E-Paper
Advertisement

AA22xA6 : అట్లీ అల్లు అర్జున్ సినిమా కోసం భారీ వాటర్ సీక్వెన్స్

AA22xA6 : అట్లీ అల్లు అర్జున్ సినిమా కోసం భారీ వాటర్ సీక్వెన్స్
Advertisement

AA22xA6 : ప్రముఖ దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అట్లీ రాజా రాణి సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా తర్వాత ఏకంగా స్టార్ హీరో విజయ్ తో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు అట్లీ. విజయ్ తో అట్లీ ఏకంగా మూడు సినిమాలు చేశాడు. ఆ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి.

ఇక అట్లీ కెరియర్ లో 1000 కోట్ల సినిమా కూడా ఉంది. షారుక్ ఖాన్ హీరోగా చేసిన జవాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ సాధించింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల కానుంది. సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

వాటర్ సీక్వెన్స్ 

Advertisement

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలో ఒక భారీ వాటర్ సీక్వెన్స్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈరోజుల్లో ఇండియన్ సినిమా హాలీవుడ్ రేంజ్ కు వెళ్ళిపోయింది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఇప్పుడు ప్రేక్షకులకు విపరీతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి నేటి దర్శకులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఈ ప్రాసెస్ లోనే అల్లు అర్జున్ సినిమాలో ఒక వాటర్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్ అంతా కూడా రంగంలోకి దిగిపోతున్నట్లు తెలుస్తుంది.

త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పక్కన 

మామూలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేస్తాడు అని గతంలో అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతున్నట్లు అప్పట్లో అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ మీరు కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి.

Advertisement

అయితే అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాతో త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో లాంచ్ అవుతాడు అని అందరూ ఊహించరు. కానీ ఆ ప్రాజెక్టు కొన్ని కారణాల వలన ఇమీడియట్ గా పట్టాలేకపోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ తో ఆనంద నిలయం అనే సినిమాను మొదలుపెట్టేశారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

Also Read: Naga Chaitanya: క్లాక్స్ దర్శకత్వంలో నాగ చైతన్య, వృషకర్మ ప్రాజెక్టు తర్వాత ఆ సినిమానే

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×