E-Paper
Advertisement

Money Plant: చలికాలంలో మనీప్లాంట్ పచ్చగా ఎదగాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి

Money Plant: చలికాలంలో మనీప్లాంట్ పచ్చగా ఎదగాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి
Advertisement

చలికాలం మొదలైందంటే ఇంట్లో పెంచే మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా మనీ ప్లాంట్‌ను కాపాడుకోవాలి. శీతాకాలంలో గాలి పొడిగా మారడం, ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్ల మనీ ప్లాంట్‌ ఆకులు పసుపు రంగులోకి మారడం, ఎండిపోవడం లేదా పెరుగుదల నెమ్మదించడం వంటివి జరుగుతాయి. కానీ కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో కూడా ఈ మొక్క పచ్చగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇందుకోసం గార్డెనింగ్ నిపుణులు సూచించిన ముఖ్యమైన చిట్కాలు కొన్ని ఉన్నాయి.

సూర్యకాంతి పడే చోట
శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. మనీ ప్లాంట్‌కు ఎక్కువ సన్‌లైట్ అవసరం లేకపోయినా, కొంత కాంతి కావాలి. అందుకే ఉదయం సూర్యకాంతి వచ్చే కిటికీ దగ్గర మొక్కను ఉంచితే మంచిది. పూర్తిగా చీకటిగా ఉండే గదిలో ఉంచితే ఆకులు పసుపు రంగులోకి మారే అవకాశం ఉంది. చల్లని గాలి నేరుగా పడితే మనీ ప్లాంట్ ఆకులు వాడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఓపెన్ విండోలు, ఏసీ గాలి నేరుగా వచ్చే ప్రదేశాలు, చల్లని గదులకు ఈ మొక్కను దూరంగా ఉంచాలి. చలికాలంలో మట్టి తేమను ఎక్కువ రోజులు పట్టుకుని ఉంటుంది. అందువల్ల ఈ సీజన్‌లో మొక్కకు నీరు తక్కువగా ఇవ్వాలి. మట్టిని చేత్తో తాకి పై పొర పూర్తిగా ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు పోయాలి. నీరు ఎక్కువగా పెడితే వేర్లు పాడైపోయే ప్రమాదం ఉంది. వారానికి ఒకసారి నీరు పోస్తే చాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

శీతాకాలంలో గాలి చాలా పొడిగా మారుతుంది. దీనివల్ల మనీ ప్లాంట్ ఆకులు వాడిపోతూ ఉంటాయి.దీనిని నివారించడానికి మొక్కపై కొద్దిగా నీటిని స్ప్రే చేయడం మంచిది. మొక్క దగ్గర నీరుతో నింపిన చిన్న బౌల్ ఉంచినా కూడా హ్యూమిడిటీ పెరిగి మొక్క తాజాగా ఉంటుంది. మనీ ప్లాంట్ ఏ నేలలోనైనా పెరుగుతుందని చెబుతారు. కానీ శీతాకాలంలో నీరు ఎక్కువసేపు నిల్వ ఉండే నేల మొక్కకు ప్రమాదం. అందుకే నీరు సులభంగా వెళ్లిపోగలిగే కుండీలు ఉపయోగించాలి. మట్టిలో పెర్‌లైట్, కోకోపీట్ లాంటివి ఉంటే డ్రైనేజ్ మెరుగ్గా ఉంటుంది. చలికాలం మొక్కలు ఎక్కువగా పెరిగే కాలం కాదు. పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. ఈ సమయంలో ఫెర్టిలైజర్ ఎక్కువగా వేస్తే వేర్లకి ఇబ్బంది కలుగుతుంది. అందుకే శీతాకాలంలో ఫెర్టిలైజర్‌ను దాదాపు నిలిపివేయాలి. వేసవి, వసంతంలో మాత్రమే వీటిని ఉపయోగిస్తే సరిపోతుంది.

చలికాలంలో ఆకులు పసుపు రంగులోకి మారడం సహజమే. కానీ ఆ ఆకులను చెట్టుపై వదిలేస్తే మొక్క శక్తి వృథా అవుతుంది. అందుకే వాటిని జాగ్రత్తగా కత్తిరించి తీసేయాలి. ప్రూనింగ్ చేస్తే కొత్త పచ్చని ఆకులు త్వరగా వస్తాయి. మనీ ప్లాంట్‌ను నేరుగా హీటర్ దగ్గర ఉంచకూడదు. అది ఆకులను ఎండిపోయేలా చేస్తుంది. అయితే గది ఉష్ణోగ్రత సహజంగా కొద్దిగా వేడిగా ఉండే ప్రాంతం ఉత్తమం. వంటగది దగ్గర, హాలులో లైట్ వచ్చే మూలలో పెట్టితే చలిని తట్టుకుని బాగా పెరుగుతుంది. ప్లాంట్‌ను చిన్న ప్లాస్టిక్ కుండీల్లో పెంచితే చలిని ఎక్కువగా గ్రహిస్తుంది. కాబట్టి సెరామిక్ లేదా మట్టి కుండీలు మంచివి. ఇవి ఉష్ణోగ్రతను అడ్డుకోవడంలో సహాయపడతాయి.
చలికాలంలో మనీ ప్లాంట్‌కు నీరు తగ్గించడం, చల్లని గాలికి దూరంగా ఉంచడం, తగినంత వెలుతురు ఇవ్వడం.. ఇవే మొక్కను పచ్చగా ఉంచే ప్రధాన చిట్కాలు.

Related News

మిల్లీనియల్స్ పురుషులను ఇష్టపడుతున్న జెన్ Z అమ్మాయిలు.. కారణాలు ఇవే

30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారా? ఈ 5 విషయాలు ముందే చర్చించకపోతే జీవితాంతం పశ్చాత్తాపమే!

45 రోజుల పాటు రోజుకో అరటిపండు తింటే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

32 కేజీల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆ 5 ఆహారాలను దూరం పెట్టడం వల్లే అంటూ సీక్రెట్ రివీల్!

నెల చివరికి జేబు ఖాళీ.. జీతం సరిపోవడం లేదా? ఈ స్మార్ట్ ఫైనాన్సియల్ టిప్స్ మీ కోసమే

బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

పచ్చి పాలు తాగడం వల్ల యువకుడికి గుండె సమస్య.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

ప్రేమ అంటే రక్తంతో లవ్ లెటర్స్ రాయడం కాదు.. ఒక్కడే కొండను చీల్చిన ప్రేమికుడు

Big Stories

Advertisement
×