంటి సాంప్రదాయ కూరగాయలను క్రియేటివిటీగా వంటల్లో చేర్చడం ఆరోగ్యానికి మంచిది.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×