E-Paper
Advertisement

IPL Auction 2026: కిరణ్ కుమార్ చాణ‌క్యం..ఢిల్లీలోకి 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన ప్లేయ‌ర్‌, త‌క్కువ ధ‌ర‌కే డేంజ‌ర్ ఆట‌గాళ్లు

IPL Auction 2026:  కిరణ్ కుమార్ చాణ‌క్యం..ఢిల్లీలోకి 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన ప్లేయ‌ర్‌, త‌క్కువ ధ‌ర‌కే డేంజ‌ర్ ఆట‌గాళ్లు
Advertisement

IPL Auction 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కాసేపటికి క్రితమే మినీ వేలం ప్రారంభమైంది. UAE లోని అబుదాబి వేదికగా ప్రారంభమైన ఈ మినీ వేలంలో ఎవరు ఊహించని విధంగా ప్లేయర్లు ధర పలుకుతున్నారు. బాగా ఆడే ప్లేయర్లపై తక్కువ డబ్బులు పెడుతున్న ఫ్రాంచైజీలు, దేశవాళి క్రికెట్ లో సత్తా చాటే వారిపై కోట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ సహా ఓనర్, అపర చాణిక్యుడు కిరణ్ కుమార్ గ్రాంధి మరోసారి తన మెదడుకు పని చెప్పాడు.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

కిరణ్ కుమార్ గ్రంధి చాణ‌క్యం

Advertisement

ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్ ప్లేయర్ ఆకిబ్ నబి దార్ ను ఊహించని ధరకు కొనుగోలు చేశారు. ఈ వేలంలో ఏకంగా 8.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అంతర్జాతీయ ప్లేయర్లకు తక్కువ ధర పెట్టి, ఇతనికి మాత్రం భారీ ధర పెట్టింది ఢిల్లీ. సన్రైజర్స్ ఇతని కొనుగోలు చేయాలని చాలా ప్రయత్నించినప్పటికీ, కిరణ్ కుమార్ చాలా తెలివిగా ఆకిబ్ నబి దార్ ను 8.4 కోట్లకు కొనుగోలు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇటీవల ఏడు మ్యాచ్ లో ఏకంగా 14 వికెట్లు తీశాడు ఆకిబ్ నబి దార్‌.

అంతేకాదు గతంలో దిలీప్ ట్రోఫీలో 4 బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన చరిత్ర కూడా ఇతనికి ఉంది. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ ఆకిబ్ నబి దార్‌. అటు డేవిడ్ మిల్లర్ ను ఏడు కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, బెన్ డకేట్ ను కూడా రెండు కోట్లకే కొనుగోలు చేసింది. డేవిడ్ మిల్లర్ తో పాటు బెన్ డ‌కేట్ ఇద్దరూ విదేశీ ప్లేయర్లు. బాగా ఆడగల సత్తా ఉన్నవాళ్లు. అలాంటి వాళ్లను కేవలం రెండు కోట్లకే కొనుగోలు చేసి, ఆకిబ్ నబి దార్ ను మాత్రం 8.40 కోట్లకు కొన్నాడు కిరణ్ కుమార్. ఇలా తన చాణక్యంతో ఇలా అడుగులు వేసినట్లు కిరణ్ కుమార్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Advertisement

Also Read: Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×