E-Paper
Advertisement

Acne: మొటిమలు తగ్గాలంటే వేపాకులు, ఉసిరిని ఇలా వాడేయండి

Acne: మొటిమలు తగ్గాలంటే వేపాకులు, ఉసిరిని ఇలా వాడేయండి
Advertisement

ఎక్కువగా కనిపించే చర్మ సమస్య మొటిమలు. జంక్ ఫుడ్ అధికంగా తినడం వల్ల, ఒత్తిడి వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖంపై మొటిమలు ఎక్కువ వచ్చేస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు ఎంతో మంది మందులు వాడతారు. కానీ ఆ మందులు వల్ల సైడ్ ఎఫెక్టులు కూడా రావచ్చు. ఆయుర్వేదంలో చాలా సింపుల్ పరిష్కారాలతో మీరు మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం వేపాకు, ఉసిరి, కలబంద, తులసి వంటి ఔషధ మొక్కలను వాడాలి.

ఉసిరి
మొటిమల సమస్యను తగ్గించడానికి ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే రక్తం పరిశుభ్రంగా ఉంటుందో చర్మంపై మొటిమలు తగ్గుతాయి. అలాగే ఉసిరి చర్మానికి సహజ కాంతిని కూడా ఇస్తుంది. ఉసిరిని ఆహారంలో భాగం చేసుకోండి లేదా జ్యూస్ రూపంలో తాగండి. కొన్ని రోజుల్లోనే మొటిమలు తగ్గిపోతాయి.

Advertisement

వేప
వేపలో కూడా మొటిమలను అడ్డుకునే సత్తా ఉంది. వేపకు యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను ఇవి నశించేలా చేస్తాయి. వేప ఆకులను పేస్ట్ చేసి మొటిమలు వస్తున్న చోట ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మంలోని అదనపు నూనెను పీల్చేసుకుంటుంది. దీంతో రంధ్రాలు మూసుకుపోకుండా తెరుచుకుంటాయి. దీనివల్ల మొటిమలు రావడం చాలా వరకు తగ్గుతాయి.

Also read: Viral News: పెళ్లి చేసుకుంటే రూ.12 లక్షలు, పిల్లలు పుడితే రెట్టింపు.. ఉద్యోగులకు కంపెనీ ఆఫర్

Advertisement

కలబంద
ప్రతి ఇంట్లోనూ కలబంద మొక్క ఉంటుంది. ఇందులో జెల్ లాంటి పదార్థం ఉంటుంది. దీన్ని చర్మంపై రాయడం వల్ల అక్కడ మంట, ఎర్రదనం వంటివి తగ్గిపోతాయి. మొటిమల వల్ల కలిగే నొప్పి కూడా తగ్గుతుంది. కలబందలో ఉండే గుణాలు చర్మానికి అందిస్తాయి. సమస్యతో బాధపడేవారు తరచూ కలబంద జెల్ ను ముఖానికి రాసుకుంటే ఎంతో మంచిది. మొటిమలు, మచ్చలు వంటివి తగ్గుతాయి. సున్నితమైన చర్మం ఉన్నవారు కూడా కలబందను వాడవచ్చు.

తులసి
తులసిలో ఉన్న యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మంపై ఏర్పడే మొటిమలను తగ్గిస్తాయి. తులసి ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాయండి. ఆ తర్వాత నీటితో పరిశుభ్రంగా కడుక్కోండి. మొటిమలు బయటకు కనిపించే సమస్య మాత్రమే కాదు. అంతర్గత ఆరోగ్య సమస్యకు కూడా సంకేతంగా చెప్పుకుంటారు. అందుకే ఈ ఔషధ మొక్కను వాడితే మొటిమలు వచ్చే అవకాశం లోపల నుంచి తగ్గుతుంది. సరైన ఆహారం, తగిన నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి మొటిమలు రాకుండా అడ్డుకునేందుకు సహాయపడతాయి.

Also read: Carrot Bobbatlu: క్యారెట్ హల్వా స్టఫ్ చేసిన బొబ్బట్లు రెసిపీ.. చూస్తేనే నోరూరిపోతుంది

Related News

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

Big Stories

Advertisement
×