E-Paper
Advertisement

లిప్‌స్టిక్ లేకుండా గులాబి రంగులో మృదువైన పెదాలు.. ఇంట్లోనే నేచురల్ లిప్ బామ్ తయారు చేయండి

లిప్‌స్టిక్ లేకుండా గులాబి రంగులో మృదువైన పెదాలు.. ఇంట్లోనే నేచురల్ లిప్ బామ్ తయారు చేయండి
Advertisement

Natural Pink Lip Balm| మృదువైన గులాబీ పెదాలు.. అందం, ఆరోగ్యం రెండింటికీ ప్రతీక. అయితే చాలా మందికి పొడి పెదాలు, నల్లటి పెదాల సమస్య ఇబ్బందిపెడుతూ ఉంటుంది. సరైన సంరక్షణ లేకపోవడం వల్ల పెదాల అందం, ఆకారం దెబ్బతింటాయి. మార్కెట్‌లో లభించే కెమికల్ లిప్ కేర్, లిప్ స్టిక్‌లు కూడా చర్మానికి హాని కలిగించవచ్చు. అందుకే ప్రకృతిపరమైన పదార్థాలతో సహజంగా ఇంట్లోనే పెదాల అందాన్ని కాపాడుకోవచ్చు. దీని కోసం ఇంట్లోనే తయారు చేసుకునే రోజ్ లిప్ బామ్ చాలా సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం.

నేచురల్ లిప్ బామ్ ఎందుకు బెస్ట్?

సహజ పదార్థాలు పెదాల చర్మాన్ని మృదువుగా చేస్తాయి. వాటి వల్ల చికాకు లేదా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇంట్లో తయారు చేసే లిప్ బామ్‌లో హానికరమైన కెమికల్స్ ఉండవు. ఇది పెదాలను లోపలి నుంచి తేమ, పోషణ అందిస్తాయి. క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల పెదాలు మెత్తగా, గులాబి రంగులోకి మారతాయి. ఇది చాలా తక్కువ ఖర్చుతో, సులభంగా తయారు చేసుకోవచ్చు.

గులాబి లిప్ బామ్ తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు

Advertisement

తాజా ఎర్ర గులాబీ రేకులు
1 టీస్పూన్ వర్జిన్ కొబ్బరి నూనె
అర్ధ టీస్పూన్ గ్లిసరిన్
అర్ధ టీస్పూన్ విటమిన్ ఇ ఆయిల్ (లేదా క్యాప్సూల్)

ఇవన్నీ పెదాలకు పోషణ, తేమ అందిస్తాయి.

గులాబి లిప్ బామ్ ప్రయోజనాలు

Advertisement

ఇందులోని గులాబీ రేకుల రసం పెదాల సహజ రంగును మెరుగుపరుస్తాయి. కూల్ చేసి పెదాల భాగంతో వేడిని తగ్గిస్తాయి. కొబ్బరి నూనె.. పొడి పెదాలను లోతుగా తేమ చేసి దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. గ్లిసరిన్ తేమ కోల్పోకుండా స్టోర్ చేస్తుంది. విటమిన్ ఇ.. చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఈ పవర్‌ఫుల్ పదార్థాలు ఉండడంతో లిప్ కేర్ సమర్థవంతంగా పనిచేస్తుంది.

స్టెప్ బై స్టెప్ తయారీ

ముందుగా గులాబీ రేకులను శుభ్రమైన నీటితో కడగండి. మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయండి. ఒక గిన్నెలో కొబ్బరి నూనె వేసి, రోజ్ పేస్ట్‌ను కలపండి. గ్లిసరిన్, ‘విటమిన్ ఇ’ ఆయిల్ జోడించి బాగా కలపండి. పేస్ట్ ముద్దలు లేకుండా స్మూత్‌గా మిక్స్ చేయండి. శుభ్రమైన గాజు బాటిల్‌లో పోసి, రెండు-మూడు గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి. గట్టిపడిన తర్వాత మీ సహజ లిప్ బామ్ సిద్ధం.

ఎలా ఉపయోగించాలి?

రోజుకు 2-3 సార్లు పెదాలకు అప్లై చేయండి. రాత్రి నిద్రపోయేముందు కూడా పెదాలకు పూస్తే బాగుంటుంది. క్రమం తప్పకుండా వాడటం వల్ల పెదాలు మృదువుగా, గులాబీ రంగులోకి మారతాయి.

ఈ జాగ్రత్తలు పాటించండి

మొదటిసారి వినియోగించే ముందు చిన్న ప్యాచ్ టెస్ట్ చేయండి.
ఈ హోమ్‌మేడ్ లిప్ బామ్‌లో ప్రిజర్వేటివ్స్ ఉండడంతో దీని షెల్ఫ్ లైఫ్ తక్కువ. అందుకే చల్లని, శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి.
త్వరగా ఎక్స్‌పైర్ అవుతుంది కాబట్టి ఇందులో తాజా పదార్థాలు ఉపయోగించండి.

Also Read:  ఆ దేశంలో టాయ్‌లెట్ సీట్‌కు పూజలు చేస్తున్న ప్రజలు.. ఈ సంప్రదాయం వెనుక విచిత్ర కారణం

ఇంట్లో తయారు చేసుకునే రోజ్ లిప్ బామ్.. అందమైన పెదాల కావాలనుకునేవారికి సురక్షితమైన, సహజమైన పరిష్కారం. ఇది పెదాలను మృదువుగా, సహజ గులాబీ రంగులోకి మార్చుతుంది. సాధారణ పదార్థాలతో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. సహజ సంరక్షణతో అందమైన, ఆరోగ్యకరమైన పెదాలను పొందండి.

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×