E-Paper
Advertisement

Weather Updates: ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. జర్రంతా జాగ్రత్త..!

Weather Updates: ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. తెలంగాణలో పెరుగుతున్న చలి..  జర్రంతా జాగ్రత్త..!
Advertisement

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఒక వైపు వర్షాలు.. మరోవైపు చలి ప్రజలను వణికిస్తోంది. ఏపీకి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడి పోతుండటంతో చలి తీవ్రంగా పెరుగుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఏపీకి పొంచి ఉన్న తుఫాన్‌ ముప్పు..
ఏపీకి వానగండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో అండమాన్‌ సమీపంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

Advertisement

అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. గురువారం రాత్రి నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. అల్లూరి జిల్లాలో 13 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. తుపాను తీవ్రత తగ్గే వరకు చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణను వణికిస్తున్న చలి..
రాష్ట్ర వ్యాప్తంగా చలి వణికిస్తోంది. ఉదయం, సాయంత్రం బయటకు రావాలంటే చలికి జనాలు వణికిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కోల్డ్ వేవ్స్ తీవ్రంగా పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉన్నట్లు.. వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్ చెబుతున్నారు. పొగమంచు దట్టంగా కమ్ముకుని ఉండటంతో.. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement

Also Read: ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

తెలంగాణలో సింగిల్ డిజిట్‌కి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అలాగే. ఆదిలాబాద్, కరీంనగర్, కుమురంభీం, ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్‌, జగిత్యాల, మెదక్‌, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో చలి తీవ్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కావున ఉదయం పొలం పనులకు వెళ్లే రైతులు.. విధులకు వెళ్లే ఉద్యోగులు, విద్యాలయాలకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులు, మిగతా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×