E-Paper
Advertisement

మైగ్రేన్ నొప్పితో తలపగిలిపోతోందా? ఈ ఆకులతో ఉపశమనం.. ఎలా ఉపయోగించాలంటే

మైగ్రేన్ నొప్పితో తలపగిలిపోతోందా? ఈ ఆకులతో ఉపశమనం.. ఎలా ఉపయోగించాలంటే
Advertisement

Migraine Relief Leaves| తలనొప్పి రావడం సాధారణ విషయం. తక్కువ నిద్ర, సమయానికి ఆహారం తినకపోవడం, ఒత్తిడి లాంటి కారణాలతో తలనొప్పి వస్తుంది. అయితే మైగ్రేన్ అనేది ఒక తీవ్రమైన తలనొప్పి. ఇది సాధారణంగా తలలో ఒక వైపు మాత్రమే తీవ్రమైన బాధను కలిగిస్తుంది. ఈ నొప్పి ఉన్నప్పుడు వికారంగా ఉంటుంది, వెలుగును చూడలేని స్థితి కూడా ఏర్పడవచ్చు. మైగ్రేన్ అటాక్ గంటల తరబడి లేదా రోజుల పాటు కూడా ఉంటుంది. దీంతో రోజువారీ జీవితంపై ప్రభావితం అవుతుంది. ఈ నొప్పి వస్తే ఏ పని సరిగా చేయలేకపోతారు.

మైగ్రేన్ ఎందుకు వస్తుంది?

మైగ్రేన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి (స్ట్రెస్) ఒక ప్రధాన కారణం. తగినంత నిద్ర లేకపోవడం, హార్మోన్ల మార్పులు, కొన్ని రకాల ఆహారాలు, ఘాటు వాసనలు కూడా మైగ్రేన్ కు కారకమవుతాయి. నీరు తక్కువగా తాగడం, సక్రమంగా భోజనం చేయకపోవడం కూడా మైగ్రేన్ కు దారితీయవచ్చు.

మైగ్రేన్ ఉపశమనం కోసం నిమ్మ ఆకులు

Advertisement

నిమ్మ ఆకుల్లో సహజమైన రసాయనాలు ఉంటాయి, ఇవి శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. అవి తలనొప్పి తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. నిమ్మ ఆకుల సహజ సువాసన మనస్సును శాంతింపజేస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గి మైగ్రేన్ నొప్పి తగ్గుతుంది. మంచి నిద్ర కూడా మైగ్రేన్ నుండి ఉపశమనం ఇస్తుంది.

నిమ్మ ఆకులను ఎలా ఉపయోగించాలి?

మీరు ఇంట్లోనే నిమ్మ ఆకుల ఉపయోగించి టీని తయారు చేసుకోవచ్చు. తాజా నిమ్మ ఆకులను బాగా కడిగి, నీళ్ళలో వేడి చేయండి. ఆ నీటి ఆవిరిని పీల్చడం వలన కూడా తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఆకులను ప్రెస్, వాటి వాసనను పీల్చడం కూడా మనస్సును తక్షణమే రిలాక్స్ చేస్తుంది.

నిమ్మ ఆకుల వలన ఇతర ప్రయోజనాలు

Advertisement

నిమ్మ ఆకులు సహజమైనవి, హానికరమైన రసాయనాలు లేవు. ఇవి ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి. తేలికపాటి మైగ్రేన్ లక్షణాలను అదుపు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.

మైగ్రేన్ రాకుండా ఉండటానికి జీవనశైలి చిట్కాలు

పగటిపూట తగినంత నీరు త్రాగండి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోండి, లేవండి. భోజనం స్కిప్ చేయకండి. మొబైల్, టీవి, ల్యాప్‌టాప్ స్క్రీన్ టైమ్ తగ్గించండి. ధ్యానం, ప్రాణాయామం వంటి విశ్రాంతి పద్ధతులు పాటించండి.

Also Read: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? ఈ నాలుగు అలవాట్లే కారణం..

డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

తేలికపాటి మైగ్రేన్ కు సహజ ఉపాయాలు పనిచేస్తాయి. కానీ నొప్పి తరచుగా లేదా తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. బలమైన లేదా అసాధారణమైన తలనొప్పిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి.

ముఖ్య గమనిక: ఈ వ్యాసంలో ఉన్నది సాధారణ సమాచారం మాత్రమే. తీవ్ర ఆరోగ్య సమస్యలకు ఆరోగ్య నిపుణుల సూచనల తప్పనిసరిగా పాటించాలి.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×