E-Paper
Advertisement

Health Tips: ఖాళీ కడుపుతో.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Health Tips: ఖాళీ కడుపుతో.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !
Advertisement

Health Tips: ఉదయం ఖాళీ కడుపుతో మనం తీసుకునే ఆహారం లేదా డ్రింక్స్ రోజు మొత్తంలో మన జీర్ణవ్యవస్థ పనితీరును, శక్తి స్థాయిలను, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. కొన్ని ఆహారాలు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ.. వాటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అసిడిటీ, పేగులో మంట లేదా ఇతర జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మెరుగైన ఆరోగ్యం కోసం.. ఉదయం పూట ఖాళీ కడుపుతో మీరు తప్పనిసరిగా నివారించాల్సిన ఆహార పదార్థాలు డ్రింక్స్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. ఆమ్ల గుణాలు అధికంగా ఉండే పదార్థాలు:

సిట్రస్ పండ్లు (నిమ్మ, నారింజ, ద్రాక్ష): ఈ పండ్లు విటమిన్ సి అధికంగా కలిగి ఉన్నప్పటికీ.. వీటిలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే.. అది కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల గుండెల్లో మంట , కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Advertisement

టమాటోలు: టమాటోలలో టానిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే.. ఇది జీర్ణాశయంలోని ఆమ్లాలతో చర్య జరిపి, గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చే అవకాశం ఉన్న వారికి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.కాఫీ, టీ: ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థ లైనింగ్‌ను దెబ్బతీస్తుంది. ఆమ్లత్వం ,గుండెల్లో మంటకు దారి తీస్తుంది.

2. ప్రాసెస్ చేసిన, మసాలాలు అధికంగా ఉన్న ఆహారాలు:

మసాలా ఆహారాలు: ఖాళీ కడుపుతో మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వంటి మసాలాలు అధికంగా ఉన్న ఆహారాలను తినడం వల్ల కడుపు లైనింగ్ దెబ్బతింటుంది. ఇది తీవ్రమైన కడుపు మంట, నొప్పి, తిమ్మిరిని కలిగిస్తుంది.

ఈస్ట్ ఉన్న బేక్డ్ ఫుడ్స్ (కేకులు, పేస్ట్రీలు): ఈస్ట్ కలిగి ఉన్న ఆహార పదార్థాలు కడుపులో గ్యాస్ ఉత్పత్తికి దారితీసి, ఉబ్బరం, అసౌకర్యాన్ని పెంచుతాయి.

చక్కెర డ్రింక్స్, స్వీట్లు: ఖాళీ కడుపుతో అధిక చక్కెర ఉన్న డ్రింక్స్ (సోడాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు) లేదా స్వీట్లు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది క్లోమ గ్రంధిపై అధిక భారాన్ని మోపుతుంది. దీర్ఘకాలంలో ఇది మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

3. కొన్ని రకాల కూరగాయలు, పచ్చి కూరగాయల సలాడ్‌లు:

పచ్చి కూరగాయల సలాడ్‌లు (ముఖ్యంగా ఆకుకూరలు): పచ్చి కూరగాయలలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల జీర్ణం చేయడానికి కష్టమై, కడుపు ఉబ్బరం లేదా నొప్పి వచ్చే అవకాశం ఉంది. వండిన కూరగాయలను తీసుకోవడం సులభం.

Also Read: హార్మోన్ల అసమతుల్యత, ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

4. కూల్ డ్రింక్స్, పాలు:

కూల్ డ్రింక్స్ (ఐస్ వాటర్): ఖాళీ కడుపుతో అతి చల్లని డ్రింక్స్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ లైనింగ్‌కు రక్త సరఫరా తగ్గుతుంది. ఇది జీర్ణ క్రియను ఆలస్యం చేస్తుంది. ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్న నీరు లేదా గోరు వెచ్చని నీరు ఉత్తమం.

పాలు, పాల ఉత్పత్తులు: కొందరికి ఖాళీ కడుపుతో పాలు తాగితే జీర్ణం కావడం కష్టమవుతుంది. ముఖ్యంగా లాక్టోస్ పడని వారికి విరేచనాలు లేదా అజీర్ణం సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు:

ఖాళీ కడుపుతో తేలికగా జీర్ణమయ్యే, కడుపును ప్రశాంతంగా ఉంచే ఆహారాలను ఎంచుకోవడం మంచిది. వీటిలో గోరు వెచ్చని నీరు, తేనెతో కూడిన గోరు వెచ్చని నీరు, నానబెట్టిన బాదం, ఓట్స్ వంటివి ఉత్తమమైన ఎంపికలు.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×