E-Paper
Advertisement

‘వార్ 2’ దెబ్బకి ఎన్టీఆర్ కోసం కథ మార్చేసిన ప్రశాంత్ నీల్?

‘వార్ 2’ దెబ్బకి ఎన్టీఆర్ కోసం కథ మార్చేసిన ప్రశాంత్ నీల్?
Advertisement

NTR Neel : తారక్- నీల్..ఈ ఇద్దరు జత కడుతున్నారని,వీరి కాంబోలో భారీ యాక్షన్ డ్రామా వస్తుందని తెలీగానే మురిసిపోయింది బాక్సాఫీస్. మరో వెయ్యి కోట్ల బొమ్మ ఆన్ ది వే అని. ఇక తారక్ ఫ్యాన్స్ కూడా వార్ 2 లాంటి అట్టర్ ప్లాప్ తర్వాత మాకో సాలిడ్ బ్లాక్ బస్టర్ రాబోతుందని ఆశ పడ్డారు కూడా.కానీ లేటెస్ట్ గా ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న కొన్ని కామెంట్స్ నందమూరి అభిమానులని తెగ టెన్షన్ పెట్టేస్తున్నాయ్.

సినిమా విషయంలో మాత్రం సీన్ రివర్స్

Advertisement

నిజానికి డైరెక్టర్ ఎవరైనా తన సినిమాకథ మీద గనుక కాన్ఫిడెన్స్ ఉంటె మిగతా సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళిపోతాడు.కాని ఈ సినిమా విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయినట్టే కనిపిస్తుంది. అవును..లేటెస్ట్ గా మైత్రీ మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ ఒక ఇంటర్వ్యూలో “ఎన్టీఆర్ ‘వార్ 2’ ఫెయిల్యూర్ తర్వాత మేము కథలో మార్పులు చేశాం’అని ఓపెన్ గానే చెప్పేశాడు. అంటే అంతకు ముందున్న కథ వేరే, వార్ 2 దెబ్బకి సినిమా కథని, మార్చేశారని. సో .. ప్రశాంత్ నీల్ అప్పటికే అనుకున్న కథ మీద నమ్మకం లేకపోవడం వల్లె ఇలా కథలో మార్పులు చేశారని, అసలు వేరే సినిమా రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని కథని మారవడమేంటి అంటూ సోషల్ మీడియాలో డిబేట్లు మొదలెట్టేశారు నెటిజన్లు.

ALSO READ :‘గాయపడ్డ సింహం’.. కామెడీ సర్కస్సా? లేక ప్రేక్షకులకు టార్చరా?

Advertisement

సినిమాని రిస్క్ లో పెట్టేసినట్టే

ఒకసారి గనుక సినిమా హిస్టరీని గనుక అబ్జర్వ్ చేస్తే ముందుగా అనుకున్న కథలని, షూటింగ్ టైమ్ లో మారిస్తే చాలా వరకు ‘డిజాస్టర్లు’ అయిన సందర్భాలు మనకు కనిపిస్తూనే ఉంటాయ్. ఒక పక్క జెట్ స్పీడ్ తో షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుని, మరోపక్క ఇలా స్టోరీలో మార్పులు చేయడం అంటే సినిమాని రిస్క్ లో పెట్టేసినట్టే అన్న టాక్ వినిపిస్తుంది. మరి సినిమాకి మెయిన్ హైలెట్ అవుతుంది అనుకున్న రవి బస్రూర్ మ్యూజిక్ , రుక్మిణి వసంత్ అప్పీరియన్స్ సినిమాను కాపాడతాయా? లేకఈ స్క్రిప్ట్ చేంజెస్ వల్ల సినిమా కిచిడీ అవుతుందా? అంటూ విశ్లేషిస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

 గ్లింప్స్ పైనే ఇప్పుడు అందరి చూపు 

ఇక ఈ సినిమాని వచ్చే ఏడు జూన్ 11న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే. ఏదేమైనా వచ్చే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ కానున్న ఫస్ట్ గ్లింప్స్ పైనే ఇప్పుడు అందరి చూపుంది,అందులో గనుక నీల్ మార్క్ ఉంటె సరేసరి.లేదంటే మాత్రం ఇపుడు వినిపిస్తున్న నెగెటివ్ టాక్ సినిమాని మరింత కిందకి నెట్టేసే ప్రమాదం ఉంది. చూడాలి చక్కర్లు కొడుతున్న ఈ గాసిప్స్ పై ఎలాంటి అప్ డేట్ వినిపిస్తుందో !

ALSO READ :అత్తాకోడళ్ల మధ్య ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×