ప్రాచీన భారతదేశానికి చెందిన మహానీతిశాస్త్రజ్ఞుడు ఆచార్య ఛాణక్యుడు. అతడు మనిషి జీవన విధానంలో అవసరమైన నైతిక విలువలను ముందే అంచనా వేసి స్పష్టంగా చెప్పేశాడు. ఆయన చెప్పిన సూక్తులు ఇప్పటికీ కుటుంబం, సమాజం, సంబంధాల విషయంలో ఆచరించదగినవే. ఆధునిక కాలంలో యువత సంబంధాలకు, వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. చాణక్యుడు చెప్పిన ప్రకారం ఆధునిక కాలంలో అమ్మాయిలకు నచ్చాలంటే అబ్బాయిలకు కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకోండి.
ప్రశాంతంగా ఉండేవారు
మొదటగా చాణక్యుడు చెప్పిన ప్రధాన లక్షణం ప్రశాంత స్వభావం. పురుషుడు ఎంత ధనవంతుడైనా, ఎంత ప్రతిభావంతుడైనా.. అతడికి శాంతంగా ఉండే గుణం ఉంటేనే అమ్మాయిలకు నచ్చుతాడు. మగాడు ప్రశాంతంగగా లేకపోతే కుటుంబం స్థిరంగా ఉండదని చాణక్యుడు చెబుతారు. కోపం, ఆవేశం ఎక్కువగా ఉండే వ్యక్తితో జీవించేందుకు మహిళలు ఇష్టపడరని కూడా ఆయన చెప్పారు. ఏ సమస్య వచ్చినా శాంతంగా ఆలోచించి, అర్థం చేసుకుని ముందుకు సాగడం మహిళలకు భద్రతను, విశ్వాసాన్ని కలిగిస్తుందని ఆయన ముందే చెప్పారు.
నిజాయితీ ఉన్న వ్యక్తి
మగవారికి ఉండాల్సిన రెండవ ప్రధాన లక్షణం నిజాయితీ. మహిళలు మోసం చేసే, మాట తప్పే వ్యక్తులను అస్సలు ఇష్టపడరని చాణక్యుడు స్పష్టం చేశారు. సంబంధంలో నమ్మకం అత్యంత పెద్ద బలం. మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం, ఆలోచనల్లో, పనుల్లో నిజాయితీ ఉండడం ఒక పురుషుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం. సంబంధం ఎక్కువకాలం నిలబడాలంటే నమ్మకం, నిజాయితీ ముఖ్యం. అబద్ధాలు చెప్పే వ్యక్తితో జీవించేందుకు స్త్రీలు ఏమాత్రం ఇష్టపడరు. నిజాయితీతో వ్యవహరించే పురుషులు మహిళలకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారని చాణక్యుడు చెప్పాడు.
మంచి వ్యక్తిత్వం
చాణక్యుడు ప్రత్యేకంగా చెప్పిన మరో లక్షణం శక్తివంతమైన వ్యక్తిత్వం. ఒక పురుషుడు ఎలా మాట్లాడతాడో, ఎలా ఆలోచిస్తాడో, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాడో… ఇవన్నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. మహిళలు బయటికి కనిపించే అందం కంటే వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నిగ్రహం, బాధ్యత, మానవత్వం, నిర్ణయశక్తి, క్రమశిక్షణ వంటి లక్షణాలు ఉన్న పురుషులు మహిళలకు అందంగా కనిపిస్తారు.
ఓపికగా వినే వ్యక్తి
చాణక్యుడు చెప్పిన ప్రకారం చెప్పింది ఓపికగా వినే శక్తి ఉన్న మగవారు స్త్రీలకు బాగా నచ్చుతారు. ఒక మహిళ తన మనసులోని మాటలు, బాధలు, ఆలోచనలు వ్యక్తం చేస్తున్నప్పుడు వాటిని శ్రద్ధగా వింటున్న పురుషులు మహిళలకు ఎంతో ఇష్టం. మాట్లాడటం కంటే వినడాన్ని ఇష్టపడే వారినే స్త్రీలకు ఇష్టమని చాణక్యుడు అన్నారు. తమను అర్థం చేసుకోగలిగే వ్యక్తి ఒక మంచి భాగస్వామి అవుతాడని మహిళలు చెబుతున్నారు. రోజువారీ జీవితంలో చిన్న సమస్యలనైనా శ్రద్ధగా విని స్పందించే పురుషుడే తమ భార్యను సంతోషంగా చూసుకోగలుగుతాడు.
ప్రశాంతత, నిజాయితీ, మంచి వ్యక్తిత్వం, వినగలిగే గుణం… ఇలాంటి లక్షణాలు ఉన్న పురుషులు ఎప్పటికీ మహిళలకు ఆదర్శ భాగస్వాములుగా కనిపిస్తారన్నది చాణక్యుడి భావన. పురుషులు ఈ లక్షణాలను అలవాటు చేసుకుంటే కుటుంబం బలపడుతుంది. వారిని పెళ్లాడిన మహిళలు సంతోషంగా ఉంటారు.