E-Paper
Advertisement

నగరాన్ని వల్లకాడుగా మార్చే మాయరోగం… కట్ చేస్తే ఒకే ఒక్క వ్యక్తి ఒంటరి పోరాటం

నగరాన్ని వల్లకాడుగా మార్చే మాయరోగం… కట్ చేస్తే ఒకే ఒక్క వ్యక్తి ఒంటరి పోరాటం
Advertisement

Zombie Movie OTT : ప్రపంచంలో ఎవరూ లేకుండా మనం మాత్రమే జీవించి ఉంటే ఎంత బాగుంటుందో అనే ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా? ఈ ఆలోచన ఊహించడానికి బాగానే ఉంటుంది కానీ రియాల్టీలోను, రీల్‌ లైఫ్‌లోనూ సీన్‌ కాస్త డిఫెరెంట్‌గా, భయంకరంగా ఉంటుంది. మాట్లాడటానికి మనుషులే లేకుండా.. వినిపించే శబ్దం గాలిది మాత్రమే అయితే ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా మారుతుందో ఊహించుకుంటునే ఎంతో భయంవేస్తుంది. పగలు ఖాళీగా కనిపించే నగరం.. రాత్రి పడే సరికి మాత్రం ప్రాణాలు తీసే చీకటి ప్రపంచంగా మారితే అక్కడ ఒక్కరోజు గడపడం కూడా ఎంత కష్టమో కదా. ఇలాంటి భయం, ఒంటరితనం, ప్రాణాల కోసం పోరాటంతో ముందుకు సాగే కథే ‘ఐ యమ్‌ లెజెండ్'(I Am Legend). ఇది ఒక మనిషి ఆశ కోల్పోకుండా ఎలా బతికాడో చూపించే సర్వైవల్ థ్రిల్లర్. మొదటి సీన్‌ నుంచే ఖాళీగా కనిపించే నగరం ప్రేక్షకుడిలో ఒక విచిత్రమైన భయాన్ని కలిగిస్తుంది.

ఎక్కడ చూడాలి ?

2007లో విడుదలైన ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ అవుతోంది. ఈ చిత్రానికి ఫ్రాన్సిస్ లారెన్స్ దర్శకత్వం వహించారు. విల్ స్మిత్ ప్రధాన పాత్రలో నటించారు. సినిమా మొత్తం ఎక్కువ భాగం ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఒంటరిగా జీవించే వ్యక్తి పరిస్థితిని ఆయన చాలా సహజంగా చూపించారు. పాడైపోయిన నగరం, ఖాళీ రోడ్లు, రాత్రి వచ్చే భయంకర జీవులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్ గూస్‌బంప్స్‌ అనే చెప్పాలి. ఇక కొన్ని సీన్స్‌ను ఎలాంటి మ్యూజిక్‌ లేకుండా సైలెంట్‌గా చూపించిన విధానం మూవీని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లింది.

స్టోరీ ఏంటంటే ?

Advertisement

క్యాన్సర్‌కు మందుగా తయారు చేసిన ఒక వైరస్ అనుకోకుండా ప్రపంచాన్ని నాశనం చేసే స్థాయికి చేరుతుంది. ఆ వైరస్ కారణంగా చాలా మంది మనుషులు చనిపోతారు. ఇంకొందరు భయంకర జీవులుగా మారిపోతారు. ఈ పరిస్థితిలో న్యూయార్క్ నగరంలో రాబర్ట్ నెవిల్ అనే వ్యక్తి మాత్రమే సాధారణ మనిషిగా మిగిలిపోతాడు.

అతను ఒక శాస్త్రవేత్త. వైరస్‌కు మందు కనుగొనడానికి ప్రతిరోజూ ప్రయత్నిస్తుంటాడు. పగలు నగరమంతా తిరిగి అవసరమైన వస్తువులు సేకరిస్తాడు. రాత్రి అయితే ఇంట్లో దాక్కుంటాడు. ఎందుకంటే చీకటి పడిన తర్వాత వైరస్ బారినపడిన జీవులు బయటకు వస్తాయి. అవి మనుషులపై దాడి చేస్తాయి. రాబర్ట్ జీవితంలో అతని కుక్క మాత్రమే తోడుగా ఉంటుంది. మాట్లాడటానికి మనుషులు లేకపోవడంతో అతని ఒంటరితనం మరింత పెరుగుతుంది. అయినా కూడా ఆశ వదలకుండా వైరస్‌కు చికిత్స కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో కొన్ని ప్రమాదకర ఘటనలు జరుగుతాయి. ఒక దశలో ఇంకా కొంతమంది బతికి ఉన్నారని అతనికి తెలుస్తుంది.

Advertisement

అక్కడి నుంచి కథ మరింత ఎమోషనల్‌గా మారుతుంది. వైరస్‌కు మందు కనుగొనే ప్రయత్నంలో రాబర్ట్ తీసుకునే నిర్ణయాలు కథను క్లైమాక్స్‌కు తీసుకెళ్తాయి. చివరికి ప్రపంచాన్ని కాపాడటానికి అతను చేసే త్యాగం ఈ కథకి హైలెట్‌గా నిలుస్తుంది. ఒంటరితనం, భయం, ఆశ కలిసిన ఈ సినిమా చివరి వరకు ప్రేక్షకుడిని స్టోరీలో ఇన్వాల్వ్‌ అయ్యేలా చేస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×