E-Paper
Advertisement

రాత్రి వేళ పుచ్చకాయ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

రాత్రి వేళ పుచ్చకాయ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే
Advertisement

Watermelon Side Effects|  వేసవిలో చాలామంది పుచ్చకాయ (వాటర మెలాన్) చాలా ఇష్టంగా తింటారు. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సహజంగా ఈ పండు తీయంగా ఉంటుంది. దేశంలో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శిల్పా అరోరా ప్రకారం.. ఇందులో 94 శాతం నీరు ఉండడవ వల్ల శరీరానికి త్వరగా హైడ్రేట్ చేస్తుంది. ఇందలో పొటాషియం, లైకోపీన్, ఫైబర్, యాంటిఆక్సిడెంట్లతో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇందులోని ఫైబర జీర్ణక్రియకు చాలా మంచిది. అయితే ఈ పుచ్చకాయలు సరైన సమయానికి తినడం ముఖ్యమని డాక్టర్ శిల్పూ సూచించారు.

ఇటీవల ముంబైకి చెందని ఒక కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు రాత్రి బిర్యాని తిన్నాక పుచ్చకాయ తిన్నారు. ఆ తరువాత వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ నలుగురూ చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా? లేక రాత్రివేళ పుచ్చకాయం తింటే ప్రాణాలకే ప్రమాదమా? అని అందరూ భయపడుతున్నారు. ఈ విషయంపై డాక్టర్ శిల్పా స్పష్టతనిచ్చారు.

రాత్రి పుచ్చకాయ తినవచ్చా?

Advertisement

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి సమయంలో వాటర్‌మెలన్ తినడం హానికరం కాదు. రాత్రి సమయంలో పుచ్చకాయ విషంగా మారుతుందనేందుకు సైంటిఫిక్ ఆధారాలు లేవు. అయితే, రాత్రి ఆలస్యంగా పెద్ద మోతాదులో తినడం వల్ల కొంత అసౌకర్యం కలగవచ్చు. దీనికి కారణం రాత్రి సమయంలో శరీరం ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తుంది.

జీర్ణ సమస్యలు ఎందుకు వస్తాయి?

వాటర్‌మెలన్‌లో సహజ చక్కెరలు, ఎక్కువ నీరు ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తిన్నప్పుడు ప్రేగుల్లో గ్యాస్, వాపు సమస్య, తరచూ మూత్రం వెళ్లడం వంటి సమస్యలు రావచ్చు. కొంతమందికి కడుపు అసౌకర్యం కూడా కలుగుతుంది. ముఖ్యంగా పెద్ద ముక్కలు తిన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి.

నిద్రపై ప్రభావం

Advertisement

నిద్రపోయే ముందు వాటర్‌మెలన్ తినడం వల్ల నిద్రకు అంతరాయం కలగవచ్చు. తరచూ బాత్‌రూమ్ వెళ్లాల్సి రావడం వల్ల నిద్ర చెడిపోతుంది. రాత్రి భారీగా తినడం జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుంది.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి పుచ్చకాయ తినకుండా ఉండటం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు మోతాదు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే దీనిలో సహజ చక్కెరలు ఉంటాయి, రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేయవచ్చు.

పుచ్చకాయ తినడానికి సరైన సమయం

నిపుణులు పగటి పూట లేదా సాయంత్రం ముందు తినడం మంచిదని సూచిస్తున్నారు. ఈ సమయంలో శరీరం ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకుంటుంది. పోషకాలు బాగా గ్రహించబడతాయి.

పుచ్చకాయతో ఇన్‌ఫెక్షన్

పుచ్చకాయ కోసిన తరువాత ఎక్కువసేపు అలాగే ఉంచినా లేదా మురికిగా ఉన్న కత్తితో కట్ చేసినా అందులో బ్యాక్టీరియా చేరుతుంది. ఇంకా పుచ్చకాయ విక్రయించే కొందరు వ్యాపారులు.. కస్టమర్లను మోసం చేసేందుకు అందులో తియ్యని కెమికల్ షుగర్ ఇంజెక్షన్ చేస్తారు. దీని వల్ల వారు కస్టమర్లకు పుచ్చకాయ ముక్కలు రుచి చూపిస్తారు. అది తియ్యగా అనిపిస్తుంది. ఈ కెమికల్ షుగర్ ఆరోగ్యానికి హాని చేస్తుంది.

పుచ్చకాయ కోసిన చాలాసేపు తరువాత తింటే అందులో సాల్మొనెల్లా, ఈ కొల్లి లాంటి బ్యాక్టీరియా చేరుతుంది. దీని వల్లే తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ జరిగి విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి సమస్యలు వస్తాయి. బ్యాక్టీరియా ఉన్న పుచ్చకాయ తిన్నాక 30 నిమిషా నుంచి 4 గంటలలోపు ఈ సమస్యలు కనిపిస్తాయి. కొన్ని సార్లు సరైన చికిత్సతో ఈ సమస్య పరిష్కరించవచ్చు. కానీ విరేచనాలు తీవ్రంగా శరీరం నీరంతా కోల్పోతుంది. వేసవిలో ఈ సమస్య వస్తే లో బిపి వచ్చి చివరికి ప్రాణాలకే ప్రమాదం.

Also Read: మీ పిల్లాడు గుంపులో తప్పిపోయినా సురక్షితంగా తిరిగి వస్తాడు.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలి

పుచ్చకాయ సురక్షితంగా తినడానికి చిట్కాలు

ఎప్పుడూ తాజా పుచ్చకాయ మాత్రమే తినండి.
ఎక్కువసేపు బయట ఉంచిన కట్ ఫ్రూట్ తినకండి.
శుభ్రత పాటించండి, ముఖ్యంగా వేసవిలో.
చిన్న మోతాదులో అంటే 400 గ్రాముల కంటే తక్కువ తినాలి.

మోతాదు ముఖ్యం

రాత్రి కొద్దిగా తినడం సాధారణంగా సురక్షితమే. ఏ ఫ్రూట్ అయినా అధికంగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×