E-Paper
Advertisement

Carrot Bobbatlu: క్యారెట్ హల్వా స్టఫ్ చేసిన బొబ్బట్లు రెసిపీ.. చూస్తేనే నోరూరిపోతుంది

Carrot Bobbatlu: క్యారెట్ హల్వా స్టఫ్ చేసిన బొబ్బట్లు రెసిపీ..  చూస్తేనే నోరూరిపోతుంది
Advertisement

పండుగలు, శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో ఇంట్లో బొబ్బట్లు చేసుకుంటూ ఉంటారు. తెలుగువారికి బొబ్బట్లు అంటే ఎంతో ఇష్టం. వాటి ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా ప్రయత్నిస్తే ఎంతో రుచిగా ఉంటాయి. సాధారణంగా శెనగపప్పు, బెల్లంతో చేసే బొబ్బట్లకు కొంచెం కొత్త రుచి ఇవ్వాలంటే క్యారెట్ హల్వా స్టఫ్డ్ బొబ్బట్లు తప్పకుండా ట్రై చేయాలి. క్యారెట్ హల్వా తీపి, బొబ్బట్టులోని మృదుత్వం కలిసిన ఈ స్వీట్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బాగా నచ్చుతుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

క్యారెట్ హల్వా బొబ్బట్లు రెసిపీకి కావలసిన పదార్థాలు
మైదా – ఒక కప్పు
గోధుమ పిండి – ఒక కప్పు
ఉప్పు – చిటికెడు
నెయ్యి – 5 టేబుల్ స్పూన్లు
కుంకుమపువ్వు – కొద్దిగా
పాలు – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
నీరు – అవసరానికి సరిపడా
క్యారెట్ల తురుము – 2 కప్పులు
పాలు – 1 కప్పు
పంచదార – 1 కప్పు
కండెన్స్‌డ్ మిల్క్ – 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి – ½ టీస్పూన్
కుంకుమపువ్వు – కొద్దిగా

Advertisement

Also read: Simple Breakfast: ఇన్‌స్టంట్ ఆలూ ఊతప్పం రెసిపీ, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

క్యారెట్ హల్వా బొబ్బట్లు రెసిపీ
1. ముందుగా ఒక గిన్నెలో మైదా, గోధుమ పిండి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో నెయ్యి వేసి చేతులతో కలిపితే పిండి ముద్దలా అవుతుంది.
2. ఇప్పుడు కుంకుమపువ్వును గోరువెచ్చని పాలలో నానబెట్టి ఆ పాలను పిండిలో వేసి కలపాలి.
3. అవసరమైనంత నీరు కలుపుతూ మృదువుగా ఉండేలా పిండి కలపాలి. పిండి బాగా కలిపిన తర్వాత గిన్నెపై తడి క్లాత్ వేసి కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టాలి.
4. స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టి నెయ్యి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత తురిమిన క్యారెట్లు వేసి వేయించాలి.
5. క్యారెట్‌లో ఉన్న పచ్చి వాసన పోయిన తర్వాత పాలు పోసి మూత పెట్టి ఉడికించాలి. క్యారెట్లు మెత్తబడిన తర్వాత పంచదార వేసి బాగా కలపాలి.
6. పంచదార కరిగి మిశ్రమం కొంచెం నీరుగా మారుతుంది. ఇప్పుడు కండెన్స్‌డ్ మిల్క్, కుంకుమపువ్వు వేసి కలపాలి.
7. చివరగా యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. దాన్ని చల్లారనివ్వాలి.
8. ఇప్పుడు బొబ్బట్ల పిండిని వేసి చిన్న ఉండలుగా చేసుకుని ఒత్తుకోవాలి.
9. మధ్యలో క్యారెట్ హల్వా కొంచెం వేసి దాన్ని మడగపెట్టి తిరిగి బొబ్బట్టులాగా ఒత్తుకోవాలి.
10. స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయాలి. ఒత్తిన బొబ్బట్టు వేసి రెండు వైపులా కాల్చాలి. అవసరమైతే కొద్దిగా నెయ్యి రాసుకోవచ్చు. అంతే టేస్టీ బొబ్బట్లు సిద్ధమైనట్టే.

Advertisement

Also read: Train: రైలు చివరి బోగీపై X గుర్తు ఎందుకు ఉంటుంది? దీని వెనుక అర్థమేంటి?

ఈ క్యారెట్ హల్వా స్టఫ్డ్ బొబ్బట్లు వేడిగా ఉన్నప్పుడే పైగా కొద్దిగా నెయ్యి వేసి తింటే చాలా రుచిగా ఉంటాయి. పండుగల్లో ఈ స్వీట్ చేస్తే అదిరిపోతుంది.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×