E-Paper
Advertisement

నేడే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికలు!

నేడే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికలు!
Advertisement

Tollywood: సినిమా పరిశ్రమ అంటే కేవలం హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత , నటీనటులు, సంగీత దర్శకులు మాత్రమే కాదు మొత్తం 24 విభాగాలు ఉంటాయి. ఈ 24 విభాగాలకు చెందిన కార్మికుల యోగక్షేమాలు, ఇబ్బందులు అన్నింటినీ పర్యవేక్షించడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫెడరేషన్ లో ఇప్పుడు ఎన్నికలు ప్రారంభం అయ్యాయి.. పరిశ్రమలో తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్న అభ్యర్థుల మధ్య నేడు గట్టి పోటీ నెలకొంది. మరి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారు? ఎవరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ బాధ్యతలు తీసుకోబోతున్నారు? అనే ఉత్కంఠ సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

నేడే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్..

ఇకపోతే తాజాగా నేడు ఎన్నికలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా.. అప్పుడే కొంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇకపోతే రెండు గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఈరోజు సాయంత్రం 3 గంటల కల్లా విజేతలు ఎవరో తెలియనుంది. ఇకపోతే ఈసారి ఎన్నికలలో వివిధ పదవుల కోసం ఆసక్తికరమైన పోటీ నెలకొనిందని చెప్పాలి. ఎవరెవరు పోటీకి బరిలోకి దిగారు? ప్రధాన పదవుల కోసం పోటీపడుతున్న అభ్యర్థులు ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం.

Advertisement

also read:రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న మహేష్ బాబు వన్ నేనొక్కడినే.. ఎప్పుడంటే?

ప్రధాన పదవుల మధ్య పోటీ..

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ లో భాగంగా అధ్యక్షుడి పదవికి ఇద్దరు బలమైన నేతల మధ్య ముఖాముఖి పోరి ఉండగా.. ప్రధాన కార్యదర్శి కోసం ఏకంగా ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇక కోశాధికారి కోసం ఇద్దరి మధ్య పోటీ మొదలయ్యింది. మరి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో తెలియాలి అంటే మూడు గంటల వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు కార్మికుల యోగక్షేమాలను బాధ్యతగా నెరవేరుస్తారు? అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

Big Stories

Advertisement
×