E-Paper
Advertisement

Electric Blankets: చలిలో హీటర్ ఫీల్ ఇచ్చే ఎలక్ట్రిక్ దుప్పట్లు.. కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

Electric Blankets: చలిలో హీటర్ ఫీల్ ఇచ్చే ఎలక్ట్రిక్ దుప్పట్లు.. కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
Advertisement

Electric Blankets: శీతాకాలం మొదలైందంటే బయటికి వెళ్తేనే కాదు.. ఇంట్లోనూ చలి చంపేస్తుంది. ముఖ్యంగా నిద్రపోయే సమయానికి చలి వణుకు పుట్టిస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఎలక్ట్రిక్ దుప్పట్లను కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అంతేకాదు.. ప్రస్తుత టెక్ యుగంలో ఆర్డర్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే దుప్పట్లు ఇంటికి వచ్చేస్తాయి. అయితే ఈ దప్పట్లను కొనేముందు కొన్ని కీలక విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. లేదంటే వాటి వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందట. ఎలక్ట్రిక్ దుప్పట్లు కొనేముందు గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏవో ఇప్పుడు చూసేద్దాం.

పడిపోతున్న ఉష్ణోగ్రతలు:

తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో చలి ప్రభావం తీవ్రంగా మారింది. ఉదయం, రాత్రి వేళల్లో బయటకి రావాలంటే చేతులు, కాళ్లు వణికిపోతున్నాయి. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించడంతో, ఎక్కువ మంది ఇంట్లోనే వెచ్చగా ఉండేందుకు పలు మార్గాలను వెతుక్కుంటున్నారు.

పెరిగిన డిమాండ్:

Advertisement

చలికాలంలో సాధారణంగా హీటర్లు, గీజర్ల వినియోగం ఎక్కువగానే ఉంటుంది. దీనితో పాటు ఇప్పుడు ఎలక్ట్రిక్ దుప్పట్లు కూడా పెద్ద ఎత్తున విక్రయాలు అవుతున్నాయి. ఎందుకంటే ఈ వణికించే చలిలో పడుకునే సరికి తీవ్రమైన వణుకు వచ్చిస్తుంటుంది. దీంతో చాలామంది వెచ్చదనం కోసం ఎలక్ట్రిక్ దుప్పట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఎలక్ట్రిక్ దుప్పట్లకు డిమాండ్ పెరిగిపోయింది.

వీటిని చెక్ చేసుకోండి:

వెచ్చదనాన్ని అందించే ఎలక్ట్రిక్ దుప్పట్లను కొనేముందు కొన్ని విషయాలను తప్పక చెక్ చేయాలి. ముందుగా దానికి BIS లేదా ISI సర్టిఫికేషన్ ఉందా, లేదా చూడండి. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఈ దుప్పటిలో ఉన్నాయో లేదో తెలిసేది దీనివల్లే. అలాగే దుప్పటి లోపల ఉన్న వైరింగ్ క్వాలిటీ, బయట ఉన్న ఫాబ్రిక్ నాణ్యతను చెక్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. లోపలి వైర్ బలహీనంగా ఉంటే వినియోగిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరగవచ్చు.

ఫీచర్ల విషయాల్లోనూ జాగ్రత్త:

Advertisement

టెంపరేచర్ కంట్రోల్, ఆటో షట్‌డౌన్, టైమర్ సెట్టింగ్, మల్టిపుల్ హీట్ లెవల్స్ లాంటి ఫీచర్లు ఉంటే.. ఉపయోగంలో మరింత సేఫ్టీతో పాటు సౌకర్యంగానూ ఉంటుంది. దీంతోపాటు డస్ట్ రిమూవల్ కంట్రోలర్ ఉన్న మోడల్స్ తీసుకుంటే క్లీనింగ్ చేసే అవసరాన్ని తగ్గిస్తుంది. అయితే చలి పెరిగే ఈ కాలంలో ఎలక్ట్రిక్ దుప్పట్లు ఒక మంచి ఆప్షన్ అయినప్పటికీ.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మరచిపోవద్దని చెబుతున్నారు నిపుణులు.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×