E-Paper
Advertisement

Mixed Fried Rice: మిక్స్‌డ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ.. తక్కువ సమయంలో చైనీస్ స్టైల్ వంటకం

Mixed Fried Rice: మిక్స్‌డ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ.. తక్కువ సమయంలో చైనీస్ స్టైల్ వంటకం
Advertisement

మిక్స్‌డ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు. ఇది తింటే ఎవరికైనా నచ్చేస్తుంది. మిగిలిపోయిన అన్నంతో కూడా దీన్ని తయారుచేసుకోవచ్చు. తాజా కూరగాయలతో పాటు సరైన మసాలాలు కలిపి చేసే ఈ రైస్ రెసిపీ అదిరిపతుంది. దీన్ని ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము.

మిక్స్ డ్ ఫ్రైడ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

Advertisement

వండిన బాస్మతి అన్నం – 2 కప్పులు
క్యారెట్ – ఒకటి
పచ్చి బఠాణీలు – అరకప్పు
ఉల్లిపాయ – ఒకటి
అల్లం పేస్ట్ – ఒక టీ స్పూన్
వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ – ఒక స్పూన్
వంటనూనె – రెండు స్పూన్లు
కారం – అర స్పూన్
మిరియాల పొడి – అరస్పూన్
మాగీ మసాలా లేదా ఫ్రైడ్ రైస్ మసాలా – అరస్పూన్
ఉప్పు – తగినంత

Also Read: Bandar Halwa: ఇంట్లోనే బందరు హల్వా చేసేయచ్చు, రెసిపీ ఇదిగో

Advertisement

మిక్స్ డ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ
1. అన్నాన్ని ముందే ఉడికించి పూర్తిగా చల్లార్చాలి. అన్నం ముద్దకాకుండా పొడిపొడిగా వచ్చేలా చేసుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలను వేసి లేతగా మారేవరకు వేయించాలి.
3. తర్వాత అల్లం పేస్ట్, వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి.
4. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, బఠాణీలు వేసి రెండు నుంచి మూడు నిమిషాలు వేయించాలి.
5. ఇప్పుడు మంటను కొంచెం ఎక్కువ చేసి, చల్లార్చిన అన్నాన్ని కళాయిలో వేయాలి. గరిటెతో మెల్లగా కలుపుతూ అన్నం విరిగిపోకుండా చూసుకోవాలి.
6. తర్వాత ఉప్పు, కారం, మిరియాల పొడి, మాగీ మసాలా వేసి మెల్లగా కలపాలి.
7. మసాలాలు అన్నంలో సమానంగా కలిసేలా కలపాలి. అవసరమైతే ఒక చెంచా నూనె పై నుంచి వేసుకోవచ్చు.
8. బాగా కలిపాక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించాలి. ఈ సమయంలో మంట ఎక్కువగా ఉంచాలి. అలా చేస్తే ఫ్రైడ్ రైస్‌కు ప్రత్యేకమైన రుచి వస్తుంది.
9. అంతే టేస్టీ మిక్స్‌డ్ ఫ్రైడ్ రైస్‌ రెడీ అయినట్టే. దీన్ని వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది.

ఈ రైస్ తో పాటూ పక్కన వెజ్ మంచూరియా కాంబినేషన్ తో తింటే అదిరిపోతుంది. ఒక్కసారి ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Also Read: Dum Aloo: ధాబా స్టైల్ దమ్ ఆలూ రెసిపీ, బగారా రైస్ తో తింటే అదిరిపోతుంది

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×