E-Paper
Advertisement

Akhanda 2 OTT: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న అఖండ 2… డేట్ ఎప్పుడంటే?

Akhanda 2 OTT: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న అఖండ 2… డేట్ ఎప్పుడంటే?
Advertisement

Akhanda 2 OTT: బాలకృష్ణ హీరోగా నటించిన ఆఖండ 2(Akhanda 2) సినిమా ఎన్నో అవంతరాలను తొలగించుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటేనే సినిమాల పట్ల మంచి అంచనాలు ఉంటాయి. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ కావడంతో అఖండ 2 సినిమాపై కూడా అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎన్నో అంచనాల నడుము విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అఖండ సినిమాకు, సీక్వెల్ సినిమ కు పెద్దగా తేడా లేదని, కొన్నిచోట్ల అఖండ సినిమానే తలపిస్తుందని తెలుస్తోంది. రోటీను కథతోనే బోయపాటి ఈ సినిమాని చేశారు అంటూ ప్రేక్షకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య అభిమానులు మాత్రం ఈ సినిమా విషయంలో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్ చేతికి అఖండ 2 రైట్స్..

ఇలా ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టాయని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఫైనాన్స్ సమస్యల కారణంగా వాయిదా పడుతూ డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రసారమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీకి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్(Net flix) భారీ ధరలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు  సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

నెలరోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి..

Advertisement

ఈ సినిమా జనవరి 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమాని డిజిటల్ మీడియాలో ప్రసారం చేయాలని భావించినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను సుమారు 80 కోట్లకు పైగా కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. థియేటర్లో విడుదలైన నెలరోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి రావటం విశేషం.

అఘోరీ పాత్రలో మెప్పించిన బాలయ్య..

Advertisement

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. బాలకృష్ణ అఘోరా పాత్రలోనూ, అలాగే ఎమ్మెల్యేగా రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యే పాత్రలో కంటే అఘోరి పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించగా హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించిన సందడి చేశారు. 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రామ్ అచంట, గోపి అచంట నిర్మించారు. ప్రస్తుతం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ వీకెండ్ లో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం భారీ స్థాయిలో వచ్చాయని తెలుస్తోంది.

Also Read: Akhanda 2 Publice Reaction: అఖండ 2పై పబ్లిక్ రియాక్షన్.. అసలు వీరు మారరా?

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×