Gundeninda GudiGantalu Today episode April 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. శివ ఎక్కడ కనిపించడం లేదు అని అనగానే సుమతి మీ అమ్మగారు వచ్చి వాడిని కొట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలియడం లేదు బావ అని అంటుంది. అయితే నేను వచ్చేటప్పుడు వాడి బైక్ అక్కడే ఉండింది మూడంతస్తుల బిల్డింగ్ వైపు వెళుతున్నాడు. వాడు ఏమైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడా ఏంటి అని బాలు అనగానే అందరూ కంగారుపడి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు.. అయితే పైకి వెళ్ళిన శివని చూసి బాలు వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతుంటారు. మీరు ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను అని శివ అంటాడు. నన్ను దొంగ అని ఊరందరూ ముద్ర వేశారు నేను ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావడం లేదు. నన్ను పోలీసులు తీసుకెళ్లిపోతారా అని బాధ పడిపోతూ ఉంటాడు.
మీ అక్క వాళ్ళని మీ అమ్మని చూసైనా ఒకసారి ఆగరా ఏం చేస్తున్నావ్ రా అనే బాలు అంటూ ఉంటాడు. ఇక మొత్తానికి అక్కడి నుంచి దూకపోతున్న శివనే కాపాడి బాలు పక్కకు తీసుకొని వస్తాడు. నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని బాలు మాట ఇస్తాడు..సత్యంతో బాలు ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం వాడొక దొంగ అని పదేపదే అని మీనా అని బాధ పెడుతుంది.. నాన్న నేను చెప్పేది వినండి నాన్న వాడు డబ్బులు దొంగతనం చేశాడు కానీ అమ్మ చేసిన పనికి వాడు అలా చేశాడు.. ప్రభావతి మాత్రం పెట్టె సద్దుకొని కామాక్షి ఇంటికి వెళుతుంది. ఇంటికొచ్చిన శోభ దగ్గర రోహిణి అంతా కక్కేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శోభ రవి వాళ్ళ గదిలోకి వెళ్లి మాట్లాడుతుంది. కానీ శృతి మాత్రం శోభ కి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతుంది.. మీరు చుట్టాల మాటలు మోసుకొని వచ్చి ఇలా మాట్లాడడం మంచిది కాదు అని రవి కూడా అంటాడు. మీరిద్దరూ కలిసి నన్ను అవమానిస్తున్నారు అని శోభా అంటుంది. సుమతి పోలీసులు వచ్చి పార్వతీని తీసుకొని పోలీస్ స్టేషన్కు వచ్చారని చెప్పగానే బాలు మీనా అక్కడికి వెళ్తారు.. పార్వతిని పోలీసులు తీసుకుని వెళ్లినట్లు సుమతి మీనాకు ఫోన్ చేసి చెప్తుంది. బాలు మీనా ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళగానే పార్వతీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. వాడు చేసిన తప్పుకి నాకేంటి శిక్ష ఈ వయసులో నేను పోలీస్ స్టేషన్కు రావడం ఏంటి అని పార్వతి బాధ పడిపోతూ ఉంటుంది.
వాడు దొంగతనం చేస్తే.. వాడికి నన్ను అరెస్ట్ చేశారు నాకు భయంగా ఉంది అని అనగానే బాలు ఎస్ఐతో మాట్లాడతాడు. సర్ వాడు తప్పు చేస్తే మా అత్తయ్య గారిని ఎందుకు తీసుకొచ్చారు సార్ అని అడుగుతారు.. వదిలేస్తే మీనా బాలు ఇద్దరు కలిసి ఎస్ఐ తో మాట్లాడి పార్వతిని బయటకు తీసుకొని వచ్చేస్తారు.. ఇక పార్వతిని ఇంటికి తీసుకురాగానే సుమతీకి కాబోయే భర్త వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి వస్తారు.. మాకు ఈ పెళ్లి వద్దు ఈ సంబంధం వద్దు అని వాళ్ళు తెగేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. మీరు ఏం బాధపడకండి అత్తయ్య మేం వెళ్లి లాయర్ ని కలిసేసి వస్తాము అని బాలు మీనా ఇద్దరు కలిసి లాయర్ ని కలవడానికి వెళ్తారు..
అక్కడ లాయర్ చెప్పింది విని ఇద్దరూ షాక్ అయిపోతారు.. ఈ కేసు నుంచి మనం ఎలాగైనా బయటపడాలి అనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టాలి అని లాయర్ అంటాడు. ఆ తర్వాత కేసు పెట్టిన వాళ్ళు ఆ కేసును వెనక్కి తీసుకుంటే ఈ సమస్య పూర్తవుతుంది అని లాయర్ అంటాడు. మనము అత్తయ్యని ఒప్పించడం కష్టం నాన్న చెప్తే కచ్చితంగా అమ్మ ఒప్పుకుంటుంది. ముందు నాన్న ఒప్పించాలి అని బాలు మీనా ఇంటికి వెళ్లి సత్యంతో మాట్లాడాలని అనుకుంటారు.. శివ చేసింది తప్పే కాకపోతే వాడు ఆవేశంలో చేసిన తప్పుకి ఇప్పుడు అందరు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది అని బాలు అంటాడు. వాడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అని బాలు అనుకుంటాడు..
వద్దు నాన్న అలాంటి దొంగని బయటికి తీసుకురావద్దు అని మనోజ్ అంటాడు. వాన్ని జైలుకు పంపించాల్సిందే అని మనోజ్ అనగానే మీనా మీరు నా నగలు నువ్వు తీసుకుని వెళ్ళినప్పుడు నేనేమైనా జైలుకి పంపించాన అని అంటుంది.. మీరు ఎన్ని తప్పులు చేసినా మేము ఎవరో పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు కదా అని ఎంత చెప్తున్నారు సరే మనోజ్ మాత్రం మీరు అమ్మతో ఏమీ మాట్లాడద్దు నాన్న అని అంటాడు. జైలుకు వెళ్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు నాన్న అని బాలు కన్నీళ్లు పెట్టుకుంటాడు.. జైలుకు వెళ్లితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అని తను చెప్పగానే మనోజ్ మౌనంగా ఉండిపోతాడు.. ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు.. బాలు వాడు జైలుకు వెళ్తే చాలా నష్టము జరుగుతుంది నాన్న అని చెప్తాడు. ఇక సత్యం ప్రభావతి తో మాట్లాడడానికి కామాక్షి ఇంటికి వెళ్తాడు. ప్రభావతి దగ్గరికి సత్యం రాగానే కామాక్షి సెటైర్లు వేస్తుంది.. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి నేను బయటకు వెళ్లి వస్తాను అని కామాక్షి అంటుంది..
Also Read : చక్రీకి షాకిచ్చిన మహా.. నారాయణకు నిద్ర లేకుండా చేసిన మహా.. కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్..
ప్రభావతితో సత్యం మాట్లాడడానికి లోపలికి వెళ్తాడు. ప్రభావతిని ఎలా ఉన్నావు అని అడుగుతారు సత్యం. మీరేమైనా తిన్నారా అని అడుగుతుంది.. మనము ఎన్ని గొడవలు పడ్డ కూడా ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోలేదు అని ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. జీవితంలో ఏ భర్త అయినా ఎవరికి ఇచ్చే విలువ వాళ్లకు ఇస్తాడు అని అనగానే.. ప్రభావతి నా కండిషన్స్ కి ఒప్పుకొని నన్ను తీసుకెళ్లడానికి వచ్చారని అడుగుతుంది. కేసు వెనక్కి తీసుకోమని అడగడానికి వచ్చాను అని సత్యం చెప్పగానే ప్రభావతి షాక్ అయిపోతుంది. మొత్తానికి ప్రభావతి కేసు వెనక తీసుకోవడానికి ఒప్పుకుంటుంది.. ఆ మీనా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుంది.. సత్యం ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం తన మాటే నెగ్గాలని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..