E-Paper
Advertisement

కోడి గుడ్డు బాయిల్ చేస్తే ఈ గుర్తులు కనిపిస్తే పొరపాటున కూడా తినకండి.. చాలా ప్రమాదం

కోడి గుడ్డు బాయిల్ చేస్తే ఈ గుర్తులు కనిపిస్తే పొరపాటున కూడా తినకండి.. చాలా ప్రమాదం
Advertisement

Fake Eggs| కోడి గుడ్లు చాలా మంది ఇంట్లో ప్రతిరోజూ ఇష్టంగా తింటారు. ఇవి ప్రోటీన్, విటమిన్లు, పోషకాలు ఇస్తాయి. కానీ మార్కెట్లో నకిలీ గుడ్లు ఉన్నాయని వైరల్ వీడియోలు చాలా భయం కలిగిస్తున్నాయి. నకిలీ గుడ్లను గుర్తించడం ద్వారా మంచి గుడ్లు కొనుగోలు చేయవచ్చు.

నకిలీ గుడ్ల గురించి ఆందోళన

ఆహారంలో కలుషితం చేయడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. మార్కెట్లో నకిలీ కోడి గుడ్లు లభిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. వీటిని రసాయనాలు, ప్లాస్టిక్ లాంటి పదార్థాలతో తయారు చేస్తారని సమాచారం. ఇవి బయట నుంచి నిజమైన గుడ్లలాగే కనిపిస్తాయి. కానీ ఆరోగ్యానికి హాని చేసి, కడుపులో జీర్ణ సమస్యలు కలిగించవచ్చు.

గుడ్డు ఉపరితలం జాగ్రత్తగా చూడండి

Advertisement

నిజమైన గుడ్ల గుండ్రం ఉపరితలం కొంచెం రఫ్‌గా, అసమానంగా ఉంటుంది. నకిలీ గుడ్లు అధికంగా మెరుస్తూ, చాలా స్మూత్‌గా లేదా ప్లాస్టిక్ లాగా ఉంటాయి. అలా కాకుండా ఆకృతిలో చిన్న చిన్న లోపాలు ఉంటే అవి నిజమైన గుడ్ల అని అర్థం.

షేక్ టెస్ట్ చేయండి

గుడ్డును చెవి దగ్గర పట్టుకొని మెల్లగా షేక్ చేయండి. నిజమైన తాజా గుడ్లలో శబ్దం దాదాపు రాదు. పాత లేదా సందేహాస్పద గుడ్లలో లోపల నుంచి కదులుతున్నట్లు శబ్దం వస్తుంది.

గుడ్డు ఆకారం గమనించండి

Advertisement

నిజమైన గుడ్లు అన్నీ ఒకేలా ఉండవు. కొంచెం ఆకారం, సైజు తేడాలు ఉంటాయి. నకిలీ గుడ్లు చాలా పర్ఫెక్ట్‌గా, ఒకేలాగా, మెషిన్‌తో తయారు చేసినట్లు కనిపిస్తాయి.

నీళ్లతో పరీక్షించండి

ఒక గ్లాసు లేదా బౌల్‌లో నీళ్లు పోసి గుడ్డును మెల్లగా వేయండి. తాజా గుడ్లు అడ్డంగా మునిగిపోతాయి. పాత గుడ్లు నిలువుగా నిలబడతాయి. పాడైన గుడ్లు పైకి తేలిపోతాయి.

వాసన ద్వారా గుర్తించండి

పాడైన గుడ్ల నుంచి వాసన వస్తుంది. కొన్నిసార్లు పగలకుండానే వీటి నుంచి విచిత్రమైన లేదా రసాయనాల వాసన వస్తుంది. నిజమైన తాజా గుడ్ల నుంచి వాసన రాదు.

ప్యాకేజింగ్, లేబుల్స్ చూడండి

నమ్మకమైన బ్రాండ్లు గడువు తేదీ, బ్యాచ్ నంబర్, ఫామ్ వివరాలు స్పష్టంగా ఇస్తాయి. అస్పష్టమైన లేబుల్స్ ఉన్నవి జాగ్రత్తగా ఉండాలి.

నకిలీ గుడ్ల గురించి తప్పుడు నమ్మకాలు

సోషల్ మీడియాలో చాలా వరకు తప్పుడు సమాచారం వ్యాపిస్తోంది. పెద్ద స్థాయిలో నకిలీ గుడ్లు తయారీ అవుతున్నాయని చెబుతున్నారు. కానీ అలా జరగడం అరుదు. గుడ్డు రంగు (తెలుపు లేదా గోధుమ రంగు) చూసి అది నిజమైన గుడ్డు లేదా నకిలీ గుడ్డు అని చెప్పలేం.

Also Read: వేసవిలో ఇడ్లీ, దోశ పిండి రుచి పుల్లగా మారిందా? పారేయకండి ఇలా చేస్తే మళ్లీ తాజా రుచి

పాత గుడ్ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు

నాణ్యత లేని గుడ్లు.. కడుపు నొప్పి, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్ లాంటి సమస్యలు కలిగించవచ్చు. పిల్లలు, వృద్ధులు ఎక్కువ జాగ్రత్త వహించాలి.

గుడ్లు జాగ్రత్తగా కొనండి

నమ్మకమైన దుకాణాలు, సరైన విక్రేతల నుంచి మాత్రమే గుడ్లు కొనండి. పైన చెప్పిన సులభమైన పద్ధతుల ద్వారా నాణ్యత గల గుడ్లు ఎంపిక చేసుకోండి.

Related News

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Big Stories

Advertisement
×