E-Paper
Advertisement

Talking while Eating: తినేటప్పుడు మాట్లాడితే ఆరోగ్యానికి అంత ప్రమాదమా?

Talking while Eating: తినేటప్పుడు మాట్లాడితే ఆరోగ్యానికి అంత ప్రమాదమా?
Advertisement

మనిషి జీవించాలంటే భోజనం చాలా ముఖ్యం. చాలా మంది భోజనం చేసేటప్పుడు మాటలు మాట్లాడటం, ఫోన్ చూడటం, టీవీ చూడటం వంటివి చేస్తారు. పూర్వకాలంలో పెద్దలు తినేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలని, ఆహారంపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని చెప్పేవారు. ఇది కేవలం ఆచారం కాదు.. ఆరోగ్యానికి సంబంధించిన మంచి నియమం అని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. తినేటప్పుడు మాట్లాడటం వల్ల ఆహారం సరిగా నమలకుండా లోపలికి వెళ్తుంది. దీంతో జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆధునిక జీవనశైలిలో ఈ చిన్న అలవాటు పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తినేటప్పుడు తింటే వచ్చే సమస్యలు ఇవే
తినేటప్పుడు మాట్లాడటం వల్ల మొదటగా ఆ ప్రభావం పడేది జీర్ణవ్యవస్థపైనే. ఆహారం నోటిలో బాగా నమలకపోతే లాలాజలం సరిగ్గా కలవదు. లాలాజలం ఆహారాన్ని జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అది సరిగ్గా కలవకపోతే కడుపులో జీర్ణక్రియ మందగిస్తుంది. దీని వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం, ఆసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అలాగే మాట్లాడుతూ తినేటప్పుడు ఆహారంతో పాటు ఎక్కువగా గాలి కూడా కడుపులోకి వెళ్తుంది. దీనివల్ల తరచూ త్రేనుపులు రావడం, కడుపు నొప్పి వంటి ఇబ్బందులు కలుగుతాయి. పిల్లలు, వృద్ధులు ఈ సమస్యలకు ఎక్కువగా గురయ్యే అవకాశముంటుందని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Also Read: Black Jeera: నల్ల జీలకర్ర తినడం ఎంత అవసరమో తెలుసా? అసలెప్పుడైనా తిన్నారా?

కొన్నిసార్లు ప్రమాదం కూడా
తినేటప్పుడు మాట్లాడటం కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా మారవచ్చు. ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఊపిరి ఆడకపోవడం, తీవ్రమైన దగ్గు రావడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు తినేటప్పుడు మాట్లాడితే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్లు తొందరగా మాట్లాడుతూ తింటే ఆహారం గొంతులో ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే భోజనం సమయంలో మాట్లాడకుండా ఉండటం చాలా అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ఇది చిన్న అలవాటులా కనిపించినా దీని వల్ల వచ్చే నష్టాలు మాత్రం పెద్దవే.

Advertisement

Also read: Simple Breakfast: ఇన్‌స్టంట్ ఆలూ ఊతప్పం రెసిపీ, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో భోజనం చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఆహారం బాగా నమలడంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరం ఆహారంలోని పోషకాలను సరిగ్గా గ్రహిస్తుంది. అలాగే మనం ఎంత తింటున్నామో తెలుసుకుని అతిగా తినకుండా ఉండగలుగుతాం. ఇది బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. భోజనం సమయంలో మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. నిపుణులు రోజూ భోజనం చేసేటప్పుడు ఫోన్, టీవీ వంటి వాటికి దూరంగా ఉండాలని, నిశ్శబ్దంగా తినాలని సూచిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే… తినేటప్పుడు మాట్లాడకపోవడం ఒక మంచి ఆరోగ్య అలవాటు. ఈ చిన్న మార్పుతోనే పెద్ద ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×