E-Paper
Advertisement

Egg Kebabs: కోడిగుడ్లతో ఎగ్ కబాబ్స్ ఇలా చేశారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగో

Egg Kebabs: కోడిగుడ్లతో ఎగ్ కబాబ్స్ ఇలా చేశారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగో
Advertisement

చలికాలంలో సాయంత్రమైతే చాలు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు చికెన్, మటన్ తినాలనిపిస్తుంది. ప్రతిరోజూ వాటిని తినడం మంచిది కాదు. కాబట్టి అప్పుడప్పుడు కోడిగుడ్లతో టేస్టీ స్నాక్స్ తింటే ఉత్తమం. ఇంట్లో సులభంగా, తక్కువ సమయంలో స్నాక్ కావాలంటే ఎగ్ కబాబ్స్ ప్రయత్నించండి. సాధారణ గుడ్లతో ఇంట్లోనే దొరికే పదార్థాలతో దీన్ని వండేసుకోవచ్చు. ఎగ్ కబాబ్స్ రెసిపీని ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి.

ఎగ్ కబాబ్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు
గుడ్లు – నాలుగు
శెనగపిండి – రెండు స్పూన్లు
మైదా పిండి – రెండు స్పూన్లు
కార్న్ ఫ్లోర్ – రెండు స్పూన్లు
బియ్యం పిండి – రెండు స్పూన్లు
కారం పొడి – ఒక స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
గరం మసాలా – ఒక స్పూను
పసుపు – చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూను
పెరుగు – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె -వేయించడానికి అవసరమైనంత

Advertisement

Also read: Mixed Fried Rice: మిక్స్‌డ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ.. తక్కువ సమయంలో చైనీస్ స్టైల్ వంటకం

ఎగ్ కబాబ్స్ రెసిపీ
1. ముందుగా గుడ్లను నీటిలో వేసి బాగా ఉడికించాలి. పది నిమిషాల తర్వాత నీటిలోంచి బయటకు తీసి చల్లారనివ్వాలి. ఆపై తొక్క తీసి గుడ్లను మధ్య నుంచి రెండు ముక్కలుగా కోయాలి. పెద్ద గుడ్లు అయితే నాలుగు ముక్కలుగా కోయవచ్చు.
2. ఒక గిన్నెలో శనగపిండి, మైదా పిండి, మొక్కజొన్న పిండి, బియ్యం పిండి వేసుకోవాలి. అందులో కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి బాగా కలపాలి.
3. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు వేసి మళ్లీ కలపాలి. ఇప్పుడు కొద్దిగా నీరు చల్లి మిశ్రమాన్ని కలపాలి.
4. పిండి మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. అందులో కోడిగుడ్డు ముక్కలను వేసి బాగా పట్టేలా కలపాలి.
5. స్టవ్ పై కళాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను కొంచెం తగ్గించాలి.
6. ఇప్పుడు పిండిలోని గుడ్డు ముక్కలను నూనెలో వేసి వేయించుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేయించకూడదు.
7. బంగారు రంగు వచ్చే వరకు నెమ్మదిగా తిప్పుతూ వేయించాలి. అన్ని వైపులా సమానంగా కాల్చితే కబాబ్స్ టేస్టీగా వస్తాయి.
8. వేయించిన కబాబ్స్‌ను టిష్యూ పేపర్ మీద పెట్టాలి. ఇలా చేస్తే అదనపు నూనె పీల్చేస్తుంది.
9. అంతు టేస్టీ ఎగ్ కబాబ్స్ సిద్ధమైనట్టే. కెచప్ తో తింటే రుచి అదిరిపోతుంది.

Advertisement

ఇక్కడ మేము చెప్పిన పద్దతిలో ఎగ్ కబాబ్స్ చేస్తే రుచి అదిరిపోతాయి. ఇంకెందుకాలస్యం కోడిగుడ్డుతో ఈ టేస్టీ స్నాక్ చేసేందుకు సిద్ధమైపోండి.

Related News

సూర్యాస్తమయం చూస్తే నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిద్ర, మూడ్ మెరుగవుతాయా?

స్టైలిష్ లుక్,సూపర్ ఫీచర్లు..బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్!

మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

మలవిసర్జన సమయంలో రక్తం వస్తోందా? అది పైల్స్ అనకుంటే మీరు పొరబడునడినట్లే

చిన్న వయసులోనే పేరు, గుర్తింపు పొందుతారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి అతిత్వరగా విజయాలు సాధిస్తారు

మంచి వ్యక్తుల ఈ అలవాట్లే వారి బలహీనతలు.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?

ఆఫీస్ డెడ్‌లైన్లు, మీటింగ్‌లతో సతమతమవుతున్నారా? స్ట్రెస్ తగ్గేందుకు 5 నిమిషాలు ఇలా చేయండి!

వాడిన టీ బ్యాగ్స్ పారేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే.. వాటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Big Stories

Advertisement
×