E-Paper
Advertisement

Gongura: గోంగూర తింటే ఈ సమస్యలేవీ రావు, ఆరోగ్యంగా బతకొచ్చు

Gongura: గోంగూర తింటే ఈ సమస్యలేవీ రావు, ఆరోగ్యంగా బతకొచ్చు
Advertisement

తెలుగు ప్రజలకు గోంగూర అంటే ఎంతో ఇష్టం. గోంగూర పచ్చడి, గోంగూర మటన్ కర్రీ, గోంగూర పప్పు వంటి వంటలు చాలా ఫేమస్. గోంగూరలో ఉండే సహజమైన పులుపు రుచికి తోడు, ఇందులో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. గోంగూర ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా కలిగి ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ కొద్దిగా గోంగూరను ఆహారంలో చేర్చుకుంటే శరీరం చురుకుగా ఉంటుంది. పూర్వకాలం నుంచే మన పెద్దలు గోంగూరను ఆరోగ్యానికి మంచిదిగా భావించి ఎక్కువగా తినేందుకు ఇస్టపడేవారు. ఆధునిక కాలంలో కూడా వైద్యులు గోంగూరలోని పోషక విలువలను గుర్తించి దీన్ని మంచి ఆకుకూరగా చెబుతున్నారు.

గోంగూరలో ఉండే పోషకాలు
గోంగూర తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అలాగే కడుపు సంబంధిత ఇబ్బందులు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. గోంగూరలో సహజంగా ఉండే ఆమ్ల గుణం జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో గోంగూర పచ్చడిని అన్నంతో తినడం వల్ల ఆకలి పెరుగుతుందనే వాదన ఉంది. ఇది నిజమేనని పోషక నిపుణులు కూడా చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు కూడా గోంగూరను సరైన మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

Advertisement

Also read: Talking while Eating: తినేటప్పుడు మాట్లాడితే ఆరోగ్యానికి అంత ప్రమాదమా?

అనీమియా పోతుంది
గోంగూర రక్తహీనత ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు, గర్భిణీ స్త్రీలకు గోంగూర అద్బుతమైన ఆహారం. అలాగే గోంగూరలో కాల్షియం ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల నొప్పులు, బలహీనత తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. గోంగూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడంలో దోహదపడతాయి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. కొంతమంది గోంగూరను చర్మ సమస్యలకు కూడా ఉపయోగకరమని అంటున్నారు.

Advertisement

Also read: Black Jeera: నల్ల జీలకర్ర తినడం ఎంత అవసరమో తెలుసా? అసలెప్పుడైనా తిన్నారా?

గోంగూరను మితంగా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు సమస్య ఉన్నవారు కూడా ఉప్పు తక్కువగా వండిన గోంగూర వంటకాలను తీసుకోవచ్చు. అయితే గోంగూరలె పులుపు ఎక్కువగా ఉండటంతో అల్సర్, తీవ్రమైన పొట్ట నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా తినాలి. మోతాదులో తీసుకుంటే గోంగూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొత్తంగా చెప్పాలంటే మన సంప్రదాయ ఆహారంలో భాగమైన గోంగూర ఒక సహజ ఔషధంలాంటిది. ఆరోగ్యం కావాలనుకునే వారు తమ రోజువారీ భోజనంలో గోంగూరను తప్పకుండా చేర్చుకోవాలి.

Related News

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×