E-Paper
Advertisement

Pancreatic Cancer: మిలియన్ల మందిని బలితీసుకుంటున్న వ్యాధి.. కాళ్లలో కనిపించే ఈ లక్షణాలే మొదటి వార్నింగ్!

Pancreatic Cancer: మిలియన్ల మందిని బలితీసుకుంటున్న వ్యాధి.. కాళ్లలో కనిపించే ఈ లక్షణాలే మొదటి వార్నింగ్!

Pancreatic Cancer: ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న భయంకరమైన వ్యాధులలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒకటి. దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ముదిరే వరకు ఎటువంటి స్పష్టమైన లక్షణాలను చూపించదు. అయితే.. ఇటీవలి వైద్య పరిశోధనల ప్రకారం, మన కాళ్లలో కనిపించే కొన్ని మార్పులు ఈ ప్రాణాంతక క్యాన్సర్‌కు ముందస్తు హెచ్చరిక సంకేతాలు కావచ్చు. కాళ్లలో కనిపించే ఆ నాలుగు ముఖ్యమైన లక్షణాలు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు వాటికి ఉన్న సంబంధం గురించి వివరంగా తెలుసుకుందాం.

కాళ్లలో కనిపించే 4 ప్రధాన హెచ్చరికలు:

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రక్తంలో మార్పులను కలిగిస్తుంది. ఇది కాళ్లలో వివిధ సమస్యలకు దారితీస్తుంది. అవేంటంటే..

1. కాళ్లలో వాపు:
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్న రోగులలో కాళ్లలో వాపు రావడం సర్వసాధారణం. దీనిని వైద్య పరిభాషలో ఎడెమా అని పిలుస్తారు. ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయనప్పుడు శరీరంలో ద్రవాలు పేరుకుపోతాయి. ముఖ్యంగా పాదాలు, చీలమండల వద్ద వాపు కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఎటువంటి దెబ్బ తగలకుండానే కాళ్లు వాపు వస్తుంటే అది ప్రమాద సంకేతం కావచ్చు.

2. కాళ్ల నొప్పులు, ఎరుపు రంగులోకి మారడం:

కాళ్లలో విపరీతమైన నొప్పి రావడం, కండరాలు పట్టినట్లు ఉండటం లేదా కాలు ఎర్రగా కందిపోవడం వంటివి జరిగితే అది డీప్ వీన్ థ్రాంబోసిస్ కు సంకేతం కావచ్చు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రక్తము గడ్డకట్టే గుణాన్ని పెంచుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల కాలు భాగంలో వాపు, నొప్పి , వేడి పుట్టినట్లు అనిపిస్తుంది.

3. చర్మంపై దద్దుర్లు లేదా దురద:
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వల్ల కాలేయం ప్రభావితమైనప్పుడు, శరీరంలో బిలిరుబిన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల కామెర్లు వస్తాయి. దీని మొదటి లక్షణం చర్మం పసుపు రంగులోకి మారడం మాత్రమే కాదు, కాళ్లపై తీవ్రమైన దురద రావడం లేదా ఎర్రటి దద్దుర్లు కనిపించడం కూడా జరగవచ్చు.

4. కాళ్లలో తిమ్మిర్లు, బలహీనత:

శరీరంలో పోషకాల లోపం ఏర్పడటం వల్ల లేదా క్యాన్సర్ కణాలు నరాలపై ఒత్తిడి తీసుకురావడం వల్ల కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. నడవడానికి ఇబ్బంది పడటం, కాళ్లలో సత్తువ లేనట్లు అనిపించడం వంటివి ప్యాంక్రియాటిక్ సమస్యలను సూచిస్తాయి.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎందుకు ప్రమాదకరం?

ప్యాంక్రియాస్ మన శరీరంలో జీర్ణక్రియకు మరియు చక్కెర స్థాయిలను నియంత్రించడానికి చాలా కీలకం. ఈ క్యాన్సర్ ఇతర అవయవాలకు వేగంగా వ్యాపిస్తుంది.

గమనించాల్సిన ఇతర సాధారణ లక్షణాలు:

కడుపు నొప్పి లేదా వెన్ను నొప్పి.

ఆకస్మికంగా బరువు తగ్గడం.

ఆకలి మందగించడం.

యూరిన్ ముదురు రంగులో రావడం.

Also Read: మధుమేహానికి చెక్ పెట్టే ’10 నిమిషాల పోస్ట్ మీల్ వాక్’

జాగ్రత్తలు, రోగ నిర్ధారణ:

పైన పేర్కొన్న లక్షణాలు కనిపించిన వెంటనే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఇతర చిన్న సమస్యల వల్ల కూడా రావచ్చు. కానీ, ఈ లక్షణాలు ఒకటి లేదా రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే వెంటనే డాక్టరును సంప్రదించాలి.

వైద్య పరీక్షలు: అల్ట్రాసౌండ్, CT స్కాన్ లేదా MRI ద్వారా ప్యాంక్రియాస్ ఆరోగ్యాన్ని చెక్ చేయవచ్చు.

జీవనశైలి మార్పులు: ధూమపానం మానేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చు.

Tags

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×