Safety Tips Snake at Home| వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్ల పాములు చల్లని ప్రదేశం కోసం వెతుకుతూ ఉంటాయి. అవి తరచుగా ఆహారం, నీరు లేదా ఆశ్రయం కోసం ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. ఇంట్లో పాము వచ్చేస్తే అది చూసి ఎవరైనా భయపడిపోతారు. అయితే ఇలా భయపడడం పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. సరైన జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రాణాలు, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడుకోవచ్చు.
పామును చూసినప్పుడు భయకలిగినా తొందరపాటుతో పరుగులు తీయకండి. సురక్షిత దూరంలో నిలబడి ప్రశాంతంగా ఉండండి. ఆకస్మిక కదలికలు లేదా బిగ్గరగా స్పందించడం మానుకోండి. పాములు సాధారణంగా స్వతహాగా దాడి చేయవు. వాటిని బెదిరిస్తేనే మీదకు వస్తాయి. మనుషులను చూసి సాధారణంగా అవి కూడా త్వరగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఎల్లప్పుడూ సురక్షితమైన దూరం పాటించండి. దాని దగ్గరకు వెళ్ళడానికి లేదా దానిని తాకడానికి ప్రయత్నించకండి.
చాలామంది భయంతో పామును చంపడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. వాటి దగ్గరకు వెళితే పాములు ఆత్మరక్షణ కోసం కాటు వేస్తాయి. శిక్షణ లేకుండా వాటిని నిర్వహించడం చాలా ప్రమాదకరం. పాము విషపూరితమైనదో కాదో చూడగానే ఎవరికీ తెలియదు. కాబట్టి నేరుగా దాన్ని తాకడానికి లేదా పట్టుకోవడం లాంటివి చేయకూడదు.
ఎల్లప్పుడూ పాములు పట్టే నైపుణ్యం ఉన్న వారిని సంప్రదించాలి. వాళ్లకి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలుసు. స్థానిక రెస్క్యూ నంబర్లను ముందుగానే సేవ్ చేసుకోండి. నిపుణులు పామును హాని లేకుండా తొలగించగలరు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో డు-ఇట్-యువర్ సెల్ఫ్ పద్ధతులను ప్రయత్నించకండి.
పాము నుండి అందరూ దూరంగా ఉండేలా చూసుకోండి. పిల్లలు, పెంపుడు జంతువులు తెలియకుండానే పాము దగ్గరకు వెళ్లవచ్చు. ఇలా చేస్తే పాము కాటు వేసే ప్రమాదం ఉంది. అందుకే పిల్లల్ని, పెంపుడు జంతువులను సురక్షితమైన ప్రదేశానికి తరలించండి. పాము మార్గాన్ని నిరోధించవద్దు లేదా దాన్ని ఒక మూల వైపు నెట్టవద్దు. ఇలా చేస్తే పాము బెదిరిపోయి దాడి చేసే ప్రమాదముంది. చిక్కుకున్న పాము దూకుడుగా మారవచ్చు. దానికి సహజంగా దూరంగా వెళ్ళడానికి స్థలాన్ని ఇవ్వండి.
Also Read: చాణక్య నీతి.. అప్పు తీసుకోవడం మీకు అలవాటుగా మారిందా? ఈ దురలవాటుకు అసలు మూలం అదే
పాములు ఆహారం కోసం, వేడి నుంచి ఆశ్రయం కోసం ఇంట్లోకి వస్తాయి. ఎలుకలు, కీటకాలు వాటికి మంచి ఆహారం. మీ పరిసరాలను శుభ్రంగా, చెత్త లేకుండా ఉంచండి. కట్టెలు, చెత్త, దట్టమైన మొక్కలను తొలగించండి. పగుళ్లు, రంధ్రాలు, డ్రైనేజీ తెరిచి ఉంటే.. వాటిని మూసివేయండి. దీనివల్ల పాములు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు. వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి సహజ వాసనలు పాములను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి.