E-Paper
Advertisement

Ginger Chicken: జింజర్ చికెన్ ఫ్రై తిన్నారంటే రుచి మర్చిపోలేరు, రెసిపీ ఇదిగో

Ginger Chicken: జింజర్ చికెన్ ఫ్రై తిన్నారంటే రుచి మర్చిపోలేరు, రెసిపీ ఇదిగో
Advertisement

జింజర్ చికెన్ వేపుడు అంటే అల్లంతో చేసే చికెన్ ఫ్రై. మసాలాలు దంచి చేసే ఈ చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది ఈ ప్రత్యేకమైన చికెన్ వంటకం. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు ఉన్నవారికి అల్లం మంచి ఔషధంలా పనిచేస్తుంది. అలాంటి అల్లాన్ని ప్రధానంగా ఉపయోగించి చేసే ఈ జింజర్ చికెన్ రెసిపీ ఇంట్లో చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. దీని రెసిపీ తెలుగులో ఎలా చేయాలో తెలుసుకోండి.

జింజర్ చికెన్ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ – ఒక కిలో
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – పావు టీ స్పూన్
కారం పొడి – రెండు స్పూన్లు
ధనియాల పొడి – రెండు స్పూన్లు
నూనె – 4 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు – మూడు
అల్లం పేస్ట్ – 3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
టమోటాలు – రెండు
గరం మసాలా – అర స్పూన్
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

Advertisement

జింజర్ చికెన్ ఫ్రై రెసిపీ
1. ముందుగా చికెన్ ముక్కలను నీళ్లతో బాగా కడిగి ఒక పెద్ద గిన్నెలో వేయాలి.
2. అందులో ఉప్పు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మసాలా చికెన్ ముక్కలకు అన్ని వైపులా పట్టేలా చేతులతో బాగా కలపాలి.
3. ఇలా కలిపిన చికెన్‌ను కనీసం 20 నిమిషాలు మారినేట్ చేయాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి.
5. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు లేత గోధుమ రంగుకు మారే వరకు వేయిస్తే మంచి రుచి వస్తుంది.
6. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో అల్లం పేస్ట్, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. అల్లం వాసన వచ్చే వరకు 2–3 నిమిషాలు వేయించాలి.
7. ఇప్పుడు తరిగిన టమోటాలు వేసి కలపాలి. టమోటాలు మెత్తబడే వరకు మగ్గించాలి.
8. మసాలా సిద్ధమైన తర్వాత ముందుగా నానబెట్టిన చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి.
9. చికెన్ వేసిన తర్వాత కొద్దిసేపటికి అందులోనుంచి నీరు వస్తుంది. అదనంగా నీరు పోసాల్సిన అవసరం ఉండదు.
10. గ్రేవీ ఎక్కువ కావాలంటే అర కప్పు నీరు వేసుకోవచ్చు. మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు మగ్గనివ్వాలి.
11. మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ చికెన్ ఉడికిందో లేదో చూడాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత గరం మసాలా వేసి బాగా కలపాలి.
12. చివరగా స్టవ్ ఆపి పైన కొత్తిమీర తరిగి చల్లి అలంకరించాలి. అంటే టేస్టీ జింజర్ చికెన్ వేపుడు రెడీ అయినట్టే.

ఈ జింజర్ చికెన్ వేపుడు అన్నం, చపాతీ, రోటీ, నాన్‌తో తింటే అదిరిపోతుంది. అల్లం ఎక్కువగా ఇష్టపడేవారు చివర్లో కొద్దిగా సన్నగా తరిగిన అల్లం కూడా వేసుకోవచ్చు. చలికాలంలో ఈ వంటకం శరీరానికి వేడి ఇస్తుంది.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×