E-Paper
Advertisement

Ghee Benefits: వర్షాకాలంలో నెయ్యి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

Ghee Benefits: వర్షాకాలంలో నెయ్యి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
Advertisement

Ghee Benefits: వర్షాకాలంలో చాలా రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం పాలు కావాల్సి ఉంటుంది. అంటువ్యాధులు, చర్మ సమస్యలు తరచూ తలెత్తుతుంటాయి. గాలిలో ఉండే తేమ కారణంగా దురద, మొటిమలు, చర్మంపై దుమ్ము పేరుకుపోవడం వంటి అనేక సమస్యలు వస్తుంటాయి. అయితే వర్షాకాలంలో నెయ్యిని వాడడం వల్ల చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చర్మ సమస్యలకు నెయ్యిని వాడడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నెయ్యిలో ఓమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉండడం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఎండలో అంటే సూర్యరశ్మిలో బయటకు వెళ్లడం లేదా కాలుష్యంలో బయటకు వెళ్లడం వల్ల చర్మం పాడైపోతుంది. అందువల్ల చర్మాన్ని రిపేర్ చేసుకోవడానికి నెయ్యిని చర్మానికి రాసుకోవాలి. అందువల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇలా తరచూ క్రమం తప్పకుండా రెండు చుక్కల నెయ్యిని రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. నెయ్యిని చర్మానికి రాసుకుని మర్దన చేయాలి, కేవలం చర్మానికి మాత్రమే కాకుండా పెదవులకు కూడా రాసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

Advertisement

ముఖంపై కాలుష్యం వల్ల ఏర్పడే మొటిమలు, మచ్చలను తొలగించడానికి నెయ్యి సహాయపడుతుంది. తరచూ రాత్రి పడుకునే ముందు రెండు చుక్కల నెయ్యిని రాసుకోవడం వల్ల కళ్ల కింద నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి. కంటి ఉబ్బరంతో బాధపడేవారికి కూడా నెయ్యి తోడ్పడుతుంది. అంతేకాదు వర్షాకాలంలో కాళ్ల పగుళ్లు, మంటలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల కాళ్లను లేదా పాదాలను సంరక్షించుకోవడానికి నెయ్యిని రాసుకోవాలి.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×