E-Paper
Advertisement

ముఖంపై మృతకణాలు తొలగించడానికి ఇంట్లోనే సూపర్ ఫేస్ ప్యాక్.. నిగనిగలాడే చర్మం మీ సొంతం

ముఖంపై మృతకణాలు తొలగించడానికి ఇంట్లోనే సూపర్ ఫేస్ ప్యాక్.. నిగనిగలాడే చర్మం మీ సొంతం
Advertisement

Dead Skins Removal Face Pack| చాలా మంది తమ అందాన్ని మెరుగుపరచడానికి మేకప్ చేసుకుంటారు. కానీ మేకప్ దెబ్బతిన్న ముఖ చర్మాన్ని పూర్తిగా దాచలేదు. ముఖంపై ఉన్న చర్మ కణాలు (డెడ్ స్కిన్ సెల్స్) ముఖాన్ని నిస్తేజంగా చేస్తాయి. ఈ కణాలు చర్మం మీద ఒక రఫ్ లేయర్‌గా పేరుకుపోతాయి. వీటి వల్ల చర్మం సహజమైన మెరుగును కోల్పోయి, అసమానంగా కనిపిస్తుంది.

ముఖం పొడిగా, పొలుసులుగా, కొన్నిసార్లు పేలవంగా కనిపిస్తుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం.. భారీ క్రీములు వినియోగించకడం కాదు, చర్మంపై ఉన్న మృత కణాలు తొలగించడం. దీని కోసం సహజమైన నివారణ చర్యలు తీసుకుంటే చర్మ కాంతి తిరిగి వస్తుంది. టొమాటో చర్మ సంరక్షణకు చాలా ప్రభావవంతమైన పదార్థం. అందుకే టొమాటోతో పాటు చర్మానికి మేలు చేసే ఇతర పదార్థాలు కలిపి ఫేస్ ప్యాక్ చేసుకుంటే మంచిది.

టొమాటో చర్మానికి ఎందుకు మంచిది?

Advertisement

టొమాటోలో సహజమైన ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేసి, మురికి, నూనె, మృత కణాలను తొలగిస్తాయి. టొమాటో చర్మ రంగులో సహజంగానే నిగారింపు తీసుకొస్తుంది. చర్మ రంధ్రాల లోపలికి వెళ్లి అక్కడ ఉన్న మురికి, చెత్తను క్లీన్ చేస్తుంది. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

టొమాటో, చక్కెర ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో తాజా టొమాటో పల్ప్ తీసుకోండి. మీ అవసరం మేరకు కొంచెం చక్కెర వేయండి. బాగా కలిపి గట్టి స్క్రబ్ లాంటి మిశ్రమం తయారు చేయండి. ఈ మిక్స్ చేసిన పేస్ట్‌ని ముఖం మీద సమానంగా పూయండి. 10 నిమిషాలు అలాగే ఉంచండి. తీసేటప్పుడు మెత్తగా మసాజ్ చేస్తూ తొలగించండి. దీంతో చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా అనిపిస్తుంది.

టొమాటో, ఓట్స్ ఫేస్ ప్యాక్

Advertisement

ఈ ప్యాక్.. స్కిన్ టాన్ తొలగించి, చనిపోయిన చర్మ కణాలను తీసివేస్తుంది. ఒక టీస్పూన్ ఓట్స్‌ను పొడిగా నూరుకోండి. దానికి తాజా టొమాటో రసం కలపండి. మెత్తటి పేస్ట్ లాగా కలిపి, ముఖం మీద సమానంగా అప్లై చేయండి. 15 నుంచి 20 నిమిషాలు ఉంచండి. తీసేటప్పుడు మెత్తగా రుద్దుతూ కడగండి. ఇది మురికి, చనిపోయిన చర్మ లేయర్‌ను తొలగించి, చర్మాన్ని శుభ్రంగా, మెరుగ్గా చేస్తుంది.

టొమాటో, బియ్యం పిండి ఫేస్ ప్యాక్

బియ్యం పిండి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పని చేస్తుంది. ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల బియ్యం పిండి తీసుకోండి. తగినంత టొమాటో రసం కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద సమానంగా పూయండి. 15 నుంచి 20 నిమిషాలు ఉంచి, వృత్తాకారంగా మెత్తగా రుద్దుతూ కడగండి. ఈ ప్యాక్ చనిపోయిన చర్మ కణాలను సమర్థవంతంగా తొలగించి, చర్మ ఆకృతి, నిగారింపు మెరుగుపరుస్తుంది.

Also Read: లిప్‌స్టిక్ లేకుండా గులాబి రంగులో మృదువైన పెదాలు.. ఇంట్లోనే నేచురల్ లిప్ బామ్ తయారు చేయండి

మృతకణాలను తొలగించే ఇతర పదార్థాలు

పచ్చి పాలు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తాయి. పాలలో పత్తి ముంచి ముఖం మీద అప్లై చేసి, కొన్ని నిమిషాలు మెత్తగా రుద్ది కడగండి. తేనె, ఓట్ మీల్ కలిపి మంచి స్క్రబ్ తయారవుతుంది. చక్కెరను ఆలివ్ ఆయిల్‌తో కలిపి మసాజ్ చేస్తే పొడి చర్మాన్ని తొలగించి, తేమను అందిస్తుంది.

మృత చర్మ కణాలు ముఖాన్ని నిస్తేజంగా చేస్తాయి. సహజమైన నివారణలతో సులభంగా చర్మం నిగారింపు పొందవచ్చు. టొమాటో ఫేస్ ప్యాక్‌లు సులభం, ప్రభావవంతమైనవి. వాటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మీ చర్మం మెత్తగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.

ముఖ్య గమనిక: ఈ వ్యాసంలో ఉన్నది  సాధారణ సమాచారం మాత్రమే. ఫేస్ ప్యాక్‌లు, ఇంటి చిట్కాలతో సమస్య పరిష్కారం కాకపోతే  చర్మ సమస్య తీవ్రంగా ఉన్నట్లు. సరైన చికిత్స కోసం వైద్య నిపుణులను తప్పక సంప్రదించాలి.

Related News

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

Big Stories

Advertisement
×