E-Paper
Advertisement

Viral News: పెళ్లి చేసుకుంటే రూ.12 లక్షలు, పిల్లలు పుడితే రెట్టింపు.. ఉద్యోగులకు కంపెనీ ఆఫర్

Viral News: పెళ్లి చేసుకుంటే రూ.12 లక్షలు, పిల్లలు పుడితే రెట్టింపు.. ఉద్యోగులకు కంపెనీ ఆఫర్
Advertisement

పెళ్లి చేసుకుంటే వారం సెలవు ఇవ్వడానికే ఎన్నో కంపెనీలు తెగ బాధ పడిపోతాయి. అలాంటిది ఒక కంపెనీ మాత్రం తన సంస్థలో పనిచేసే ఉద్యోగులు పెళ్లి చేసుకున్నా లేక పిల్లల్ని కన్నా ఏకంగా లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. దుబాయ్ కి చెందిన ప్రముఖ బిలినియర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఆ వ్యక్తి పేరు ఖలఫ్ అహ్మద్ అల్ హబ్తూర్. ఆయన దుబాయ్ లోని ప్రముఖ వ్యాపార సంస్థ అల్ హబ్తూర్ గ్రూప్ చైర్మన్. ఈయన ఉద్యోగుల సంక్షేమాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన తన సంస్థలో పనిచేసే యువత పెళ్లి చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించేందుకు అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు.

పెళ్లి చేసుకుంటే
యువత ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆర్థిక భారమేనని అర్థం చేసుకున్నాడు. అందుకే తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు, అందులోనూ దుబాయ్ పౌరులకు ఈ ఏడాది పెళ్లి చేసుకుంటే 50 వేల దిర్హామ్ లు బహుమతిగా అందించబోతున్నాడు. అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు 12 లక్షల రూపాయలు. ఈ డబ్బు వారి పెళ్లి ఖర్చులకు, కొత్త జీవితం ప్రారంభించేందుకు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయం.

Advertisement

Also read: Coriander Pongali: కొత్తిమీర పొంగలి ఎప్పుడైనా తిన్నారా? రుచి అదిరిపోద్ది.. ఇదిగో రెసిపీ

పిల్లలు పుడితే
ఇక పెళ్లి చేసుకున్న తర్వాత రెండేళ్లలోపే ఆ దంపతులకు పిల్లల పుడితే ఆ ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేసి అందిస్తానని ఆయన ప్రకటించాడు. పెళ్లి తర్వాత కుటుంబం విస్తరించాల్సిన అవసరం ఉందని, అందుకు తగ్గ ప్రోత్సాహాన్ని అందించడం ముఖ్యమని ఆయన గుర్తించాడు. ఉద్యోగుల్లో కుటుంబ విలువలను పెంచడానికి ఆయన ఈ పని చేస్తున్నట్టు చెప్పాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించాడు. యువత పెళ్లి, కుటుంబ జీవితం వైపు ఆసక్తి చూపేలా చేయడమే తను ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నాడు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటేనే సమాజం కూడా బలంగా ఉంటుందన్నది ఆయన అభిప్రాయం.

Advertisement

ఉద్యోగుల జీవితాలు బాగుండాలంటే వారు పనిచేసే సంస్థలు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కేవలం ఉద్యోగం, జీతం మాత్రమే కాకుండా వారి వ్యక్తిగత జీవితం కూడా సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి కొత్త పథకాలు పెట్టడం వల్ల ఉద్యోగులలో మానసిక స్థిరత్వం పెరగడమే కాకుండా సంస్థ పైన నమ్మకం, గౌరవం మరింత పెరుగుతాయన్నది ఆయన అభిప్రాయం. ఇప్పుడు ఈయన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతోమంది ఆ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఇలాంటి నిర్ణయాలు ఇతర కంపెనీలు కూడా తీసుకోవాలని ఎంతోమంది అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలోచించే యజమానులు చాలా తక్కువ మంది ఉంటారని కొంతమంది కామెంట్లు చేశారు.

Also read: Green peas Pulao: ఈ సీజన్లో దొరికే గ్రీన్ పీస్‌తో టేస్టీ పులావ్ రెసిపీ ఇదిగో

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×